పంచాయతీ కార్యదర్శి పోస్టుల సిలబస్

2019 ఏప్రిల్ లో 9,335 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది.  అప్పట్లో పంచాయతీ కార్యదర్శి పోస్టులకి గతంలో మేం స్టేట్ మెంట్స్ రూపంలో మాక్ టెస్టులు నిర్వహించాం.  వాటిల్లో 80 నుంచి 90 శాతం వరకూ కవర్ అయినట్టు చాలామంది మెస్సేజ్ లు పెట్టారు.  గతంలో బుక్స్ కూడా సేల్ చేశాం.  కానీ ఈసారి ఆ పరిస్థితి ఉండకపోవచ్చు ( ఒకవేళ ఎగ్జామ్ కి టైమ్ ఉండీ... సప్లయ్ చేయగలిగితే సమాచారం ఇస్తాం ). ప్రస్తుతం కోవిడ్ 19 కారణంగా కోచింగ్ తీసుకునే పరిస్థితి లేదని భావిస్తున్నాను.  అందువల్ల మీకు ప్లానింగ్ కూడా ఇస్తాను. మీరే సొంతంగా చదువుకోవచ్చు. అలాగే ఎగ్జామ్ సిలబస్, ప్యాటర్న్ తెలిశాక మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులకు సంబంధించిన సమాచారం అందిస్తాను.  మీరు నూటికి నూరుపాళ్ళు విజయం సాధించేలా చూడాలన్నది మా ధ్యేయం.

( మా మాక్ ఎగ్జామ్స్, గ్రాండ్ టెస్టుల్లో పూర్తిగా సిలబస్ కవర్ అవుతుంది )

అలాగే ఏ వారం ఏమేం చదవాలి...

ఆ సబ్జెక్ట్ లో ఇంపార్టెంట్ ప్రశ్నలు ఏంటి...

ఎగ్జామ్ పేపర్లో ఎలా అడిగే వీలుంది లాంటి టాపిక్స్ ను సబ్జెక్ట్ నిపుణులతో అందిస్తాం.

అందువల్ల మీరు కోచింగ్ తీసుకున్నా... తీసుకోకపోయినా... ఓ ప్లాన్డ్ ప్రకారం చదివితే విజయం సాధించేలా మా ప్రోత్సాహం ఉంటుంది.

పేపర్ 1
ఈ పేపర్ ప్రస్తుతం మీరు ప్రిపేర్ అవుతున్న VRO/GR.IV/PC/SI మోడల్ ను పోలి ఉంది. అంటే మీరు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నదే. మొత్తం 12 అంశాలు ఉన్నాయి
1) రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ వర్తమాన అంశాలు (కరెంట్ అఫైర్స్)
2) అంతర్జాతీయ సంబంధాలు, అంతర్జాతీయ ఘటనలు
3) నిత్య జీవితంలో సైన్స్
4) పర్యావరణ సమస్యలు, విపత్తు నిర్వహణ అంశాలు
5) దేశ, రాష్ట్ర భౌగోళిక అంశాలు, భారత, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ
6) భారత రాజ్యాంగం - విశిష్ట లక్షణాలు
7) భారత రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వం
8) ఆధునిక భారత దేశ చరిత్ర, జాతీయోద్యమం
9) తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమం
10) తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు,
11) తెలంగాణ ప్రభుత్వ విధానాలు, పథకాలు
12) మెంటల్ ఎబిలిటీ (వెర్బల్ & నాన్ వెర్బల్ )

పేపర్ 2
ఇందులో మొత్తం 10 అంశాలపై అభ్యర్థులు ప్రిపరేషన్ సాగించాలి

1) తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం, 2018
2) భారత దేశంలో పంచాయతీ రాజ్ వ్యవస్థ ఏర్పాటు, రాజ్యాంగ సవరణలు, వివిధ కమిటీల నివేదికలు
3) పంచాయతీ కార్యదర్శి విధులు, బాధ్యతలు
4) గ్రామీణ ఆర్థిక స్థితిగతులు, గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వాలు చేపట్టిన పథకాలు, గ్రామీణ నిరుపేదలను ఆదుకోడానికి ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలు, చేపట్టిన కార్యక్రమాలు
5) భారత ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి పథకాలు, వివిధ శాఖల పనితీరు
6) తెలంగాణ రాష్ట్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయం, చిన్న తరహా పరిశ్రమలు, పనితీరు, గ్రామీణ పేదల సాధికారిత, స్వావలంబన కోసం ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు, గ్రామీణ చేతి వృత్తులు
7) స్థానికంగా ఉన్న కమ్యూనిటీ ఆధారిత సంస్థలు, సంక్షేమ పథకాలు
8) మహిళా సాధికారత, వారి ఆర్థికాభివృద్ధిలో స్వయం సహాయక సంఘాల పాత్ర
9) స్థానిక సంస్థల రెవెన్యూ - ఖర్చుల పద్దు నిర్వహణ
10) వివిధ పథకాల నుంచి గ్రామాలకు వచ్చే నిధుల వివరాలు
2) గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వాలు చేస్తున్న కృషి

(మేడుకొండూరు విష్ణుకుమార్, సీనియర్ జర్నలిస్ట్ )