Friday, September 20

నిరుద్యోగ భృతి రూ.3016/- :: బడ్జెట్ కేటాయింపులు రూ.1810 కోట్లు

రాష్ట్రంలో నిరుద్యోగ భృతిని నెలకు రూ.3016లు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ముందు వాగ్దానం చేశారు. అందుకనుగుణంగా 2019-20 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో రూ.1810 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. దీనికి సంబంధించిన విధి విధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించినట్టు బడ్జెట్ మీటింగ్ లో సీఎం వెల్లడించారు. దాంతో అధికారులు విధి విధానాలను తయారు చేసే పనిలో ఉన్నారు.

1) నిరుద్యోగ భృతి అమలు చేయాలంటే ఎవర్ని నిరుద్యోగులుగా గుర్తించాలి ?

2) ఎంత వరకు చదివిన వాళ్ళని గుర్తించాలి ?

3) ఏజ్ లిమిట్ ఎంతవరకు ఉండాలి ?

ఈ అంశాలను పరిశీలించి అధికారులు నిబంధనలను తయారు చేయబోతున్నారు.  వీటిని లెక్కలోకి తీసుకుంటే రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులకు నిరుద్యోగ భృతిని ఇవ్వొచ్చు అన్న దానిపైనా నిర్ణయం తీసుకుంటారు. అంతేకాకుండా... వివిధ రాష్ట్రాల్లో నిరుద్యోగ భృతిని ఎలా అమలు చేస్తున్నారన్న దానిపైనా స్టడీ చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాతే బడ్జెట్ నిధులకు అనుగుణంగా ఎంతమందికి ఏ ప్రాతిపదికన భృతి ఇవ్వాలన్నది నిర్ణయిస్తారు.

ప్రస్తుతం నిరుద్యోగ భృతి అమలు చేస్తున్న రాష్ట్రాలు :

1) ఛత్తీస్ గఢ్

2) హిమాచల్ ప్రదేశ్

3) కేరళ

4) మధ్య ప్రదేశ్

5) రాజస్థాన్

6) ఆంధ్రప్రదేశ్

మిగతా రాష్ట్రాల్లో నిరుద్యోగ భృతి ఎలా ఇస్తున్నారు ?

- మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు 22యేళ్ళ నుంచి 35 యేళ్ళ వయస్సు మధ్యనున్న నిరుద్యోగులకు ఇస్తున్నాయి

- ఛత్తీస్ గఢ్, కేరళలో 18 నుంచి 35 యేళ్ళ మధ్య వయస్సును లెక్కలోకి తీసుకున్నారు

- హిమాచల్ ప్రదేశ్ లో 20 నుంచి 35 యేళ్ళ మధ్య వయస్సు వారికి ఇస్తున్నారు

- రాజస్థాన్ లో 21- 35 యేళ్ళ మధ్యలో ఉన్న నిరుద్యోగులకు భృతిని ఇస్తున్నారు.