Monday, July 22

ఐసెట్ 2019 షెడ్యూల్ రిలీజ్

కాకతీయ యూనివర్సిటీ నిర్వహించే... TS ఐసెట్ 2019 షెడ్యూల్ ను విడుదల చేశారు ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి,ఐసెట్ చైర్మన్, విసి ప్రో. సాయన్న.

2019లో MBA, MCA ఎంట్రెన్స్ పరీక్షల షెడ్యూల్ రిలీజైంది.
ఈనెల 21న నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది
మే 23, 24 తేదీల్లో ICET నిర్వహిస్తారు
మార్చి 7 నుంచి ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోడానికి అవకాశం ఉంటుంది

ఎగ్జామ్ ఫీజులు:

SC/ST లకు రూ.450
ఇతరులు రూ.650

500 రూపాయల అపరాధ రుసుము మే 6నుంచి 10 వరకు
2000 రూపాయలతో మే11 నుంచి 14 వరకు
5000 రూపాయలతో మే15 నుంచి 17వరకు
10,000 అపరాధ రుసుము మే 18 చివరి తేదీ వరకు ..

19మే నుంచి హాల్ టిక్కెట్స్ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు

ప్రిలిమినరీ కీని మే 29న విడుదల చేస్తారు.

అభ్యంతరాల స్వీకరణకు జూన్ 1 వ తేదీ వరకూ టైమ్ ఇస్తారు

3 జూన్ 2019న పరీక్ష ఫలితాలు విడుదల అవుతాయి

మన రాష్ట్రంలో 10 సెంటర్లలో, ఏపీలో నాలుగు కేంద్రాల్లో ఐసెట్ ఎగ్జామ్స్ జరుగుతాయి