TGPSC గ్రూప్ 2 ఎగ్జామ్ కి ఇంకా ఎంతో టైమ్ లేదు. ఈ కొద్ది రోజుల్లో అభ్యర్థులు ఏ మాత్రం టెన్షన్ పడకుండా తమ ప్రిపరేషన్ సాగించాలి. మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటే… ఎగ్జామ్ ని మీరు అనుకున్న దాని కంటే ఇంకా perfect గా రాయగలుగుతారు. ఎగ్జామ్ కి వెళ్ళే ముందు రోజు ఎలా ఉండాలి ? అలాగే ఎగ్జామ్ హాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది ఈ ఆర్టికల్ లో వివరిస్తాం..
2024 డిసెంబర్ 15, 16 తేదీల్లో Group.2 exam నిర్వహణకు TGSPSC అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అదే రోజు RRB JE ఎగ్జామ్ ఉన్నందున పోస్ట్ పోన్ చేయాలని కొందరు అభ్యర్థులు కోరుతున్నారు. అయితే ఈ RRB పోస్టులకీ – గ్రూప్ 2 ని కూడా రాస్తున్న అభ్యర్థుల 20 మందికి మించి లేరని వార్తలు వస్తున్నాయి. అయినప్పటికీ Group 2 ఎగ్జామ్ నిర్వహణకు ఇప్పటికే 33 జిల్లా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు జరిగాయి. అందువల్ల ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మార్చేది లేదని TGPSC అధికారులు చెబుతున్నారు. గతంలో ఇలాగే గ్రూప్ 1 మెయిన్స్ కి మంచి ప్రిపేర్ అయిన అభ్యర్థులు కూడా చివరి నిమిషంలో వాయిదా పడుతుందని ఆశలు పెట్టుకొని సరిగా ప్రిపేర్ అవ్వలేకపోయారు. అందుకే మళ్ళీ అలాంటి ఊహాగానాలకు అవకాశం ఇవ్వకుండా… మీరు మాత్రం ప్రిపరేషన్ లోనే ఉండగలరు. ఈ నెల డిసెంబర్ 9 నుంచి TGPSC WEBSITE లో గ్రూప్ 2 హాల్ టిక్కెట్స్ అందుబాటులోకి వస్తాయి.
మీ సెంటర్ ముందే తెలుసుకోండి !
మీకు హాల్ టిక్కెట్స్ రాగానే ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ పడిందో తెలుసుకోండి. దాదాపు మీరు అప్లయ్ చేసిన మీ జిల్లా కేంద్రంలోనే ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది. కాకపోతే… ఏ సెంటర్ లో ఎగ్జామ్ రాయాలన్నది తెలుస్తుంది కాబట్టి… ఆ కేంద్రానికి టైమ్ కి చేరుకోడానికి ఉన్న ఏర్పాట్లను చూడండి. బస్సులు లేదా బండ్ల మీద వెళ్ళడానికి ముందే ప్లాన్ చేసుకోండి. ఈ విషయం మాకు తెలుసు కదా అని అనుకోవద్దు. చాలామంది ఎగ్జామ్ సెంటర్ గేట్లు మూసిన తర్వాత వచ్చి రిటర్న్ వెళ్ళిపోతున్న సంఘటనలు చాలా జరుగుతున్నాయి. మీరు గ్రూప్ 2 ఆఫీసర్ కోసం పోటీపడుతున్నారు. అందువల్ల ఇలా టైమ్ అయిపోయాక వచ్చి… ఇంటికి వెళ్ళిపోయే సందర్భాన్ని కలిగించుకోవద్దు.
ఇది కూడా చదవండి : Group.3 ఫలితాలు లేట్ : 1,2 పోస్టుల భర్తీ తర్వాతే ….
పరీక్ష ముందు రోజు ఎలా ఉండాలి ?
పరీక్షకు ఒక రోజు ముందు అభ్యర్థులు తెల్లారి ఎగ్జామ్ సెంటర్‌కు వెళ్లేందుకు అవసరమైన వాటిని సిద్ధం చేసుకోండి. మొదటి రోజు పేపర్ 1కి తీసుకెళ్ళిన హాల్ టిక్కెట్ నే మిగతా అన్ని పరీక్షలకు తీసుకెళ్ళాలి. పైగా Group.2 రిక్రూట్ మెంట్ ప్రాసెస్ పూర్తి అయ్యేదాకా కూడా అదే హాల్ టిక్కెట్ మీ దగ్గర ఉండాలి. అందువల్ల ఆ హాల్ టిక్కెట్ ను ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు. చాలా భద్రంగా దాచుకోండి.
గ్రూప్ 2 ఎగ్జామ్ కి చాలా తీవ్ర పోటీ ఉంది. అందువల్ల చివరి నిమిషం దాకా టైమ్ వేస్ట్ చేసుకోకుండా చదవాలి అనే కోరిక చాలా మంది ఉంటుంది. కానీ అతిగా చదవడం వల్ల మానసిక ఒత్తిడి, అలసటకు గురయ్యే ప్రమాదం కూడా ఉంది. రేయింబవళ్లు శ్రమిస్తేనే మంచి మార్కులు వస్తాయని భ్రమలో ఉండొద్దు. అలాంటి భ్రమలోనే కొందరు ఆరోగ్యం లెక్క చేయకుండా… ప్రిపేర్ అవుతూ ఉంటారు. పరీక్షకు ముందు రోజు కూడా అర్థరాత్రి దాకా చదువుతారు. కానీ అలా చేయొద్దు. ముందు రోజు అర్థరాత్రి దాకా మెలకువతో ఉంటే… తెల్లారి exam centre లో మీ ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. అందువల్ల ముందు రోజు ఎలాంటి ఆందోళన లేకుండా… హాయిగా కంటి నిండా నిద్ర పోండి. ప్రశాంతంగా పరీక్షకు హాజరవ్వండి.
ఇది కూడా చదవండి : 8000 VRO పోస్టులపై అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు
ఎగ్జామ్ హాల్ టిప్స్
మీరు గత రెండేళ్ళుగా ఎంతో కష్టపడి చదివారు… అయినా ఎగ్జామ్ రోజు రెండున్నర గంటల టైమ్ లో మీరు చూపించే టాలెంట్ మీదే మీ ఉద్యోగం ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఎగ్జామ్ రోజు మీరు అప్రమత్తంగా ఉండాలి. ఎగ్జామ్ లో ఆన్సర్స్ పెట్టడానికి ఉద్దేశించిన OMR షీట్ ను జాగ్రత్తగా నింపాలి. ఎలాంటి తప్పులు రాకుండా చూసుకోండి. OMR షీట్ Fill చేసేటప్పుడు ప్రశాంతంగా ఉండండి… షీట్ చేతికి రాగానే హడావిడిగా నింపే ప్రయత్నం చేస్తే… ఎంత బాగా రాసేవాళ్ళకి అయినా తప్పులు పోయే ఛాన్సుంది.
తర్వాత Question Paper ని కూడా తీసుకోగానే హడావిడిగా జవాబులు గుర్తించే ప్రయత్నం చేయొద్దు. ముందుగా ప్రశ్నాపత్రం మొత్తం ఒక్కసారి మొత్తం చూడండి. 1 నుంచి 150 వ ప్రశ్న వరకూ పైపైన చదవండి… కనీసం 10 నిమిషాల టైమ్ అయినా పెట్టండి. దాంతో ప్రశ్నల స్థాయి మీకు అర్థమవుతుంది. ముందు చూసినప్పుడు కఠినంగా అనిపించినా… రాసేటప్పుడు మాత్రం ఈజీగానే అనిపిస్తాయి.
ఇక్కడ మూడు స్టెప్స్ ఫాలో అవ్వాలి:
1st STEP:
మొదట మీకు బాగా ఈజీగా అనిపించిన ప్రశ్నలు అన్నింటికీ సమాధానం ఇవ్వండి.
2nd STEP
రెండో స్టెప్ లో ఓ మోస్తరు క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి.
3rd STEP
చివరగా అత్యంత క్లిష్టంగా భావించిన ప్రశ్నలపై దృష్టి పెట్టాలి.
ఎలాగూ TGPSC ఎగ్జామ్స్ లో నెగిటివ్ మార్కింగ్ విధానం లేదు కాబట్టి… దాదాపు అన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించే ప్రయత్నం చేయండి.
ఇంకో టెక్నిక్
ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ టైప్ లో ఉన్న వాళ్ళు సాధారణంగా ఓ టెక్నిక్ ఫాలో అవుతూ ఉంటారు… ఎలిమినేషన్ టెక్నిక్…. అంటే ప్రశ్నకు ఇచ్చిన 4 answersలో… ఆ question కి suit కాని answer ఒక్కోటి తొలగించుకుంటూ.. చివరగా మిగిలిన ఆప్షన్‌ను ఆన్సర్ గా గుర్తించండి. ఈ టెక్నిక్‌ను కూడా ఎగ్జామ్ చివరి step-3 లో ఫాలో అవ్వండి. అప్పటికే మీకు ఆన్సర్లు తెలిసిన అన్ని ప్రశ్నలను పూర్తి చేసుకొని ఉంటేనే… elimination or guessing method ని ఫాలో అవ్వండి.
చివరగా మరో ముఖ్య విషయం….
OMR షీట్ లో answers బబుల్స్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు సమాధానం గుర్తిస్తున్న ప్రశ్న సంఖ్య… ఆప్షన్ సరిగ్గా చూసుకొని… దానికి అనుగుణంగా OMR షీట్ లో అదే సంఖ్య దగ్గర సమాధానం అంటే bubbling చేస్తున్నామా లేదా చూసుకోండి. హడావిడి పడొద్దు. టైమ్ చాలా ఉంటుంది.
ఆరోగ్యం జాగ్రత్త….
ఈ వారం, 10 రోజులు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి… సిలబస్ రివిజన్ కోసం ఆరాటపడి… రాత్రిళ్ళు ఎక్కువ టైమ్ మేల్కొని ఉండొద్దు. అలాగే బయటి ఫుడ్ తినొద్దు… ఆలోచనలతో… టెన్షన్ తో గడపకుండా… ప్రశాంతంగా ఉండండి. ఎగ్జామ్ ముందు రోజు వరకూ డైలీ టైమ్ టేబుల్ ఫాలో అవ్వండి.
అంతా మంచే జరుగుతుంది… అంతా మన మంచికే అన్న సూత్రాన్ని ఫాలో అవ్వండి.
All the best….
ఉద్యోగ, విద్యా సమాచారం కోసం ఈ కింది లింక్ ద్వారా వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి.
🎯 ఎగ్జామ్స్ సెంటర్ CLICK HERE FOR TELEGRAM LINK
🎯 తెలుగు వర్డ్ Telegram Link : CLICK HERE FOR TELEGRAM LINK
Subscribe తెలంగాణ ఎగ్జామ్స్ Channel : https://www.youtube.com/@TelanganaExams