హైదరాబాద్ లో వారసత్వ ప్రదేశాలు

1) చౌమహల్లా ప్యాలెస్ : ఎవరి నివాస భవనం?
జ: హైదరాబాద్ నిజాం నవాబు
2) చౌమహల్లా ప్యాలెస్ ను ఎవరు నిర్మించారు?
జ: 1750లో సలజత్ నిర్మాణం ప్రారంభించగా ఐదో అఫ్జలుద్దౌలా పూర్తి
చేసారు
3) చైమహల్లా ప్యాలెస్ ప్రాంగణాల విస్తీర్ణం ఎంత?
జ: 45 ఎకరాలు, ప్రస్తుతం 12 ఎకరాలు మాత్రమే మిగిలింది
4) కిల్వత్ ముబారక్ (దర్బార్ హాల్): ఇక్కడ ఎవరి సింహాసనముండేది?
జ: అసఫ్ జాహీల
5) దర్బార్ హాల్ లో ఏ దేశానికి చెందిన షాండియర్లను ఇటీవల
అమర్చారు?
జ: బెల్జియంకి చెందిన 19 షాండియర్లు
6) క్లాక్ టవర్ : దీనిని ఏమని పిలుస్తారు?
జ: కిల్వత్ క్లాక్
7) క్లాక్ టవర్ లో గడియారం ఎన్నేళ్ళ నుంచి పనిచేస్తోంది ?
జ: 250 సం.లు
8) చార్మినార్ కట్టడం ఎత్తు ఎంత?
జ: 180 అడుగులు
9) చార్మినార్ ఎవరు నిర్మించారు?
జ: 1691లో సుల్తాన్ మహ్మద్ కులీకుతుబ్ షా
10) చార్మినార్ ను దేని నివారణకు సూచనగా నిర్మించారు ?
జ:ప్లేగు వ్యాధి నివారణకు
11) చార్మినార్ వాస్తుశిల్పి ఎవరు?
జ: మీర్ మొమిన్ అస్త్రబాది
12) హైదరాబాద్ లో గాజులకు ప్రసిద్ది చెందిన ప్రాంతం ఏది ?
జ: చార్మినార్ దగ్గర్లోని లాల్ బజార్
13) హైదరాబాద్ లో ఏ వర్తకం ప్రసిద్ది చెందినది?
జ: ముత్యాల వర్తకం
14) గోల్కొండ కోట కి ఏమేమి పేర్లు ఉన్నాయి?
జ: గొల్ల కొండ, గోవుల కొండ
15) గోల్కొండను ఎవరు నిర్మించారు?
జ: కాకతీయులు
16) గోల్కొండ మొదటి పేరేమిటి?
జ: మంకాల్
17) గోల్కొండని ఏ సంవత్సరంలో నిర్మించారు?
జ: 1143లో
18) గోల్కొండలో ఎన్ని బురుజులు, ఎంత ఎత్తయిన ద్వారాలు ఉన్నాయి?
జ: 87 బురుజులు, 69 అడుగుల ఎత్తైన ద్వారాలు
19) కుతుబ్ షాహీల సమాధులు ఎక్కడ ఉన్నాయి?
జ: గోల్కొండ కోటకు ఉత్తరంగా
20) కుతుబ్ షాహీల సమాధుల్లో ఎవరి సమాధి ప్రత్యేకత కలిగి
ఉంటుంది?
జ: మహ్మద్ కులీ కుతుబ్ షా
21) కుతుబ్ షాహీ సమాధులు ఏ శైలిలో నిర్మించబడ్డాయి?
జ: ఇండో-పర్షియన్ శైలిలో
22) ఫలక్ నుమా ప్యాలెస్ ను ఎలా నిర్మించారు?
జ: ఇటలీ పాలరాతితో
23) ఫలక్ నుమా ప్యాలస్ ను ఏ హోటల్ గా మార్చారు?
జ: హెరిటేజ్ హోటల్
24) తారామతి-బారాదరి కల్చరల్ విలేజ్ ఎక్కడ ఉన్నది?
జ: గోల్కొండ దగ్గర్లోని ఇబ్రహీంబాగ్ లో
25) తారామతి - బారాదరిని ఎవరు నిర్మించారు?
జ: 7వ సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా
26) పురానా హవేలి ప్యాలెస్ ఎవరు నిర్మించారు?
జ: 1777లో రెండో అసఫ్ జా నిజాం అలీ
27) పురానా హవేలీ ప్యాలెస్ లో ప్రసిద్ద సందర్శన స్దలాలు ఏమిటి?
జ: చెక్క వార్డ్ రోబ్, ప్యాలెస్ దగ్గరల్లో నిజాం రజతోత్సవ మ్యూజియం
28) సాలర్జంగ్ మ్యూజియం ఎక్కడ ఉన్నది?
జ: మూసీనదికి దక్షిణాన
29) భారతదేశంలోని మ్యూజియంలలో సాలర్జంగ్ మ్యూజియం
ఎన్నవది?
జ: మూడవది
30) మ్యూజియంలోని వస్తువులను ఎవరు, ఎన్నేళ్ళ పాటు సేకరించారు?
జ: మూడో సాలర్జంగ్ - 35 యేళ్ళ పాటు
31) మ్యూజియంలో ఏవేవి ప్రజలను ఆకర్షిస్తాయి?
జ: మేలిముసుగు ధరించిన రెబెకా శిల్పం, ప్రాచీన గడియారాలు,
32) మ్యూజియంలో ఎవరెవరి కత్తులు ఉన్నాయి ?
జ: నూర్జహాన్, షాజహాన్, జౌరంగజేబు
33) మక్కామసీదు నిర్మాణాన్ని ఎవరు ప్రారంభించారు?
జ: 1614లో మమ్మద్ కుతుబ్ షా
34) మక్కా మసీదు నిర్మానాన్ని ఎవరు కొనసాగించారు ?
జ: అబ్దుల్ కుతుబ్ షా, అబుల్ హసన్ తానీషా
35) మక్కా మసీదు నిర్మాణంను ఎవరు పూర్తిచేశారు?
జ: 1692-93 లో జౌరంగజేబు
36) మక్కా మసీదులో ఒకేసారి ఎంత మంది ప్రార్దనలు చేసుకోవచ్చు?
జ: 10 వేల మంది
37) మక్కా మసీదు పొడవు, వెడల్పు, ఎత్తు ఎంత ఉంటుంది?
జ: పొడవు- 225 అడుగులు,
వెడల్పు - 180 అడుగుల
ఎత్తు - 75 అడుగులు
38) బ్రిటిష్ రెసిడెన్సీ: దీనిని ఎవరు నివాసముండుటకు నిర్మించాడు?
జ: బ్రిటిష్ రెసిడెంట్ నివాసానికి
39) బ్రిటీష్ రెసిడెన్సీని ఎవరు నిర్మించారు ?
జ: 1803లో నిజాం అలీ
40) బ్రిటీష్ రెసిడెన్సీ నిర్మాణం ఎప్పుడు పూర్తి చేశారు ?
జ: 1806
41) బ్రిటీష్ రెసిడెన్సీ ఏ వాస్తు శైలిలో నిర్మించారు?
జ: యూరోపియన్ వాస్తు శైలిలో