Saturday, April 20

త్వరలోనే గ్రూప్.1, 3 నోటిఫికేషన్లు

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రూప్.1, గ్రూప్.3 ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్లు జారీ చేస్తామని TSPSC ఛైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. మారిన జోనల్ సిస్టమ్ తో పాటు, విధి విధానాలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి లెటర్ రాశామని తెలిపారు. అలాగే గ్రూప్3 కి సంభందించి కూడా స్టేట్ లెవల్, HOD లెవల్ పోస్టుల వివరణతో పాటు రోస్టర్ వివరాలు కూడా ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందన్నారు. మొత్తం 1800 పోస్టులకు వివరణ రావాల్సి ఉందన్నారు. ఆ వివరాలు రాగానే పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ఘంటా చక్రపాణి వివరించారు. జనవరి 26 వరకు ప్రభుత్వం ఇచ్చిన పోస్టులు ఏవీ తమ దగ్గర పెండింగ్ లేవన్నారు.

(ఫిబ్రవరి 1st నుంచి గ్రూప్.1 మరియు గ్రూప్.3 కి సంభందించిన guidance మేము ఇస్తాం)