DPT -50 – GK (for VAO,Constable,GR.IV Aspirants)

1) వందేమాతరం పాటను ఒరిజినల్ గా ఏ భాషలో కంపోజ్ చేశారు ?
జ: సంస్కృతం
2) డ్యురాండ్ రేఖ - పాకిస్తాన్ తో ఏ దేశానికి మధ్య ఉంది ?
జ: ఆఫ్గనిస్తాన్
3) ఏ చెట్టు పెరగడానికి తక్కువ నీటిని వాడుకుంటుంది ?
జ: సుబాబుల్
4) ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే భాష ఏది ?
జ: మాండరిన్ (చైనాలో )
5) భారత్ పూర్తిగా వేటి ఉత్పత్తిలో స్వయం సంవృద్ధిని సాధించింది ?
జ: పాలు
6) SAARC లో సభ్యత్వం లేని దేశం ఏది ?
జ: మారిషస్
7) విస్తీర్ణంలో దేశంలో చిన్న రాష్ట్రం ఏది ?
జ: గోవా
8) ఫార్వార్డ్ బ్లాక్ పార్టీని ఎవరు స్థాపించారు ?
జ: సుభాష్ చంద్రబోస్
9) ఫుట్ అండ్ మౌత్ వ్యాధి వేటికి సోకుతుంది ?
జ: పశువులు
10) హైకోర్టులో ఎంతమంది జడ్జిలు ఉండాలనేది ఎవరు నిర్ణయిస్తారు ?
జ: రాష్ట్రపతి
11) రాజ్యాంగ సవరణకు సంబంధించిన బిల్లులను పార్లమెంట్ లో ఏ సభలో ప్రవేశపెడతారు ?
జ: ఏ సభలోనైనా
12) ఫిన్ లాండ్ రాజధాని ఏది ?
జ: హెల్సింకి
13) స్వర్ణ్ జయంతి గ్రామ్ స్వరోజ్ గార్ యోజన ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది ?
జ: ఏప్రిల్ 1999
14) ఇంటర్నేషనల్ కాఫీ ఆర్గనైజేషన్ లో కొత్తగా చేరిన సభ్య దేశం ఏది ?
జ: వియత్నాం
15) చెకోరీ పౌడర్ మొక్కలోని ఏ భాగంలో లభిస్తుంది ?
జ: వేళ్ళల్లో
16) దాద్రా నగర్ హవేలీకి రాజధాని ఏది ?
జ: సిల్వాసా
17) అక్బర్ కు సమకాలికులైన భారతీయ పాలకురాలు ఎవరు ?
జ: రాణి దుర్గావతి
18) అవధ్ స్వతంత్ర్య రాజ్యాన్ని స్థాపించిన రాజు ఎవరు ?
జ: సాదత్ ఖాన్ బుర్హాన్ ఉల్ ముల్క్
19) మహేంద్ర సింగ్ ధోనీ మొదటి అంతర్జాతీయ వన్డేని ఎక్కడ ఆడాడు ?
జ: చిట్టగాంగ్
20) గురుముఖి రాతను పరిచయం చేసిన సిక్కుల గురువు ఎవరు ?
జ: గురు అంగద్

(TRT, VAO, CONSTABLE కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని ఇస్తున్న మెటీరియల్ ఇది.  మాక్ టెస్టులు రాసే అభ్యర్థులకే కాకుండా...రాయని వారికి కూడా అందిస్తున్నాం )