Tuesday, April 23

నెలాఖరులో గ్రూప్ -2 ఇంటర్వ్యూలు

గ్రూప్ - 2 ఇంటర్వ్యూలను ఈ నెలాఖరులో నిర్వహించేందుకు TSPSC అన్ని ఏర్పాట్లు చేస్తోంది. హైకోర్టు ఆదేశాలతో ఇప్పటికే 1:3 నిష్పత్తిలో జాబితాని ప్రకటించిన కమిషన్, సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ పూర్తి చేసింది. ప్రస్తుతం ఉద్యోగాలకు సంబంధించి వెబ్ ఆప్షన్స్ స్వీకరిస్తోంది. ఇది పూర్తయ్యాక పోస్టులు, వాటి అర్హతల ప్రకారం ఇంటర్వ్యూకి 1:2 నిష్పత్తిలో ఎంపిక చేస్తారు. ఈ మెరిట్ జాబితా విడుదలయ్యాక గ్రూప్ -2 పోస్టులకు TSPSC ఈ నెలాఖరులో ఇంటర్వ్యూలు మొదలుపెట్టనుంది.

రెండు పోస్టులకు ఇతర టెస్టులు
గ్రూప్ -2 పోస్టుల భర్తీలో 1) ఎక్సైజ్ ఇన్సెపెక్టర్ (2) ASO పోస్టులకు ఇతర పరీక్షలను కూడా TSPSC నిర్వహించనుంది. Excise Inspector పోస్టులకు ప్రాధాన్యత ఇచ్చిన వారికి ఫిజికల్ టెస్ట్ నిర్వహిస్తారు. అలాగే ASO పోస్టులకు ప్రాధాన్యత ఇచ్చిన వారికి ప్రొఫిషియెన్సీ టెస్టు ఉంటుంది.