ఇంటర్ విద్యార్థులకు ఫ్రీ స్టడీ మెటీరియల్

ఇంటర్ విద్యార్థులకు ఫ్రీ స్టడీ మెటీరియల్

ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులందరికీ ఉచితంగా స్టడీ మెటీరియల్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జూనియర్ కాలేజీల్లో ఉచితంగా నాణ్యమైన విద్యను అందించడంతో పాటు కార్పొటరేట్ కాలేజీలకు ధీటుగా స్టడీ మెటీరియల్ ను రూపొందించామన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ప్రభుత్వ జూనియర్ కాలేజీలతో పాటు కస్లూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు, మోడల్స్ స్కూళ్ళల్లోనూ విద్యార్థులందరికీ వీటిని అందించాలని మంత్రి ఆదేశించారు. దీంతో రాష్ట్రంలో 3 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. వారం రోజుల్లో స్టడీ మెటీరియల్ అందుబాటులోకి తేవాలని మంత్రి ఆదేశించారు.

ప్రస్తుతం www.tsbie.cgg.gov.in వెబ్ సైట్ లో మెటీరియల్ కొన్ని సబ్జెక్టులకు అందుబాటులోకి వచ్చింది. ఇంటర్ సెకండియర్ కు సంబంధించి జువాలజీ, మ్యాథ్స్, కెమిస్ట్రీ, బోటనీ, ఫిజిక్స్ మెటీరియల్ అందుబాటులో ఉంది. విద్యార్థులు ఈ మెటీరియల్ ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

website link : https://tsbie.cgg.gov.in/home.do;jsessionid=CAF4EDEF470FA5F3E830544FCE930871