GST MULTIPLE CHOICE – ANSWERS

1. GST నినాదం ఏమిటి..?
ఎ. ఒకే దేశం.. ఒకే మార్కెట్.. ఒకే పన్ను
బి. ఒకే మార్కెట్.. ఒకే పన్ను... ఒకే దేశం
సి. ఒకే దేశం..ఒకే పన్ను... ఒకే మార్కెట్
డి. ఒకే పన్ను.. ఒకే దేశం.. ఒకే మార్కెట్.

2. ప్రస్తుతం GST ని ఎన్ని దేశాలు అమలు చేస్తున్నాయి..?
ఎ. 155 బి. 160 సి.156 డి.175

3. ఈ కిందివాటిలో ఏ రాష్ట్రంలో GST అమలు కావడం లేదు..?
ఎ. పంజాబ్  బి. జమ్ము కాశ్మీర్ సి. ఢిల్లీ డి. అసోం.  ( ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ కూడా ఆమోదించింది.)

4. జీఎస్టీ మండలిని రాజ్యాంగంలో సవరించిన ఏ ఆర్టికల్ ద్వారా ఏర్పాటు చేశారు ?
ఎ. 279 ఎ(1) బి. 278 ఎ(1)
సి. 277ఎ(1) డి. 276 ఎ(1)

5. మన దేశంలో GST (గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ) గురించిన ప్రస్తావన తొలిసారిగా ఏ బడ్జెట్ లో వచ్చింది ?
ఎ. 2003 బి.2004 సి.2006 డి.2010

6. 2010లో ఎవరి అధ్యక్షతన GST కోసం ఐటీ విధానాల బృందాన్ని ఏర్పాటు చేశారు ?
ఎ. శ్యామ్ పిట్రోడా బి. సుందర్ పిచ్చై
సి. నందన్ నీలేకని డి. నారాయణమూర్తి

7. జీఎస్టీ బిల్లుకు లోక్ సభ ఎప్పుడు ఆమోదం తెలిపింది ?
ఎ. 2015 మే 6                బి.2015మే 16
సి. 2015 మే 18              డి. 2015 మే 20

8. GST బిల్లుకు రాజ్యసభ ఎప్పుడు ఆమోదం తెలిపింది ?
ఎ. 2016 సెప్టెంబర్ 4      బి. 2016 ఆగస్టు 3
సి. 2016 సెప్టెంబర్ 2      డి. 2017 జూన్ 30

9. జీఎస్టీ బిల్లుకు 16 రాష్ట్రాల ఆమోదించిన తర్వాత రాష్ట్ర ప్రణబ్ ముఖర్జీ ఎప్పుడు ఆమోద ముద్ర వేశారు ?
ఎ. 2016 సెప్టెంబర్ 2 బి. 2016 అక్టోబర్ 4
సి. 2016 అక్టోబర్ 14 డి. 2016 జూన్ 30

10. GST రూపొదించడానికి ఎవరి నాయకత్వంలోని పార్లమెంట్ స్థాయీ సంఘం రాజ్యాంగ సవరణలకు సూచనలు చేసింది ?
ఎ. యశ్వంత్ సిన్హా బి. చిదంబరం
సి. ప్రణబ్ ముఖర్జీ డి. మన్మోహన్ సింగ్

11. GST విషయంలో రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయ సాధనకు ఎంపవర్ కమిటీ ఛైర్మన్లుగా వ్యవహరించిన వారిలో లేనివారు ఎవరు..?
ఎ. జమ్మూకశ్మీర్ ఆర్థికమంత్రి అబ్దుల్ రహీవ్
బి. బీహార్ మంత్రి సుశీల్ మోదీ
సి. కేరళ మంత్రి కేఎం మణి,
డి.పశ్చిమబెంగాల్ మంత్రి నరేంద్రదాస్

12. GST కౌన్సెల్ ఇప్పటివరూ ఎన్నిసార్లు సమావేశమైంది ?
ఎ. 20     బి. 18      సి.16       డి.14సార్లు

13. GST ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది ?
ఎ. జులై 1 ఉదయం నుంచి             బి. జులై 1 అర్థరాత్రి నుంచి
సి.జూన్ 30 అర్థరాత్రి నుంచి(july 1st)  డి. జూన్ 30 ఉదయం నుంచి

14. జే గంట మోగించి జీఎస్టీని ఎవరు ప్రారంభించారు ?
1. రాష్ట్రపతి ప్రణభ్ ముఖర్జీ 2. ప్రధాని నరేంద్ర మోడీ
3.ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ 4.కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు

ఎ. 1       బి.1,2          సి.1,2,3      డి..1,3

15. దేశంలో జీఎస్టీ అమలు చేయాలన్న ఆలోచన ఎప్పుడు మొదలైంది ?
ఎ. 1986-87            బి.1987-88
సి. 1988-89              డి.1990-91

16. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమలు చేసిన జులై 1ని GST దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించారు. అయితే ఏ కార్యలయాల్లో ఈ వేడుకలు నిర్వహిస్తారు ?

ఎ. CBEC (Central Board of Excise & Customs)
బి. దేశంలోని అన్న ప్రభుత్వ కార్యాలయాల్లో
సి. CENTRAL BOARD OF TAXES
డి. అన్ని ఇన్ కం, ఎక్సైజ్ పన్నుల కార్యాలయాల్లో

17. GST ద్వారా రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు గతంలో 12 శాతం పన్నుల పరిధిలోని ఉన్న ఎరువులను ఎంత శాతానికి తగ్గించారు ?

ఎ.5శాతం             బి. 10శాతం            సి.11శాతం            డి.4శాతం

18. బంగారం మీద గతంలో అన్ని పన్నులు కలుపుకొని 12 శాతంగా ఉండేవి. ఇప్పుడు GST ఎంతకు పెరిగింది ?

ఎ. 14 శాతం          బి.18శాతం           సి.20శాతం       డి.16శాతం

19. ఎలక్ట్రానిక్స్ మీద ప్రస్తుతం 28 శాతం GST పన్నులు ఉండగా గతంలో ఎంత ఉండేవి ?
ఎ. 22 శాతం                బి. 23 శాతం
సి. 24 శాతం                డి. 18 శాతం.

20. GST రూపురేఖల్ని తయారు చేయడానికి 2000వ సంవత్సరంలో అప్పటి ప్రధాని ఏబీ వాజ్ పేయి ఎవరి నాయకత్వంలో కమిటీని వేశారు ?
ఎ. హోం మంత్రి ఎల్.కె అధ్వానీ
బి. అప్పటి ఆర్థికమంత్రి యశ్వంత్ సిన్హా
సి. ఆర్.బి.ఐ గవర్నర్ రంగరాజన్
డి. పశ్చిమబెంగాల్ ఆర్థికమంత్రి అసిమ్ దాస్ గుప్తా

21. 2003లో వాజ్ పేయి ప్రభుత్వం పన్నుల సంస్కరణలను స్పీడప్ చేయడానికి ఎవరి నాయకత్వంలో టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేసింది ?

ఎ. ఆర్.రంగరాజన్              బి. విజయ్ కేల్కర్
సి. వై.వి రెడ్డి                       డి. రఘురామ్ రాజన్

22. GST అమలు కోసం 2011లో లోక్ సభలో 115 వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు వ్యతిరేకించిన పార్టీలు..?

ఎ.కాంగ్రెస్            బి. బీజేపీ          సి.డీఎంకే        డి. తృణమూల్ కాంగ్రెస్

23. GST పన్నుల విధింపు, అమలు విషయంలో అంతిమ నిర్ణయం ఎవరిది ?

ఎ. కేంద్ర మంత్రిమండలి

బి. ప్రధాన మంత్రి ఆధ్వర్యంలోని ముఖ్యమంత్రుల కమిటీ.

సి. జీఎస్టీ మండలి

డి. రాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రులు

24. జీఎస్టీ అమలుతో 2017-18 సంవత్సరానికి వృద్ధి రేటు ఎంతగా నమోదు అవుతుందని కేంద్ర ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది ?

ఎ. 7.5 శాతం      బి.8.5 శాతం       సి.6.5శాతం      డి.8.6శాతం

25. GST మండలికి ఎవరు అధ్యక్షత వహిస్తారు ?
ఎ. భారత రాష్ట్రపతి            బి. భారత ప్రధాని
సి. కేంద్ర ఆర్థిక మంత్రి        డి. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్

26. రాష్ట్రాల్లో ప్రకృతి విపత్తులు సంభవిస్తే అదనపు వనరుల సేకరణకు ప్రత్యేక రేట్లు నిర్ణయం, ఆయా రాష్ట్రాల్లో రేట్ల విషయంలో నిబంధనల అంశాలపై ఎవరు నిర్ణయం తీసుకుంటారు ?

ఎ. విపత్తుల నివారణ విభాగం            బి. జీఎస్టీ మండలి
సి. జీఎస్టీ విపత్తుల మండలి                డి. పైవన్నీ

27. GST అమలుతో వచ్చే ఏడాదికి వృద్ధి రేటు ఎంత ఉంటుందని IMF (అంతర్జాతీయ ద్రవ్య నిధి)అంచనా వేసింది ?

ఎ. 9శాతం పైన               బి. 8శాతం పైన
సి. 10శాతం పైన             డి. 11 శాతం పైన

28. ఒకే దేశం - ఒకటే పన్ను కింద వచ్చిన GST లో మొత్తం ఎన్ని ట్యాక్స్ శ్లాబులు ఉన్నాయి ?
ఎ. నాలుగు ( 5,12,18,28 శాతం )
బి. మూడు శ్లాబులు (12, 18, 28 )
సి. రెండు శ్లాబులు (18,28)
డి. దేశం మొత్తం ఒకటే శ్లాబు 28శాతం.

29. జీఎస్టీ కోసం ఆన్ లైన్ ఫైలింగ్, రిజిష్ట్రేషన్, ఇలా అన్ని పనులూ కంపూటర్ల ద్వారానే చేసే విధానాన్ని ఏమంటారు ?

ఎ.GST ONLINE               బి. GST E FILING
సి.GST NETWORK           డి. GST IT NET

30. జీఎస్టీ నిబంధనల ప్రకారం ఏదైనా వస్తువు లేదా సేవపై పన్ను తగ్గినా లేదా ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందినా ఆ వస్తువు లేదా సేవ ధర తగ్గాలి. దీన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకునే విధానాన్ని ఏమంటారు ?

ఎ. ట్యాక్స్ డిడక్షన్          బి. యాంటీ ప్రాఫిటరింగ్
సి. ట్యాక్స్ క్రెడిట్             డి. ప్రాఫిటరింగ్

31.జీఎస్టీలో ఏదైనా రాష్ట్రంలో ఒక వ్యక్తికి స్థిర నివాసం లేకుండా అక్కడ అప్పుడప్పుడూ వస్తువులు సరఫరా చేసినా, సేవలు అందించినా అతన్ని ఏమని పిలుస్తారు ?

ఎ. క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్
బి.స్సెషల్ ట్యాక్సబుల్ పర్సన్
సి. గ్రేడ్-2 ట్యాక్స్ పేయర్
డి. గ్రేడ్-3 ట్యాక్స్ పేయర్

32. వ్యాపారంలో రెండు లేదా అంతకన్నా ఎక్కువ వస్తువులు, సేవలు లేదా రెండూ కలిపి అందిస్తే దాన్ని ఏమంటారు ?
ఎ. డ్యూయల్ సప్లయ్       బి. కాంపోజిట్ సప్లయ్
సి. మిక్స్ డ్ సప్లయ్         డి. టూ ఇన్ వన్ సప్లై

33. ఎవరైనా డీలర్ కస్టమర్ల నుంచి పన్నులు వసూలు చేయకుండా దాన్ని రాయితీ రేటుపై చెల్లించడానికి సిద్ధపడినా, కొనుగోళ్ళపై చెల్లించిన పన్నును సెటాఫ్ చేసుకున్నా అతనని ఏమంటారు ?

ఎ. కాంపోజిషన్ డీలర్          బి. డిస్కౌంట్ డీలర్
సి. స్సెషల్ డీలర్                 డి. కస్టమర్ డీలర్

34. జీఎస్టీలో వస్తువులు లేదా సేవలపై ట్యాక్స్ కట్టాల్సింది సరఫరాదారు. అలా కాకుండా వాటిని అందుకున్న వ్యక్తి గనక ఆ పన్ను చెల్లిస్తే వాటిని ఏమంటారు ?

ఎ. రివర్స్ చార్జీలు      బి. స్పెషల్ చార్జీలు
సి. ఫైనల్ చార్జీలు       డి. ఫార్వర్డ్ ఛార్జీలు

35. విడివిడిగా అందించాల్సిన వస్తువులను కలిపి ఒకే ధరకు ప్యాకేజీగా అందిస్తారు. దీన్ని Mixed supply అంటారు. అయితే వీటిల్లో మొత్తం సరఫరాపై పన్ను ఎలా నిర్ణయిస్తారు ?

ఎ. ఏ వస్తువు పన్ను ఎక్కువగా ఉంటే ఆ ట్యాక్సే
బి. రెండు వస్తువుల పన్నును సమానం చేస్తారు.
సి. రెండింట్లో దేని పన్ను తక్కువగా ఉంటే దానిని ఫైనల్ చేస్తారు.
డి. దీనికి ఆయా వస్తువును బట్టి వేర్వేరు పన్ను ఉంటుంది.

36. జీఎస్టీ అమలు విషయంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య గానీ, వ్యాపారులు, ప్రభుత్వానికి మధ్య గానీ వివాదాలు తలెత్తితే ఎవరు పరిష్కరిస్తారు ?
ఎ. ఆయా రాష్ట్రాల హైకోర్టులు
బి. సుప్రీం కోర్టు
సి. ప్రధాని ఆధ్వర్యంలోని మంత్రిమండలి
డి జీఎస్టీ మండలి ఆధ్వర్యంలోని యంత్రాంగం

37. దేశంలో ఒక వస్తువు లేదా సేవపై పన్ను తగ్గించాలన్నా, పెంచాలనుకున్నా అది జీఎస్టీ కౌన్సిల్ కే సాధ్యం. అయితే ఈ రేట్లను ఎవరు నోటిఫై చేయాలి ?

ఎ. ప్రధాని                          బి. కేంద్ర కేబినెట్
సి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డి. రాష్ట్రపతి

38. జీఎస్టీ మండలిలో ఎంతమంది సభ్యులు హాజరైతే కోరం గా పరిగణిస్తారు ?

ఎ. మూడు వంతుల మంది            బి. సగం మంది
సి. కనీసం 10మంది సభ్యులు        డి. 75 శాతం మంది.

39. జీఎస్టీ అమలుతో కొన్ని రాష్ట్రాలకు తగ్గే ఆదాయాన్ని కేంద్రం భర్తీ చేస్తుంది. అయితే ఈ ఆదాయ నష్టాన్ని భర్తీ చేయడానికి ఏ సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు ?

ఎ. 2015-16      బి.2017-18

సి2016-17           డి. 2018

40. జీఎస్టీలో ఎన్నిరకాల వస్తువులపై పన్ను తగ్గించాలని తెలంగాణ సర్కార్ సిఫార్సు చేసింది ?
ఎ. 35  బి.36 సి.37   డి.38

41. జీఎస్టీ కౌన్సిల్ లో అన్ని రాష్ట్రాల నుంచి మొత్తం ఎన్ని రకాల వస్తువులపై పన్నులు తగ్గించాలని డిమాండ్స్ వచ్చాయి ?

ఎ. 145 వస్తువులు  బి. 146 వస్తువులు
సి. 147 వస్తువులు  డి. 153 వస్తువులు

42. జీఎస్టీ అమలుతో కేంద్ర స్థాయిలో రద్దయ్యే పన్నులు ఎన్ని ?
ఎ. 5      బి.6       సి.3  డి.4

వివరణ:. కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ, అదనపు ఎక్సైజ్ డ్యూటీ,  కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ ( CVD), ప్రత్యేక అదనపు కస్టమ్స్ డ్యూటీ, సేవా పన్ను)

43. GST అమలుతో రాష్ట్రస్థాయిలో రద్దయ్యే పన్నులు ఎన్ని ?
ఎ. 8      బి.6     సి. 5      డి. 9

(వివరణ : రాష్ట్ర వ్యాట్, కేంద్ర అమ్మకం పన్ను, విలాస సుంకం, ప్రవేశ పన్ను, వినోద పన్ను, ప్రకటనలపై పన్ను, కొనుగోలు పన్ను, లాటరీల పందెం & జూదంపై పన్ను )

44. జులై1 నుంచి దేశంలోని అన్ని రకాల వస్తువులూ GST పరిధిలోకి వచ్చాయి. అయితే ఇంకా రాని ముఖ్యమైన వస్తువులు ఏమిటి.?

1. మద్యం

2. పెట్రోలియం ఉత్పత్తులు (ముడి చమురు, డీజిల్, సహజ వాయవు, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్)

3. విద్యుత్

4. సౌందర్య సాధనాలు.

ఎ. పైవన్నీ      బి. 1,2      సి. 1,2,3      డి.2,3,4

45. మనదేశంలో స్థూల జాతీయోత్పత్తిలో (GDP) లో పన్నుల ఆదాయం వాటా 16శాతంగా ఉంది. GST అమలుతో GDP లో పన్నుల వాటా ఎంత ఉండొచ్చని భావిస్తున్నారు ?

ఎ. 28 శాతం              బి.21శాతం
సి. 20శాతం              డి. 24శాతం

46. స్థూల జాతీయోత్పత్తి (GDP)లో పన్నుల ఆదాయం వాటా ఎక్కువగా ఉన్న దేశాలు ఏవి ?

ఎ. భారత్, చైనా             బి. ఆస్ట్రేలియా, అమెరికా

సి. అమెరికా, బ్రెజిల్       డి.బ్రిటన్, బ్రెజిల్స

47. 1954లో ప్రపంచంలోనే తొలిసారిగా GST ని అమలు చేసిన దేశం ఏది ?

ఎ. రష్యా       బి. అమెరికా     సి. ఫ్రాన్స్     డి. పోర్చుగల్

48. ప్రపంచంలో జీఎస్టీ అమలులో లేని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ ఏ దేశంలో ఉంది ?

ఎ. అమెరికా           బి. ఆస్ట్రేలియా      సి. చైనా         డి. జర్మనీ

49. లాభాపేక్ష లేని ప్రైవేట్ రంగ కంపెనీగా GST నెట్ వర్క్ ను రూపొందించారు. అయితే ఇందులో కేంద్ర, రాష్ట్రాలకు ఎంత శాతం వాటా ఉంది ?

ఎ. ఒక్కొక్కరికి 24.5 శాతం చొప్పున మొత్తం 49శాతం
బి. ఒక్కొక్కరికీ 25 శాతం చొప్పున 50 శాతం
సి. కేంద్రానికి 26, రాష్ట్రానికి24 శాతం చొప్పున 50 శాతం
డి. కేంద్రం 30 శాతం , రాష్ట్రం 20 శాతం.

50. జీఎస్టీ అమలులోకి తెచ్చేందుకు NDA సర్కార్ 2014 లో లోక్ సభలో ఏ రాజ్యాంగ సవరణ బిల్లును ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టారు ?

ఎ.122 వ రాజ్యాంగ సవరణ            బి. 120వ రాజ్యాంగ సవరణ
సి.121వ రాజ్యాంగ సవరణ               డి. 119వ రాజ్యాంగ సవరణ

 

Note: తెలంగాణ ఎగ్జామ్స్ వెబ్ సైట్ లో పెట్టిన ఏ పోస్ట్ అయినా లేదా లేటెస్ట్ ఉద్యోగ, విద్యా సమాచారం మీకు వెంటనే తెలియాలంటే... యాప్ డౌన్ లోడ్ చేసుకోండి.  అలాగే   FACE BOOK, TWITTER లో  telanganaexams కు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపండి.