- అమెరికాకు చెందిన Space X సంస్థ మూడేళ్ల తర్వాత మొదటి సారిగా తన భారీ ‘ఫాల్కన్ హెవీ’ రాకెట్ ను 2022 నవంబర్ 1నాడు నింగిలోకి ప్రయోగించింది. దీంతో కొన్ని సైనిక ఉపగ్రహాలను భూకక్ష్యలోకి పంపింది.
- కేప్ కెనావెరాల్లోని కెనెడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరిగింది.
- రాకెట్ మొదటి దశలోని 27 ఇంజిన్ల సౌండ్ దాదాపు 5 కిలోమీటర్ల దాకా వినిపించింది.
- ప్రయోగించిన రెండు నిమిషాల తర్వాతయ ఫాల్కన్ రాకెట్ నుంచి రెండు బూస్టర్లు విడిపోయాయి. కేప్ కెనవెరాల్లో ల్యాండ్ అయ్యాయి. వీటిని తర్వాత ప్రయోగాల్లో వినియోగిస్తారు.
- ఫాల్కన్ హెవీ రాకెట్ ను మొదటిసారిగా 2018లో ప్రయోగించారు.
ఆ తర్వాత 2019లో రెండుసార్లు అది ఆకాశంలోకి వెళ్ళింది