ఇంటర్ సెకండియర్ ఫలితాలు రిలీజ్

ఇంటర్ సెకండియర్ ఫలితాలు రిలీజ్

తెలంగాణలో ఇంటర్మీడియట్ సెకండియర్ ఫలితాలు వెల్లడయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రిజల్ట్స్ ను రిలీజ్ చేశారు. ఇంటర్ సెకండియర్ పరీక్ష ఫీజు చెల్లించిన 4,51,585 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీళ్ళల్లో బాలికలు 2,28,754 మంది, బాలురు 2,22,831 మంది.
మొత్తం పాసైన వారిలో ఏ గ్రేడ్ లో 1,76,719 మంది, బి గ్రేడ్ లో : 1,04,886 మంది, సీ గ్రేడ్ లో : 61,887 మంది, డీ గ్రేడ్ లో 1,08,093 మంది
ఇంటర్ ఫస్టియర్ లో సంబంధిత సబ్జెక్టులో ఎన్ని మార్కులు వచ్చాయో... సెకండియర్ లోనూ అవే మార్కులు ఇచ్చారు. ప్రాక్టికల్స్ లో అందరికీ సెంట్ పర్సంట్ వేశారు. గతంలో ఫెయిల్ అయిన సబ్జెక్టులకు మాత్రం పాస్ మార్కులు ఇచ్చారు.
ఫలితాలు తెలుసుకోడానికి:
http://tsbie.cgg.gov.in
http://examresults.ts.nic.in
http://results.cgg.gov.in
వెబ్ సైట్లు చూడవచ్చు.

ఫస్టియర్ ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ ను ఎంటర్ చేస్తే... సెకండియర్ ఫలితాలు వస్తాయి. గతంలో ఫెయిల్ అయిన స్టూడెంట్స్ తమ పూర్వ హాల్ టికెట్ నెంబర్ ను ఎంటర్ చేసి మార్కులు పొందవచ్చు. విద్యార్థులెవరైనా ఈ మార్కులతో satisfy కాకపోతే... కరోనా పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహిస్తామన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.

పాస్ మార్కుల జాబితాలో ఏమైనా తప్పులు ఉంటే 040 24600110 నెంబర్ కు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5.30 లోపు కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు.