503 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ రిలీజ్

503 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ రిలీజ్

తెలంగాణ ఏర్పడిన తరువాత మొదటి గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ చేసింది TSPSC. కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్..2018 దృష్ట్యా స్థానిక అభ్యర్థులకు 95% రిజర్వేషన్‌తో పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 503 పోస్టులతో నోటిఫికేషన్ విడుదలయింది. మే 2 నుంచి మే 31 వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తారు.
రెండు విధాలుగా గ్రూప్ 1 పరీక్ష నిర్వహిస్తారు.
ప్రిలిమినరీ టెస్ట్ (ఆబ్జెక్టివ్ టైప్)
మెయిన్స్ (రాత పరీక్ష)
గ్రూప్-1 ఇంటర్వ్యూలను ఇప్పటికే ప్రభుత్వం రద్దు చేసింది.
రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లో ప్రిలిమినరీ టెస్ట్ (ఆబ్జెక్టివ్ టైప్) జూలై లేదా ఆగస్టులో నిర్వహిస్తారు. నవంబర్ లేదా డిసెంబర్ లో మెయిన్స్ పరీక్ష జరగనుంది.
గ్రూప్-I నోటిఫికేషన్ కోసం దరఖాస్తు చేయడానికి ముందు, అభ్యర్థులు తప్పనిసరిగా TSPSC OTRలో నమోదు చేసుకోవాలి. లేదా కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌కు అనుగుణంగా వారి OTRని అప్‌డేట్ చేయాలి.
గ్రూప్-1 సర్వీసెస్‌లో మొదటిసారిగా EWS, స్పోర్ట్స్ రిజర్వేషన్లు అమలు చేయనున్నారు.

ప్రిలిమినరీ పరీక్షను ఇంగ్లీషు, తెలుగు భాషలతో పాటు ఉర్దూలో మొదటిసారిగా నిర్వహిస్తోంది TSPSC.

పూర్తి వివరాలకు ఈ కింది నోటిఫికేషన్ చూడండి

GROUP 1 NOTIFICATION

గ్రూప్ 1 (ప్రిలిమినరీ) కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక కోర్సులో మీరూ జాయిన్ అవ్వొచ్చు.  ఈ కింది లింక్ ను క్లిక్ చేయండి

https://web.classplusapp.com/newApp/store/course/87687?section=overview

మీరు కూడా FREE SLIP టెస్టులు రాయాలనుకుంటే ఇప్పుడే Telangana Exams plus యాప్ ను ఈ కింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి
http://on-app.in/app/home/app/home?orgCode=atvqp
మీరు Telangana Exams you tube channel ఫాలో అవుతున్నారా ? ప్రిపరేషన్ ప్లాన్స్, విద్యా ఉద్యోగ సమాచారం కోసం ఈ ఛానెల్ ను subscribe చేసుకోండి https://www.youtube.com/channel/UCU51N-FwR9PQJckcH0FJdiA