Wednesday, June 19

మే 2 నుంచి ఎంసెట్

తెలంగాణ ఎంసెట్ ను మే 2 నుంచి ఎంసెట్ నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. గత ఏడాది మే 2 నుంచి 7 వరకూ ఎంసెట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ పరీక్షలు జరిగాయి. ఏపీలో ఏప్రిల్ చివరి వారంలోనే ఎంసెట్ ఎగ్జామ్స్ మొదలయ్యాయి. చాలామంది విద్యార్థులు రెండు రాష్ట్రాల పరీక్షలకు హాజరవుతారు. దాంతో వారికి ఇబ్బంది లేకుండా ఈసారి కూడా వేర్వేరు తేదీల్లో ఎంసెట్ పరీక్షలను నిర్వహించే అవకాశముంది. ఈసారి మే5న నీట్ పరీక్ష జరుగుతోంది. దానికి అటు ఇటుగా ఎంసెట్ షెడ్యూల్ ను ఖరారు చేయనున్నారు. కిందటేడాది జరిగిన తేదీల్లోనే ఈ ఏడాది కూడా అన్ని ప్రవేశ పరీక్షలను నిర్వహించబోతున్నారు. గత ఏడాది మే 2న మొదలై నెలాఖరు దాకా ఏడు రకాల పరీక్షలను నిర్వహించారు.