
రాష్ట్రంలో Group.2 & Group 3 నోటిఫికేషన్లను రిలీజ్ చేసేందుకు TSPSC ఏర్పాట్లు చేస్తోంది. గ్రూప్ 2 లో మరో 6 కేటగిరీలను చేర్చడంతో పోస్టుల సంఖ్య కూడా పెరగనుంది. ప్రస్తుతం గ్రూప్ 2 లో ఉన్న 16 సర్వీసు ఉద్యోగాలతో పాటు మరో 6 కేటగిరీలో చేరడంతో మొత్తం 22 సర్వీసులకు సంబంధించిన నోటిఫికేషన్ తొందర్లోనే రిలీజ్ అవనుంది. గ్రూప్ 2, 3 పోస్టుల వర్గీకరణ, పరీక్ష, ఎంపిక విధానం నిబంధనలను సవరిస్తూ ప్రభుత్వం జీవో.136 ని జారీ చేసింది. దాంతో ఈ రెండు ప్రకటనలను జారీ చేయడానికి ఉన్న టెక్నికల్ ఇబ్బందులు తొలగిపోయాయి.
మొదట గ్రూప్ 2 తర్వాత గ్రూప్ 3
మొదట గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇవ్వాలని TSPSC డిసైడ్ అయ్యింది. ఆ తర్వాత వారం, రెండు వారాల గ్యాప్ లో గ్రూప్ 3 నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. డిసెంబర్ కల్లా ఈ రెండు నోటిఫికేషన్లు విడుదల అవుతాయి.
గ్రూప్ 2 లో చేరిన కొత్త సర్వీసులు ఇవే
గ్రూప్ పరిధిలో కొత్తగా 6 సర్వీసులు చేరాయి. అంతకుముందున్న 16+ 6 మొత్తం 22 సర్వీసులు ఉంటాయి. కొత్తగా చేరిన పోస్టుల్లో
1) సహాయ సెక్షన్ అధికారి (రాష్ట్ర ఎన్నికల కమిషన్ సేవలు)
2) సహాయ సెక్షన్ అధికారి (ఇతర విభాగాలు)
3) జిల్లా ప్రొబేషనరీ అధికారులు (జువైనల్ విభాగం)
4) సహాయ సాంఘిక సంక్షేమ అధికారి
పోస్టులు పెరిగాయి
గ్రూప్ 2 కింద 663 పోస్టులు, గ్రూప్ 3 కింద 1373 పోస్టులను గుర్తిస్తూ 2022 ఆగస్టు 30న ప్రభుత్వం జీవో ఇచ్చింది. వేర్వేరు విభాగాలకు సంబంధించి ఈ రెండు కేటగిరీల అదనపు పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అదనపు పోస్టుల్లో సంక్షేమ శాఖల్లో SC – 17, ST-9, BC-17 సహాయ సంక్షేమ అధికారి పోస్టులు కలిపి మొత్తం 43 యాడ్ అయ్యాయి. అలాగే జువైనల్ సర్వీస్ లో 11 జిల్లా ప్రొబేషనరీ అధికారుల పోస్టులు గ్రూప్ 2 లో కలుస్తాయి. ఇంకా సహాయ సెక్షన్ అధికారుల పోస్టులు కూడా కలుపుకుంటే గ్రూప్ లో 100 కు పైగా పోస్టులు పెరిగే అవకాశముంది. అటు గ్రూప్ 3 లో ఇప్పటికే 1373 పోస్టులు గుర్తించగా… వీటికి కూడా అదనపు పోస్టులు కలుస్తున్నాయి.
Friends
మనం గ్రూప్ 2,3,4 కు సంబంధించి Combined గా ప్రిపేర్ అయ్యేందుకు Telangana Exams Plus యాప్ లో కోర్సు నిర్వహిస్తున్న సంగతి మీకు తెలుసు. ఈ కోర్సుకు సంబంధించి… గ్రూప్ 2 నోటిఫికేషన్ వెల్లడి అయిన వెంటనే కొత్త DATE WISE SYLLABUS CHART (up to Group.2 Exam date) ఇవ్వబడను. అయితే ఇప్పటికే జాయిన్ అయిన వారికి పాత సిలబస్ ఛార్ట్ కూడా అందుబాటులో ఉంది. మీరు ఇప్పుడే కోర్సులో జాయిన్ అవ్వండి.
గుర్తుంచుకోండి
గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో standard మారింది. గమనించండి.. అదే స్థాయిలో గ్రూప్ 2 కూడా ఉంటుంది. అందువల్ల మేం తెలుగు అకాడమీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్స్ ఆధారంగా స్టేట్ మెంట్ ప్రశ్నలను అదనంగా చేరుస్తున్నాం. వాటితో మీరు గ్రూప్ 2,3,4 లో ఏదో ఒకటి సాధించడానికి వీలుంటుంది. ఈ కింది కోర్సులో వెంటనే జాయిన్ అవ్వండి.
ఈ కింది లింక్ ద్వారా కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కొలువు కల నెరవేర్చుకోండి.
ప్రతి రోజూ కరెంట్ ఎఫైర్స్ (text రూపంలో) యాడ్ అవుతున్నాయి. ఈ కింది లింక్ ద్వారా ప్రతి రోజూ Telangana Exams Website ని సందర్శించండి
https://telanganaexams.com/category/current-affairs/
Telangana Exams Telegram Group Link
https://t.me/telanganastategroup