Sunday, January 20

ఈనెల 25కల్లా పంచాయతీ కార్యదర్శుల భర్తీ

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 9,355 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి ప్రిపేరేషన్స్ పూర్తయ్యాయి. ఈనెల 27 లోపు నియామకాలు పూర్తి చేసి... ఆ రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే సదస్సులో జూనియర్ పంచాయతీ అధికారులు కూడా పాల్గొనేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు.

9,355 జూనియర్ పంచాయతీ గ్రామ కార్యదర్శుల నియామకానికి సంబంధించి జిల్లాల వారీగా ఎంపిక చేసిన అభ్యర్ధుల హాల్ టికెట్ల నెంబర్లను స్థానిక పత్రికల్లో ప్రచురించేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని CS ఎస్కే జోషి కోరారు. ఈ నెల 25 లోగా నియామకపు పత్రాలు జారీ చేసేలా కలెక్టర్లు పని చేయాలన్నారు ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్. ఉద్యోగాలకు ఎంపికైన అర్హుల సర్టిఫికెట్లను 3 రోజుల్లోగా పరిశీలన పూర్తి చేసుకోవటానికి ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. ప్రతి రోజు 300 నుంచి 400 మంది అభ్యర్ధుల సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. దరఖాస్తులో సమర్పించిన విద్యార్హత, వయస్సు, కులం, లోకల్ , ప్రత్యేక క్యాటగిరీల సర్టిఫికెట్లు పరిశీలిస్తారు. వీటికి సంబంధించి గైడ్ లైన్స్, చెక్ లిస్ట్ లను పంపుతున్నామన్నారు. ముఖ్యమంత్రి KCR  ఈనెల 27 న నిర్వహించే కాన్ క్లేవ్ లో గ్రామ కార్యదర్శులు, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు పాల్గొనటానికి దృష్టి సారించాలన్నారు ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్.

NOTE: మంగళ లేదా బుధవారాల్లో అర్హులైన అభ్యర్థుల జాబితా జిల్లా ఎడిషన్స్ లో ప్రచురించే అవకాశం ఉంది.

SI/PC(M)/GR.1,2 & 3- 50రోజుల్లో 325 TESTS
మొత్తం మాక్ టెస్టులు : 320 గ్రాండ్ టెస్టులు : 05

( మొత్తం కవరయ్యే ప్రశ్నలు : దాదాపు 9000)
https://telanganaexams.com/50days-tests/