Thursday, February 27

బ్యాంక్స్, RRB, SSC పరీక్షలకు ఉచిత శిక్షణ

బ్యాంకులు, RRB, SSC ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోసం ఉచితంగా నాలుగు నెలల పాటు ఫౌండేషన్ కోచింగ్ ఇవ్వడానికి సిద్దిపేట బీసీ స్టడీ సర్కిల్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు.
డిగ్రీ పూర్తయిన యువతీ యువకులు 39యేళ్ళ గల వారు అప్లయ్ చేసుకోవచ్చు. స్టడీ సర్కిల్‌లో కోచింగ్ కోసం 75 శాతం బీసీలకు, 15 శాతం ఎస్సీలకు, 5 శాతం ఎస్టీలకు, ఇతరులకు 5 శాతం సీట్లు కేటాయిస్తారు. కోచింగ్ సమయంలో మెటీరియల్ కూడా ఉచితంగా అందిస్తారు. ఈ నెల 30 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. వచ్చే నెల 2న అభ్యర్థులను ఎంపిక చేసి... వచ్చే నెల 8 నుంచి తరగతులు ప్రారంభిస్తారు. SC/ST/BC అభ్యర్థులైతే కులధ్రువీకరణ పత్రం సమర్పించాలి. అలాగే గ్రామీణ ప్రాంతం వాళ్ళయితే ఏడాదికి లక్షా 50 రూపాయల లోపు ఆదాయం, పట్టణ ప్రాంతాల వాళ్ళయితే 2 లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్న వారు దరఖాస్తు చేసుకోవవచ్చు.

అభ్యర్థులు ఆన్‌లైన్‌లో http://http//tsbcstudycireles.cgg.govt.in  వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.