తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలను మరో 10 రోజుల్లో విడుదల చేయడానికి TGPSC అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
10 రోజుల్లో గ్రూప్ 1 రిజల్ట్స్
గ్రూప్ 1 మొత్తం 563 పోస్టులకు సంబంధించి Exams papers valuation పూర్తయింది. గ్రూప్ 1 మెయిన్ పరీక్షకు మొత్తం 21,093 మంది హాజరయ్యారు. అభ్యర్థుల మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాను TGPSC రిలీజ్ చేయనుంది. మొత్తం 563 గ్రూప్ 1 పోస్టులకు 38 మంది పోటీ పడుతున్నారు. వీళ్ళల్లో ఒక పోస్టుకు ఇద్దరిని ఫైనల్ లిస్ట్ కి ఎంపిక చేస్తారు.
మెరిట్ జాబితా రెడీ
గ్రూప్ 1 మెయిన్ మొత్తం 6 పేపర్లలో ఎగ్జామ్స్ నిర్వహించారు. వీటిల్లో సాధించిన మార్కులను కలిపి మెరిట్ జాబితాను కూడా TGPSC వెబ్ సైట్ లో పెడతారు. సబ్జెక్టుల వారీగా మార్కుల వివరాలు తెలియాలంటే… అభ్యర్థులు ఒక్కొక్కరు తమ individual logins ద్వారా తెలుసుకోవచ్చు. ఈ మార్కుల మీద ఏవైనా అనుమానాలు ఉంటే రీకౌంటింగ్ ఆప్షన్ కూడా TGPSC ఇవ్వనుంది. 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా రిలీజ్ చేశాక 15 రోజుల్లోగా ఒక్కో పేపర్ కు రూ.1000 చొప్పున చెల్లించి ఆన్ లైన్ లో Recounting కోసం అప్లయ్ చేసుకోవచ్చు.
గ్రూప్ 1 తర్వాత గ్రూప్ 2,3
గ్రూప్ 1 పోస్టుల నియామకం మొత్తం పూర్తయ్యాకే గ్రూప్ 2, ఆ తర్వాత గ్రూప్ 3 ఫలితాలను TGPSC విడుదల చేయనుంది. ఇలా చేయడం వల్ల బ్యాక్ లాగ్ పోస్టులు మిగిలిపోయే అవకాశం ఉండదని భావిస్తున్నారు. గ్రూప్ 1 పెద్ద పోస్ట్ కాబట్టి… అందులో జాయిన్ అయ్యా్క చిన్న పోస్టులకు వచ్చే ఛాన్స్ లేదు. అందువల్ల గ్రూప్ 2 , గ్రూప్ 3 లో బ్యాక్ లాగ్ పోస్టులు మిగిలే ఛాన్స్ ఉండదు. అర్హులైన అందరికీ ఉద్యోగాలు దక్కుతాయి.