ఎంట్రన్స్ టెస్టుల అప్లికేషన్లలో EWS ఆప్షన్

ఎంట్రన్స్ టెస్టుల అప్లికేషన్లలో EWS ఆప్షన్

రాష్ట్రంలో ఉన్నత విద్యలో ప్రవేశానికి జరిగే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో 10శాతం EWS (ఆర్థికంగా వెనుకబడినవారు) కోటా అమలు చేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. 2021 మార్చి నెలలో విడుదలయ్యే అన్ని ఎంట్రన్స్ టెస్టుల అప్లికేషన్లలోనూ ఈ ఆప్షన్ ఇస్తారు. ఇప్పటికే లాసెట్, పీఈసెట్ కమిటీ సమావేశాల్లో ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. 2021-22 సంవత్సరానికి విద్యా సంస్థల్లో ప్రవేశానికి EWS కోటాను అమలు చేయబోతున్నారు. ఆన్ లైన్ అప్లికేషన్లలో EWS కాలమ్ ఉంటుంది. అడ్మిషన్స్ టైమ్ కల్లా విద్యార్థులు EWS సర్టిఫికెట్స్ ను సమర్పించాల్సి ఉంటుంది. లేకపోతే జనరల్ కేటగిరీ కిందే పరిగణిస్తారు. రాష్ట్రంలోని అన్ని ఉన్నత విద్యా కోర్సుల్లో EWS 10శాతం కోటా అమలు చేస్తే మరో 50 వేలకు పైగా సీట్లు పెరిగే అవకాశముంది. బీటెక్ లో దాదాపు 10 వేల సీట్లు అదనంగా వస్తాయని అంచనా వేస్తున్నారు.

NEVER BEFORE - అన్ని ఎగ్జామ్స్ ఫీజులు తగ్గించాం !! (మార్చి 5 వరకూ మాత్రమే ఆఫర్)

http://telanganaexams.com/never-before/