బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపేరయ్యే నిరుద్యోగుల కోసం Institute of Banking Personal Selection (IBPS) 2023-24 కేలండర్ రిలీజ్ చేసింది. ఈ సంవత్సరం ప్రభుత్వ రంగ బ్యాంకు(PSB)ల్లో ప్రొబేషనరీ ఆఫీసర్, క్లర్క్, స్పెషలిస్ట్ ఆఫీసర్‌తో పాటు గ్రామీణ బ్యాంకు(RRB)ల్లో ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయనుంది.

RRB- Office Assistant, ఆఫీసర్‌ స్కేల్‌-1, 2, 3 ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో జరుగుతాయి.

PSB- క్లర్క్‌, PO ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ ఆగస్టు నుంచి 2024 జనవరి వరకు నిర్వహిస్తారు.

ప్రిలిమ్స్, మెయిన్స్ కి అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఒకేసారి రిజిస్ట్రేషన్ చేయాలి.

పరీక్ష తేదీలకు ముందే ఉద్యోగ ప్రకటన విడుదలవుతుంది. అందువల్ల పూర్తి వివరాలకు అభ్యర్థులు Official Websiteను ఫాలో అవ్వాలని IBPS అధికారులు తెలిపారు.

IBPS Exams -2023 క్యాలెండర్

RRB – CRP RRB-XII( Office Asst), CRP RRB-XII(ఆఫీసర్‌)

ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌(ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్‌ స్కేల్‌-1) 2023 ఆగస్టు 05, 06, 12, 13, 19
సింగిల్ ఎగ్జామ్(ఆఫీసర్‌ స్కేల్‌-2 & 3) 2023 సెప్టెంబర్ 10
మెయిన్ ఎగ్జామ్(ఆఫీసర్ స్కేల్-1) 2023 సెప్టెంబర్ 10
మెయిన్ ఎగ్జామ్(ఆఫీస్‌ అసిస్టెంట్‌) 2023 సెప్టెంబర్ 16

PSB-CRP Clerk-XIII, CRP PO/ MT-XIII & CRP SPL-XIII

ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌(క్లర్క్‌) 2023 ఆగస్టు 26, 27, సెప్టెంబర్ 2
మెయిన్‌ ఎగ్జామినేషన్‌(క్లర్క్‌) 2023 అక్టోబర్ 07
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌(ప్రొబేషనరీ ఆఫీసర్) 2023 సెప్టెంబర్ 23, 30, అక్టోబర్ 01
మెయిన్ ఎగ్జామినేషన్‌ (ప్రొబేషనరీ ఆఫీసర్) 2023 నవంబర్ 05
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌(స్పెషలిస్ట్ ఆఫీసర్) 2023 డిసెంబర్ 30, 31
మెయిన్‌ ఎగ్జామినేషన్‌(స్పెషలిస్ట్ ఆఫీసర్) 2024 జనవరి 28

Leave a Reply