
- రబీ సీజన్లో మొత్తం రూ.51,875 కోట్ల సబ్సిడీ ఇవ్వాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది.
- ఈ ఏడాది రబీ సీజన్ లో (అక్టోబరు 1, 2022 నుంచి మార్చి 31, 2023 వరకూ) ఎరువులపై రూ.51,875 కోట్ల రాయితీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
- గత ఏడాది కంటే ఇది రూ. 23,220 కోట్లు ఎక్కువ. నత్రజనికి కిలోకు రూ.98,02, పాస్పరస్ కు రూ.83, పొటాష్ కు రూ.23.65, సల్ఫర్ కు రూ.6.12 సబ్సిడీ ఇస్తారు.
- ఈ రబీలో దేశంలో తయారయ్యే ఎరువుల రవాణా సబ్సిడీ కలిపి మొత్తం రూ. 875 కోట్ల రాయితీ భారం కేంద్రం భరించనుంది.
- వ్యవసాయ ఖర్చులను అదుపులో ఉంచాలన్న ఆలోచనతో ఎరువుల సబ్సిడీని ప్రభుత్వం 2010, ఏప్రిల్ 1 నుంచి పోషకాధారిత రాయితీ పథకం కింద అందిస్తోంది.
- అంతర్జాతీయ మార్కెట్లో ఎరువులు, వాటి ముడిసరకుల ధరలు విపరీతంగా పెరగడంతో DAP, P & K ఎరువులపై సబ్సిడీ భారం పెరిగినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.