Sunday, January 20

పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి అంతా సిద్ధం !

 పంచాయతీ కార్యదర్శుల నియామకాలను తొందరలొనే చేపట్టేందుకు ఆ శాఖ అధికారులు సిద్ధమయ్యారు. కొత్త సర్కార్ లో మొదటి నియమాలకు ప్రిపేర్ అవుతున్నారు. రాత పరీక్షలో మార్కులు, కొత్త జిల్లాలు, రిజర్వేషన్లు ఆధారంగా ఈ ఎంపిక ప్రక్రియ ఉంటుంది. మొత్తం 9,355 పంచాయతీ కార్యదర్శుల నియామకాలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియను పంచాయతీరాజ్‌ శాఖ మొదలు పెట్టింది. అక్టోబరులో జరిగిన రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఈ రిక్రూట్ మెంట్ జరగనుంది.  

పంచాయతీ ఎన్నికల కల్లా విధుల్లోకి కార్యదర్శులు

హైకోర్టు ఉత్తర్వులతో  పంచాయతీ ఎన్నికలను జనవరిలో నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు  చేస్తోంది.  ఈలోగా గ్రామపంచాయతీ ఎన్నికల ప్రక్రియ కూడా పూర్తయ్యే అవకాశముంది.  పంచాయతీ ఎన్నికల తర్వాత కొత్త పాలక వర్గాలు వచ్చే సరికల్లా కొత్త కార్యదర్శులు కూడా అందుబాటులోకి వస్తారని పంచాయతీ అధికారులు భావిస్తున్నారు. 

బుధవారం మీటింగ్ లో నియామకాలపై చర్చ

రాష్ట్రంలోని 30 గ్రామీణ జిల్లాల డీపీవోలతో బుధవారం నాడు హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో పంచాయతీ కార్యదర్శి పోస్టుల ఎంపికపై చర్చ జరిగినట్టు సమాచారం. పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ నీతూ ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరిగింది.  ఇప్పటికే విధుల్లో ఉన్న 3,396 మంది రెగ్యులర్‌ పంచాయతీ సెక్రటరీల వేతనాలను ప్రభుత్వమే చెల్లిస్తోంది. కొత్తగా బాధ్యతలు చేపట్టే 9,355 మందికి జూనియర్‌ కార్యదర్శులకూ ఇలాగే ప్రభుత్వం వేతనాలను చెల్లించనుంది.   

పంచాయతీ కార్యదర్శుల నియామకం ఎందుకంటే ?

తెలంగాణలో గతంలో 8,684 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.  వీటిని టీఆర్ఎస్ ప్రభుత్వం 12,751కి పెంచింది. దాంతో కొత్త కార్యదర్శుల అవసరం ఏర్పడింది. ప్రస్తుతం క్లస్టర్ల వారీగా కార్యదర్శులు విధులు నిర్వహిస్తున్నారు.  అలాకాకుండా ప్రతి  పంచాయతీ వారీగా కార్యదర్శులను నియమించాలని ప్రభుత్వం ఆగస్టు లో నిర్ణయించింది. జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి పేరుతో  6,603 పోస్టులను కొత్తగా సృష్టించింది. ఇవే కాకుండా ఖాళీగా ఉన్న మరో 2,752 ఉద్యోగాలు వీటికి జత కలిశాయి. దాంతో మొత్తం 9,355 పోస్టుల కోసం అక్టోబరు 10న రాత పరీక్షను నిర్వహించారు. JNTUH నిర్వహించిన ఈ రిటన్ ఎగ్జామ్ కి 4.75 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు.  

ఎవరికెన్ని పోస్టులు ?

ఎస్సీ - 1,400 
ఎస్టీ - 470 
బీసీ - 2,682 
దివ్యాంగులు - 300 
మాజీ సైనికులు - 200 
క్రీడాకారులు - 172 
జనరల్‌ - 4031

అన్ని వర్గాలకు కలిపి మహళలకు 3,158 పోస్టులు  వస్తాయి

మాస్టర్స్ అకాడమీ నుంచి వచ్చిన 3 యూట్యూబ్ ఛానెల్స్ SUBSCRIBE చేయండి
తెలంగాణ ఎగ్జామ్స్ ఛానెల్:
https://www.youtube.com/channel/UCU51N-FwR9PQJckcH0FJdiA?disable_polymer=true
మాస్టర్స్ టీవీ
https://www.youtube.com/channel/UC1zxevIMCLp8vuEKe5PhlXQ?disable_polymer=true
ఆంధ్రఎగ్జామ్స్ :
https://www.youtube.com/channel/UC2NZvwJ-Ydiavfs90Ea4Alg?disable_polymer=true