TGPSC Group1 Results: తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు విడులయ్యాయి. 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి మెయిన్స్ పరీక్షలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నిర్వహించింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు మొత్తం 21,093 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అభ్యర్థుల నుంచి వచ్చే రీకౌంటింగ్ రిక్వెస్ట్ ల తర్వాత 1:2 నిష్పత్తిలో జాబితా వెల్లడిస్తారు.
గ్రూప్-1 ఆరు పేపర్లలో వచ్చిన మార్కులను కలిపి మెరిట్ జాబితాతో పాటు సబ్జెక్టుల వారీగా స్కోర్ చేసిన మార్కులను వెబ్సైట్ లో ఉంచారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్, డేటాఫ్ బర్త్ వంటి వివరాలు నమోదు చేసి వ్యక్తిగత లాగిన్లో మార్కులు చూసుకోవచ్చు.
2025 మార్చి 11న గ్రూప్ 2 ఫలితాలు విడుదలవుతున్నాయి. మార్చి 20లోపు అన్ని పరీక్షల ఫలితాలు విడులవుతాయి. పోస్టుకు దాదాపు 38 మంది వరకు పోటీ పడుతున్నారు.
గ్రూప్ 1 మార్కుల కోసం క్లిక్ చేయండి https://websitenew.tspsc.gov.in/checkMarksObtainedBytheCandidate?accessId=GRPACEOQ24
మార్కుల రీకౌంట్ కోసం క్లిక్ చేయండి https://websitenew.tspsc.gov.in/candidateMarksRecounting?accessId=GRPACEOQ241