GROUP1 జనరల్ ఎస్సేస్ ఎలా రాయాలి ?

GROUP1 జనరల్ ఎస్సేస్ ఎలా రాయాలి ?

మీరు గ్రూప్ 1 రాయొచ్చు... విజేతలు కావొచ్చు... అంటూ నేను ఇచ్చిన యూట్యూబ్ క్లాస్ కి మీనుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.  అసలు గ్రూప్ 1 మీద ఆసక్తి లేని వాళ్ళు... మనకెందుకు వస్తుందులే అనుకున్నవాళ్ళు కూడా చాలామంది ఇంట్రెస్ట్ చూపించారు.  మేం వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేస్తే... కొన్ని గంటల్లోనే మూడు గ్రూపులు నిండిపోయాయి.  అలాగే నాకు చాలామంది వాట్సాప్ మెస్సేజ్ లు కూడా పెట్టారు.

గ్రూప్ 1 గురించిన కొన్ని విషయాలు మాట్లాడుకున్నాక... అసలు క్లాసులోకి వెళ్దాం.

చాలామంది గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు... నోటిఫికేషన్ కైతే టైమ్ పడుతుంది.  తెలంగాణలో 33 జిల్లాలకు సంబంధించి... జోనల్ ఇష్యూకి సంబంధించి... రాష్ట్రపతి నుంచి క్లియరెన్స్ వచ్చాకే నోటిఫికేషన్ వస్తుంది.  అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే.  అయితే నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా... ఆ పోస్ట్ కొట్టాలన్న లక్ష్యంతో ఎన్నో రోజుల నుంచి టార్గెట్ పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు.  అందువల్ల ఒక్కటి గుర్తుపెట్టుకోండి... నోటిఫికేషన్ వచ్చాక... ప్రిపేర్ అవుదాంలే... ఈ సర్కార్ హయాంలో అసలు వస్తుందా... ఇలాంటి డౌట్స్ పెట్టుకోకండి...మీరు గ్రూప్ 1 టార్గెట్ పెట్టుకొని చదవడం ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి... దీనివల్ల గ్రూప్ 2 పడ్డా... లేదా ఇతర బోర్డుల నుంచి వచ్చే నోటిఫికేషన్లను కూడా ఈజీగా కొట్టేయడానికి అవకాశం ఏర్పడుతుంది. అంటే మీ ప్రిపరేషన్ లెవల్ బ్రాడ్ గా ఉండటం వల్ల గ్రూప్ 1 కంటే దిగువన ఉండే ఎగ్జామ్స్ చాలా ఈజీగా కొట్టేస్తారు. ప్రిపరేషన్ అనేది కంటిన్యూ ప్రాసెస్ అనేది గుర్తుంచుకోండి.

ఇవాళ్టి క్లాసులో  గ్రూప్ 1 మెయిన్స్ లో  కీలకమైన ఎస్సేస్ ఎలా రాయాలి... ఎలా రాస్తే మంచి మార్కులు వస్తాయి...మనం విజేతగా నిలబడటానికి అవకాశం ఉంటుందో వివరిస్తాను.

మనం ప్రశ్నను సరిగ్గా, నిదానంగా, టెన్షన్‌ పడకుండా చదివి అర్థం చేసుకోవాలి. ఒకటికి రెండు సార్లు అవగాహన చేసుకోవాలి...

అసలు ప్రశ్నల ఎలా అడిగాడో గ్రహించి... ఆ ప్రశ్నకు తగ్గట్టుగా సమాధానం రాయాలి... అంటే ప్రశ్న అడిగిన రీతిలోనే రాయాలి. మనకు వచ్చింది... మనకి గుర్తుండిపోయిన విషయమంతా రాయడానికి ప్రయత్నం చేయకూడదు... అడిగిన విషయం సరిగ్గా గ్రహించి... దానికే సమాధానం రాయాలి. ఎస్సేస్ రాసే విషయంలో టైమ్ అనేది చాలా ఇంపార్టెంట్.  మొత్తం ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలకు కొంత టైమ్ కేటాయించుకొని... దానికి తగ్గట్టుగా ప్లానింగ్ వేసుకొని... ఆ టైమ్ లోపే పూర్తి చేయాలి... దాదాపు అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. మనం రాయాల్సిన ప్రశ్నల్లో కొన్ని మాత్రమే రాసి... వీటిల్లో పర్ ఫెక్ట్ గా మార్కులు వస్తాయిలే... ఇంకా మిగతావి అవసరమా... అని మీకు మీరే సర్ది చెప్పుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయకండి...

ఎస్సేస్ లో అవసరమైన చోట్ల  డయాగ్రమ్‌లు, ఫ్లోచార్ట్‌లు, మ్యాప్‌లు గీయాలి. అప్పుడే మీకు సబ్జెక్ట్ మీద ఎంత గ్రిప్ ఉందో ఎగ్జామినర్ కి తెలుస్తుంది.  ఉదాహరణకు నదుల అనుసంధానంపై రాయాల్సి వస్తే... మ్యాప్ తప్పనిసరిగా గీయాలి...ప్రతి ప్రశ్నకు జవాబులో  ఎండింగ్ తప్పనిసరిగా ఇవ్వాలి.  అంటే ముగింపు లేని జవాబుకి అర్థం లేదు. ఈ ఎండింగ్ కి కూడా మార్కులు పడతాయి. మీకు ముందు చెప్పినట్టుగా ప్రశ్నాపత్రంలో మనం ఎన్ని ప్రశ్నలు... ఏయే ప్రశ్నలు రాయాలన్నది నిర్ణయించుకున్నాక... వాటికి తగ్గట్టుగా మనకి ఉన్న టైమ్ ని విభజించుకోవాలి.  నాకు మూడు గంటలు టైమ్ ఉంది... రాయలేకపోతానా... అని ఎట్టి పరిస్థితుల్లో రిలాక్స్ అవ్వొద్దు... మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి... టెన్త్, ఇంటర్, డిగ్రీ ఎగ్జామ్స్ రాసేటప్పుడు... టైమ్ లేక ఎన్ని సార్లు మీరు పేపర్లు హడావిడిగా ఇన్విజిలేటర్ కి ఇచ్చి వచ్చారో....

అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే... పరీక్షా కేంద్రానికి ఎంత టైమ్ ముందుగా వెళ్లాలన్నది కూడా మన ప్లానింగ్ లో ఉండాలి. ఎందుకంటే... టైమ్ కి ముందుగా వెళ్ళకపోతే... మన టెన్షన్ ఎగ్జామ్ మీద పడే అవకాశముంటుంది.  పరీక్ష హాలులో టెన్షన్‌ పడి ఒక ప్రశ్నకు వేరే సమాధానం రాయడం లేదంటే ప్రశ్నను తప్పుగా అర్థం చేసుకోవడం లాంటి తప్పులు జరిగే ప్రమాదం ఉంది.

ఎస్సేలో చిన్న చిన్న వాక్యాలు ఉండేలా చూసుకోవాలి.  పెద్ద పెద్ద వాక్యాలు రాస్తే పేపర్ దిద్దే వాళ్ళకి చిరాకు పుడుతుంది. భాష సరళంగా ఉండాలి. మన ఎదురుగా ఉన్న వ్యక్తితో మనం మాట్లాడుతున్నట్టుగా ఉండాలి.

ఇతర పేపర్లతో పోల్చితే ఎస్సే పేపర్‌లో రైటింగే ఇంపార్టెంట్.  రైటింగ్ బాగుంటే... చదివే వాళ్ళకి... పేపర్ దిద్దే వాళ్ళకి మంచి ఇంప్రెషన్ కలుగుతుంది.  నాకు తెలిసి... మీలో చాలామంది కంప్యూటర్లకి అలవాటు పడ్డారు... దాంతో రైటింగ్ ప్రాక్టీస్ తప్పిపోయి ఉండొచ్చు.   అందువల్ల మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్రతి రోజూ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి... ఇప్పటి నుంచి రైటింగ్ ప్రాక్టీస్ లేకపోతే... ఎగ్జామ్ లో 3 గంటలు ఏకధాటిగా రాయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది.  అందుకే ముందు నుంచే ప్రాక్టీస్ చేయండి. కొంతమంది తమకు తెలిసిన విషయం అంతా పేపర్ మీద పెట్టాలని అనుకుంటారు.  ఆ తాపత్రయంలో... అర్థం పర్థం లేకుండా రాస్తేస్తారు... దాంతో మనం రాయాలనుకున్నది... ప్రశ్న అడిగిన విధానానికి అనుగుణంగా రాయని పరిస్థితి ఏర్పడుతుంది.

మీకు ఎంత టైమ్ ఉందో ... మిగిలిన వారికీ అంతే ఉంటుందన్నది గ్రహించండి.  అందుకే విషయాన్ని  గుర్తించి, అందుకోసం పెట్టాల్సిన టైమ్... ముందుగా ప్లాన్ వేసుకొని... ఎస్సేని రాయాలి. పొంతన లేని కొటేషన్స్, సామెతలు రాకుండా చూసుకోవాలి.

అందుకే ముందుగా ప్రశ్న చదవాలి... మనం తీసుకున్న టాపిక్ ఓ సమస్య అయితే... దానికి ప్రారంభం.. సమస్య ఎలా ఉండేది... ఏం చేశారు... ఎదురైన సవాళ్ళు... ఎలా పరిష్కరించారు... చివర్లో ముగింపు ఇలా... ఎస్సేని  పూర్తి చేయాలి... ఉదాహరణకు మనం మిషన్‌ కాకతీయ - మిషన్‌ భగీరథ టాపిక్స్ తీసుకున్నాం అనుకోండి...

ముందుగా....  తెలంగాణ సహజ వనరులను వివరిస్తూ మొదట పరిచయం రాయాలి...  ఆ తర్వాత తెలంగాణ ఎదుర్కొంటున్న నీటి సమస్య గురించి .... మిషన్‌ కాకతీయ... మన ఊరు - మన చెరువు ప్రధాన ఉద్దేశంతో రాష్ట్రంలో జరుగుతున్న కృషిని వివరించాలి.  ఆ తర్వాత... మిషన్‌ భగీరథ - ప్రధాన ఉద్దేశం దీనికి సంబంధించి జరుగుతున్న కృషిని వివరించాలి.  ఆ తర్వాత ఈ రెండు పథకాల అమలుకు ఎదురవుతున్న సవాళ్లు ఏంటో చెప్పాలి. ఆ సవాళ్ళను ఎలా ఎదుర్కోవాలో  పరిష్కార మార్గాన్ని సూచించాలి. చివరగా ముగింపు ఉండాలి.

ఎస్సేను పేరాగ్రాఫ్‌లుగా రాయాలి. అవసరమైన చోట్ల సబ్ హెడ్డింగ్స్ పెట్టాలి. ఒక పేరాకు ఆ తర్వాత వచ్చే పేరాకు సంబంధం ఉండేలా చూసుకోవాలి.  వీలైనంత వరకూ స్టాటిస్టిక్స్ సాధ్యమైనంతవరకు శాతాల్లో ఇవ్వడానికి ప్రయత్నించాలి. బాక్స్‌లు, ఫ్లో డయాగ్రమ్స్, పై చార్ట్‌లు లాంటివి ఇస్తే బెటర్.  ఎస్సేలో ప్రశ్నలో అడిగిన అంశానికి సంబంధించి వివిధ కోణాలను టచ్ చేస్తూ జవాబులు ఇవ్వాలి.  ఏదో ఒక కోణాన్ని మాత్రమే ప్రస్తావించి వదిలేయడం చేయకూడదు.

ముగింపు ఎప్పుడూ పాజిటివ్ గా ఉండాలి.... అది జరుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేయాలి... నిరాసక్తతతో ఎప్పుడూ ముగించకూడదు... లేదంటే కాలానికి వదిలేయడం... జరుగుతుందేమో చూడాలి... అంటూ... నిరాశ, నిస్పృహలను చూపించ రాదు. నీకు ఓ సమస్య ఇస్తే దాన్ని ఎలా పరిష్కరించగలవో వివరించేట్టుగా ఉండాలే తప్ప... ఈ సమాజాన్ని మనం మార్చలేం... అన్నట్టుగా ఎప్పుడూ ఉండకూడదు.  అంటే వివిధ సమస్యల పరిష్కారానికి అభ్యర్థి సూచనలు నిర్మాణాత్మకంగా, ఆచరణాత్మకంగా ఉండాలి.

చివరగా ఏమంటే... గ్రూప్ 1 లో.... ఏ వ్యాసం రాసినా...  ముగింపు రాసే ముందు అప్పటి వరకూ మనం ఏం రాశామో ఒక్కసారి చదువుకోవాలి... దాని వల్ల ప్రారంభంలో మనం ఎలాంటి వ్యూహం లేదు... ఎత్తుగడతో స్టాట్ చేశామో... అలాగే  ముగింపునకు మధ్య సంబంధం ఉండేలా చూసుకోవాలి.  అప్పుడే మీరు హండ్రెడ్ పర్సంట్ సక్సెస్ అయినట్టు....

మీకు మొదటి క్లాసులోనే చెప్పాను... గ్రూప్ 1 కి ప్రిపేర్ అవ్వాలంటే... ప్రిలిమ్స్ ఒక్కదానితోనే స్టార్ట్ చేస్తే కుదరదు... మెయిన్స్ కూడా కలిపి చదువుకోవాలి... అప్పుడే మీరు విన్నర్ అవుతారు.  ప్రిలిమ్స్ అయ్యాక చూద్దాంలే అనుకుంటే మాత్రం ... మీరు ఎట్టి పరిస్థితుల్లో గ్రూప్ 1 ని సాధించలేరు.

మనం నెక్ట్స్ క్లాసులో రిఫరెన్స్ బుక్స్.... ఏయే టాపిక్స్ ని ఎలా ఎత్తుకోవాలి... ఎలాంటి సొల్యూషన్ చూపించవచ్చు... అసలు గ్రూప్ 1లో ఏ టాపిక్స్ వచ్చే అవకాశం ఉంది అన్న దానిపై నెక్ట్స్ క్లాస్ లో వివరిస్తాను.

Please subscribe Telangana Exams Youtube Channel

And download Telangana Exams android app from google play store.

This is

M.Vishnu Kumar

Senior Journalist & Content Writer

Hyderabad

Thank q.