Wednesday, June 19

గ్రూప్ – 1, గ్రూప్ 3 ప్రకటనలకు సిద్ధం !

రెండోసారి అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగాల ఖాళీలను వెంట వెంటనే భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. అందుకనుగుణంగా గ్రూప్ -1 ఉద్యోగ ప్రకటన అతి త్వరలోనే వెల్లడి కానుంది. ప్రస్తుత అంచనాల ప్రకారం 150 పోస్టులతో నోటిఫికేషన్ వేసేందుకు tspsc రంగం సిద్దం చేసింది. ప్రభుత్వం నుంచి కొన్ని సాంకేతిక అనుమతులు రావాల్సి ఉంది. వాటిని ముఖ్యమంత్రితో చర్చించి ప్రకటన విడుదల చేయాలని tspsc అధికారులు భావిస్తున్నారు. గతంలోనే tspsc గ్రూప్ - 1 నోటిఫికేషన్ వెల్లడించాలని అనుకుంది. అయితే అప్పట్లో కొత్త జోన్స్ ప్రకటించడంతో తాత్కాలికంగా నోటిఫికేషన్ విడుదలను పక్కనబెట్టారు. గ్రూప్ 1 పోస్టులను కొత్త జోన్ల వారీగా విభజించే ప్రక్రియ కూడా దాదాపు పూర్తి కావొచ్చింది. దాంతో గ్రూప్ -1 నోటిఫికేషన్ కు అడ్డంకులు తొలగినట్టే కనిపిస్తోంది.

గ్రూప్ -1 నోటిఫికేషన్ లో ఏ పోస్టులు ఉన్నాయి ?

DSP - 42
డిప్యూటీ కలెక్టర్లు - 15
ఇవి కాకుండా జిల్లా రిజిష్ట్రార్లు, రవాణా అధికారులు, మున్సిపల్ కమిషనర్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి.

గ్రూప్ - 3 నోటిఫికేషన్

రాష్ట్రంలో గ్రూప్ 3 కేటగిరీలో దాదాపు 800 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలోని వివిధ విభాగాధిపతుల కార్యాలయాల నుంచి సమాచారం రావాల్సి ఉంది. వీటిని కూడా కొత్త జోన్ల ప్రకారం ఆమోదించాలి. వీటికి తోడు అసిస్టెంట్ ఇంజనీర్లు, సర్వేయర్ పోస్టులకు సంబంధించిన ప్రకటనలు కూడా వెలువడాల్సి ఉంది. ఇవన్నీ జోనల్ విధానంతో ముడిపడి ఉండటంతో ప్రకటనల విడుదల ఆలస్యమవుతోంది.

SI/PC(M)/GR.1,2 & 3- 50రోజుల్లో 325 TESTS
మొత్తం మాక్ టెస్టులు : 320 గ్రాండ్ టెస్టులు : 05

( మొత్తం కవరయ్యే ప్రశ్నలు : దాదాపు 9000)
https://telanganaexams.com/50days-tests/