DPT-42 భారత రాజ్యాంగం

1) గాంధేయవాద నమూనాని ఏ ప్రభుత్వం 1977లో అమల్లోకి తెచ్చింది ?
ఎ) కాంగ్రెస్ ప్రభుత్వం
బి) NDA ప్రభుత్వం
సి) జనతా ప్రభుత్వం
డి) దేవెగౌడ ఫ్రంట్

2) గ్రామీణ ప్రాంతాల దోపిడీని గురించి గాంధీజీ ఏ పత్రికలో వివరించారు ?
ఎ) హరిజన్
బి) ఇండియన్ ఒపీనియన్
సి) యంగ్ ఇండియా
డి) గ్రామ స్వరాజ్యం

3) అభివృద్ధి నిరోధకాల్లో దేశీయ నిరోధకాలు ఏవి ?
1) మార్కెట్ అసంపూర్ణత
2) రాజకీయ అసమతౌల్యం
3) అల్ప ప్రాథమిక వస్తు ఎగుమతులు
4) పేదరిక విషవలయాలు
ఎ) 1,2,3
బి) 1,2
సి) 1,2,3,4
డి) 2,3,4

4) 60శాతం వ్యవసాయ రంగంపై ఆధారపడ్డ జనాభా కలిగిన దేశాలు ఆర్థికంగా వెనుకబడిన దేశాలు అని నిర్వచనం ఇచ్చినది ఎవరు ?
ఎ) ప్రణాళికా సంఘం
బి) బ్రిట్ లాండ్ కమిషన్
సి) గున్నార్ మిర్దాల్
డి) దేవిడ్ మోరిస్

5) రాజ్యాంగంలోని రిపబ్లిక్ అనే పదాన్ని ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు ?
ఎ) అమెరికా
బి) ఫ్రెంచి
సి) రష్యా
డి) జర్మనీ

6) రాజ్యాంగ ప్రవేశిక అనేది ?
ఎ) తప్పనిసరిగా పాటించేది
బి) సూచనాత్మకం
సి) విషయ సూచిక మాత్రమే
డి) పైవేవీ కాదు

7) అతి తక్కువ అధికరణలు, అతి ఎక్కువ అధికరణలు ఉన్న దేశాలేవి ?
ఎ) బ్రిటన్, భారత్
బి) దక్షిణ ఆఫ్రికా, కెనడా
సి) అమెరికా, భారత్
డి) ఆస్ట్రేలియా, భారత్

8) రిపబ్లిక్ అనే పదానికి అర్థమేంటి
ఎ) ఎన్నుకోబడిన రాష్ట్రపతి
బి) రాష్ట్రపతి అభీష్టం ఉన్నంత వరకూ పదవిలో ఉంటారు
సి) ప్రధాని, మంత్రులు పార్లమెంట్ కు జవాబుదారీతనం
డి) భారత ప్రజలకు సార్వభౌమాధికారం

9) 42 వ రాజ్యాంగ సవరణ చట్టంతో ప్రవేశికలో చేర్చిన పదం/పదాలు ఏవి ?
1) సార్వభౌమ 2) సామ్యవాద
3) లౌకిక 4) సమగ్రత
ఎ) 1,2,3
బి) 2,3,4
సి) 1,2
డి) పైవన్నీ

10) రాజ్యాంగ పరిషత్ కు ఎన్నికలు ఎప్పుడు జరిగాయి ?
ఎ) 1947 జులై
బి) 1946 జులై
సి) 1945 జులై
డి) 1944 జులై

11) భారత రాజ్యాంగ రచనకు పట్టిన కాలం ?
ఎ) 2 సం.11నె.18 రోజులు
బి) 3 సం.10నె. 11 రోజులు
సి) 2 సం. 11 నెల 11 రోజులు
డి) 3 సం.11నె.18 రోజులు

12) భారత రాజ్యాంగంపై మొదటగా గ్రంథాన్ని రాసినది ఎవరు ?
ఎ) రాజాజీ
బి) బీఆర్ అంబేద్కర్
సి) హెచ్.ఎమ్ శీర్వామ్
డి) దుర్గాదాస్ బసు

13) రాజ్యాంగ పరిషత్ లో ప్రముఖ మహిళలు : వారి పదవులు. ఏది తప్పు ?
1) మొదటి మహిళా గవర్నర్ - సరోజినీ నాయుడు
2) విజయలక్ష్మి పండిట్ - UNO సాధారణ సభకు అధ్యక్షురాలు
3) దుర్గాభాయ్ దేశ్ ముఖ్ - ఆంధ్రప్రదేశ్ తరపున రాజ్యాంగపరిషత్ లో ప్రాతినిధ్యం
4) హంసా మెహతా - రాజ్యాంగ పరిషత్ లో మహిళల తరపున ప్రాతినిధ్యం
ఎ) 1, 2 మాత్రమే
బి) 1,2,3 ఒప్పు 4 తప్పు
సి) 1,2 తప్పు 3,4 ఒప్పు
డి) 1,2,3,4 ఒప్పు

14) 1928లో బాంబేలో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో రాజ్యాంగ రచనకు ఎవరి అధ్యక్షతన కమిటీ వేశారు ?
ఎ) మహాత్మా గాంధీ
బి) దాదాబాయి నౌరోజీ
సి) మోతీలాల్ నెహ్రూ
డి) జవహర్ లాల్ నెహ్రూ

15) ప్రపంచంలో మొదటిసారిగా పరోక్ష ప్రజాస్వామ్యం ఏ దేశంలో ఆవిర్భవించింది ?
ఎ) అమెరికా
బి) ఫ్రాన్స్
సి) రష్యా
డి) బ్రిటన్

16) ది టర్బులెంట్ ఇయర్స్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు ?
ఎ) అబ్దుల్ కలామ్
బి) ప్రణబ్ ముఖర్జీ
సి) హమీద్ అన్సారీ
డి) జాకీర్ హుస్సేన్

17) భారత రాష్ట్రపతి ఎన్నికను ఎవరు నిర్వహిస్తారు ?
ఎ) కేంద్ర ప్రభుత్వం
బి) పార్లమెంటు సెక్రటరియేట్
సి) రాష్ట్రపతి భవన్ అధికారులు
డి) ఎన్నికల సంఘం

18) ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా రాష్ట్రపతిగా ఎన్నికైన వ్యక్తి ఎవరు ?
ఎ) అబ్దుల్ కలాం
బి) వి.వి. గిరి
సి) ఆర్. వెంకట్రామన్
డి) శంకర్ దయాళ్ శర్మ

19) రాష్ట్రపతి జారీ చేసే ఆర్డినెన్స్ ఎన్ని రోజులు అమల్లో ఉంటుంది ?
ఎ) 200 రోజులు
బి) 222 రోజులు
సి) 90 రోజులు
డి) 180 రోజులు

20) రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత చేర్చబడిన అంశాలు ఏవి ?
ఎ) సహకార సంస్థలు
బి) ప్రాథమిక విధులు
సి) ట్రిబ్యునల్
డి) పైవన్ని

21) జాతీయ మైనారిటీ కమీషన్ ఎవరి చర్య వల్ల ఏర్పాటైంది ?
ఎ) పార్లమెంట్
బి) మైనారిటీలు జాతీయ కమీషన్
సి) కేంద్ర ప్రభుత్వం
డి) రాష్ట్ర ప్రభుత్వం

22) షెడ్యూల్డ్ కులాలను నిర్థారించే అధికారం ఎవరికి గలదు ?
ఎ) సుప్రీంకోర్టు
బి) షెడ్యూల్డ్ కులాల, తెగల కమీషన్
సి) రాష్ట్రపతి
డి) ప్రధానమంత్రి

23) సమాచార హక్కు చట్టం ఏ సంవత్సరంలో రూపొందించారు ?
ఎ) 2002
బి) 2001
సి) 2005
డి) 2000

24) లోక్ సభలో ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను రాష్ట్రపతి ఏ ప్రకరణ కింద నామినేట్ చేస్తారు ?
ఎ) ప్రకరణ 331
బి) ప్రకరణ 333
సి) ప్రకరణ 330
డి) ప్రకరణ 332

25) మండల కమిషన్ నివేదికను అమలులోకి తీసుకువచ్చిన ప్రభుత్వం ఏది ?
ఎ) పి.వి. నరసింహ రావు
బి) రాజీవ్ గాంధీ
సి) రామానందన్ ప్రసాద్
డి) వి.పి. సింగ్

26) మొదటి బి.సి. కమీషన్ 1953 సం.లో ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది ?
ఎ) వెంకటాచలయ్య
బి) కాకా సాహెబ్ కాలేకర్
సి) బల్వంత రాయ్ మెహతా
డి) ఎవరూ కాదు

27) కేంద్ర ప్రభుత్వంచే గవర్నర్ నియామకాన్ని ఏమంటారు ?
ఎ) పరిపూర్ణ ప్రజాస్వామ్యం
బి) విశిష్ట సమాఖ్య విధానం
సి) నికరమైన సమాఖ్య
డి) రిపబ్లికనిజం

28) భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత ఏర్పాటైన తొలి రాష్ట్రం ఏది ?
ఎ) ఆంధ్ర రాష్ట్రం
బి) హర్యానా
సి) కేరళ
డి) ఆంధ్రప్రదేశ్

29) భారత రాజ్యాంగంపై అంతిమ వ్యాఖ్యానం చేసే అధికారం ఏది ?
ఎ) పార్లమెంట్
బి) రాష్ట్రపతి
సి) సుప్రీం కోర్టు
డి) లోక్ సభ స్పీకర్

30) ప్రవేశికలో పేర్కొన్న Solemn Resolution (పవిత్ర తీర్మానం) ఎవరి పేరున రాశారు ?
ఎ) భారత ప్రజలు
బి) భారత రాజ్యాంగం
సి) భారత రాజ్యాంగ పరిషత్
డి) పైవేవీ కాదు

31) అడ్వకేట్ జనరల్ ను ఎవరు నియమిస్తారు ?
ఎ) ముఖ్యమంత్రి
బి) రాష్ట్రపతి
సి) ప్రధాన మంత్రి
డి) గవర్నర్

32) ప్రస్తుతము ఉన్న ప్రాథమిక విధులు ఎన్ని ?
ఎ) 9
బి) 11
సి) 8
డి) 10

33) పంచాయితీ రాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టని రాష్ట్రం ఏది ?
ఎ) నాగాలాండ్
బి) కేరళ
సి) అస్సాం
డి) ఏవీకావు

34) మొదటిసారిగా భారతదేశంలో పంచాయితీ రాజ్ ప్రవేశపెట్టాలని సూచించిన కమిటీ ఏది ?
ఎ) విఠల్ కమిటీ
బి) జి.వి.కె. రావు కమిటీ
సి) బల్వంతరాయ్ మెహతా కమిటీ
డి) అశోక్ మెహతా కమిటీ

35) భారతదేశంలో మొదటి మునిసిపల్ కార్పోరేషన్ ఏ నగరంలో ఏర్పాటు చేశారు ?
ఎ) ఢిల్లీ
బి) మద్రాసు
సి) కోల్ కత్తా
డి) బొంబాయి

36) ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అశోక్ మెహతా కమిటీని ఏర్పాటు చేశారు ?
ఎ) వి.పి. సింగ్
బి) జవాహర్ లాల్ నెహ్రు
సి) ఇందిరాగాంధీ
డి) మొరార్జీ దేశాయ్

37) రాష్ట్రపతి ప్రసంగాన్ని ఎవరు తయారు చేస్తారు ?
ఎ) కేంద్ర క్యాబినెట్
బి) అటార్ని జనరల్
సి) కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్
డి) రాష్ట్రపతి కార్యదర్శి

38) జోనల్ కౌన్సిల్స్ కు ఉమ్మడి  అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరిస్తారు ?
ఎ) రాష్ట్రపతి
బి) కేంద్ర హెూం మంత్రి
సి) ఉపరాష్ట్రపతి
డి) ప్రధానమంత్రి

39) మొట్టమొదటి సారిగా భారతదేశంలో సమాఖ్య ఎప్పుడు ప్రవేశపెట్టారు ?
ఎ) 1947
బి) 1946
సి) 1950
డి) 1935

40) కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు దేనిపై ఆధారపడతాయి ?
1) సాంప్రదాయాలు, వాడుకలు
2) న్యాయస్థానాల వ్యాఖ్యానాలు
3) సంప్రదింపులు, చర్చలు
4) రాజ్యాంగ ప్రకరణలు
ఎ) 1,2,3,4
బి) 1,2,3
సి) 3,4
డి) 1,3,4

41) ఏ రాష్ట్రం మొదటిసారిగా పార్టీ ఫిరాయింపుల వ్యతిరేక చట్టం 1979లో రూపొందించింది ?
ఎ) కేరళ
బి) ఆంధ్రప్రదేశ్
సి) పశ్చిమ బెంగాల్
డి) కర్నాటక

42) ప్రస్తుత కేంద్ర సమాచార కమీషన్ ముఖ్య కమీషనర్ ఎవరు ?
ఎ) సుష్మా సింగ్
బి) దీపక్ సంధూ
సి) రాజీవ్ మాథుర్
డి) సత్యానంద మిశ్రా

43) మొదటి పరిపాలనా సంస్కరణల సంఘం ఏ వ్యవస్థను రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయాలని సూచించింది ?
ఎ) లోకాయుక్త
బి) అంబుడ్స్ మన్
సి) పౌర క్లేశ నివారణ సంఘం
డి) లోక్ పాల్

44) పౌరసత్వం అనే భావనను ఎక్కడ నుండి గ్రహించారు ?
ఎ) ఫ్రాన్స్
బి) ఆస్ట్రేలియా
సి) గ్రీస్
డి) బ్రిటన్

45) ఫెడరల్ కోర్టును మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన సంవత్సరం ఏది ?
ఎ) 1950
బి) 1935
సి) 1947
డి) 1948

46) భాగస్వా్మ్య ప్రజాస్వామ్యాన్ని గురించి ఎవరు పేర్కొన్నారు ?
ఎ) గాంధీజీ
బి) జయప్రకాశ్ నారాయణ్
సి) ఎం.ఎన్.రాయ్
డి) ఎవరూ కాదు

47) ప్రాధమిక విధులకు సంబంధించి రాజ్యాంగ సవరణ కానిది ఏది ?
ఎ) 44వ రాజ్యాంగ సవరణ
బి) 42వ రాజ్యాంగ సవరణ
సి) 86వ రాజ్యాంగ సవరణ
డి) పైవేవి కావు

48) కేంద్ర ప్రభుత్వం అన్ని కార్య నిర్వాహక సంబంధ ఒప్పందాలు ఎవరి పేరు మీర జరుగుతాయి ?
ఎ) పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ బ్యూరో
బి) ప్రధానమంత్రి
సి) క్యాబినెట్
డి) రాష్ట్రపతి

49) మొట్టమొదటి ఆర్థిక సంఘం అధ్యక్షులు ఎవరు ?
ఎ) కె.బ్రహ్మనంద రెడ్డి
బి) యన్.కె.పి.సాల్వే
సి) కె.సి.నియోగి
డి) కె.సంతానం

50) ఆదేశిక సూత్రాల ముఖ్య ఉద్దేశం ఏది ?
ఎ) ఆర్థిక పురోభివృద్ధి
బి) సంక్షేమ రాజ్యస్థాపన
సి) నిరుద్యోగ నిర్మూలన
డి) పారిశ్రామికీకరణ