
గ్రూప్ 1 ప్రిలిమినరీలో ఐదు ప్రశ్నలను TSPSC తొలగించింది. గ్రూప్ 1 ఫైనల్ కీని వెబ్ సైట్ లో ఉంచింది TSPSC. ప్రాథమిక కీపై అభ్యంతరాలను పరిశీలించి… మరో రెండు ప్రశ్నలకు రెండు కన్నా ఎక్కువ సమాధానాలు ఉన్నట్టు గుర్తించారు. గ్రూప్ 1 ప్రిలిమినరీ మాస్టర్ క్వొశ్చన్ పేపర్ ప్రకారం 29, 48, 69, 82, 138 ప్రశ్నలను తొలగించింది. 107వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 1,2,3,4లో ఏది ఆప్షన్ పెట్టినా ఒక మార్కు ఇస్తామని ప్రకటించారు. 133వ ప్రశ్నకు 1 లేదా 2 ఈ రెండింటిలో ఏ ఆప్షన్ ఇచ్చినా మార్కు కేటాయిస్తారు. 57వ ప్రశ్నలకు సమాధానాన్ని ఆప్షన్ 1గా సవరించారు. మొత్తం 150 ప్రశ్నల్లో ఐదింటిని తొలగించడంతో ఇప్పుడు 145 ప్రశ్నలకు వచ్చిన మార్కులను 150కి దామాషా పద్దతిలో లెక్కిస్తారు.
FINAL KEY కోసం క్లిక్ చేయండి
GROUP.1 MASTER QUESTION PAPER