ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ రద్దు – సెకండియర్ వాయిదా

ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ రద్దు – సెకండియర్ వాయిదా

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రబుత్వం నిర్ణయం తీసుకుంది.  అయితే సెకండియర్ పరీక్షలను ప్రస్తుతానికి వాయిదా వేశారు.  సెకండియర్ పరీక్షలను ఎప్పుడు నిర్వహించాలన్న దానిపై జూన్ మొదటి వారంలో విద్యాశాఖాధికారులు నిర్ణయం తీసుకుంటారు.  అప్పటి పరిస్థితులను బట్టి పరీక్షల తేదీలను  15 రోజుల ముందుగా ఎగ్జామ్స్ షెడ్యూల్ ను ప్రకటించనున్నారు.  అలాగే ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను  అవసరమైతే భవిష్యత్తులో నిర్వహించే అవకాశం ఉంది. ఇక ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు ఉన్న బ్యాక్ లాగ్ సబ్జెక్టులకు మినిమం పాసింగ్ మార్కులు కేటాయించి పాస్ చేస్తారు.

అలాగే ఎమ్ సెట్ లో ఈసారి ఇంటర్మీడియట్ మార్కుల వెయిటేజ్ ను తొలగిస్తున్నట్టు ప్రభుత్వం అధికారులు ప్రకటించారు.