Group 2 Results : గ్రూప్ 2 ఫలితాలను TGPSC రిలీజ్ చేసింది. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ను TGPSC వెబ్ సైట్ లో పెట్టింది. దీంతో పాటు మొత్తం నాలుగు పేపర్లకు సంబంధించి Master Question papers & Final Key ని కూడా రిలీజ్ చేసింది. మొత్తం 783 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్ లో tgpsc నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 2025 డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగింది. ఈ ఎగ్జామ్ కు 5 లక్షల 51 వేల 855 మంది అప్లయ్ చేశారు. కానీ అనేక సార్లు వాయిదా పడటంతో చివరకు 2 లక్షల 51 వేల 738 మంది (45.57శాతం) మాత్రమే గ్రూప్ 2 ఎగ్జామ్ రాశారు.
