DPT-37- భారత, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ (ANS)

1) నవ్యగాంధీ నమూనాను ప్రతిపాదించినది ఎవరు.?ఎ
ఎ)అబ్దుల్ కలాం
బి)మన్మోహన్ సింగ్
సి)పి.వి.నరసింహారావు
డి)వి.పి.సింగ్

2)రంగరాజన్ కమిటీ ప్రకారం గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో రోజువారీ వినియోగ ఖర్చును ఎన్ని రూపాయిలుగా నిర్ణయించారు?డి
ఎ)34,35
బి)37,47
సి)32,42
డి)32,47

3)తక్కువ అభివృద్ది చెందిన దేశాల్లో ఆర్దికాభివృద్దికి ముఖ్యమైన నిరోధకం ఏది?ఎ
ఎ)మూలధనకొరత
బి)నిరక్షరాస్యత
సి)మానవ వనరుల కొరత
డి)తక్కువ స్దాయి సాంకేతిక పరిజ్నానం

4)భారతదేశంలో ప్రాధమికరంగం సమకూర్చే జాతీయ ఆదాయాన్ని అంచనా వేసే పద్దతి ఏది?సి
ఎ)ఆదాయాల మదింపు పద్దతి
బి)వ్యయాల మదింపు పద్దతి
సి)విలువ కూర్పు పద్దతి
డి)పైవేవీకావు

5)వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి ఎవర్ గ్రీన్ రివల్యూషన్ చేపట్టాలని పిలుపునిచ్చినది ఎవరు?ఎ
ఎ)ఎం.ఎస్.స్వామినాధన్
బి) అరుంధతీరాయ్
సి) కె.ఎస్ స్వామినాధన్
డి) ఏపీజె అబ్దుల్ కలామ్

6)గాజుతెర ఆర్దికవ్యవస్ద గురించి వివరించిన ఆర్దికవేత్త ఎవరు?బి
ఎ)స్టెయిన్
బి)మిర్ధాల్
సి)హార్వే
డి)వీరెవరూ కాదు

7)జాతీయజనాభా సంఘం సాంకేతిక కమిటి 2026 నాటికి భారతదేశ జనాభా ఎంతకు చేరుకుంటుందని అంచనా వేసింది?ఎ
ఎ)140కోట్లు
బి)150కోట్లు
సి)160 కోట్లు
డి)145 కోట్లు

8)మద్రాస్ లో తొలి సిమెంట్ పరిశ్రమను స్దాపంచిన సంవత్సరం ఏది?బి
ఎ)1901
బి)1904
సి)1906
డి)1908

9)రిజర్వ్ బ్యాంక్ ఏ సంవత్సరాన్ని ప్లాటినమ్ జూబ్లీ సంవత్సరంగా పరిగణించింది?డి
ఎ)2000-01
బి)2004-05
సి)2008-09
డి)2009-10

10) చిన్నతరహా పరిశ్రమల పరపతి సమస్యలను పరిశీలించేందుకు 1997లో ఏర్పాటైన కమిటీ ఏది ? ఎ
ఎ) ఎస్ ఎల్ కపూర్
బి) నర్సింహం కమిటీ
సి) రంగరాజన్ కమిటీ
డి) జె.జె.ఇరానీ కమిటీ

11) ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణకు సిఫార్సు చేసిన కమిటీ ఏది ?బి
ఎ) రంగరాజన్ కమిటీ
బి) నరసింహం కమిటీ
సి) మల్హోత్రా కమిటీ
డి) ఎస్ ఎల్ కపూర్ కమిటీ

12) 17 అంతర్జాతీయ లక్ష్యాలను పరిశీలించిన తర్వాత సుస్థిర అభివృద్ధిలో భారత్ కు ఏ స్థానం కేటాయించారు ? ఎ
ఎ) 116
బి) 139
సి) 117
డి) 121

13) ఎయిరిండియాలో వాటాల విక్రయానికి సంబంధించి ఈ కింది వాటిలో ఏది కరెక్ట్ ? సి
1) ఎయిరిండియాలో ప్రభుత్వ వాటాల విక్రయానికి 2017 జూన్ 28న కేంద్రం అంగీకరించింది
2) ఎయిరిండియా రూ.52 వేల కోట్ల రుణభారాన్ని మోస్తోంది
3) 2012లో యూపీఏ సర్కార్ 30 వేల కోట్లతో బెయిలవుట్ ప్యాకేజీ ఇచ్చింది
4) ఎయిరిండియాని తిరిగి టాటా సంస్థ కే అప్పగించాలని కేంద్రం నిర్ణయించింది

ఎ) 1,2,3,4 కరెక్టే
బి) 1,2 కరెక్ట్ 3,4 కాదు
సి) 1,2,3 మాత్రమే 4 కాదు
డి) 4 మాత్రమే కరెక్ట్

14) జాతీయాదాయ నిర్ధారణకు ఆధారం ఏది ? బి
ఎ) రాష్ట్రం మొత్తం ఆదాయం
బి) వస్తు సేవల ఉత్పత్తి
సి) రాష్ట్రాలచే నికర లాభార్జన
డి) పైవి ఏవీ కాదు

15) సీజన్ మారినప్పుడు డిమాండ్ కొరత వల్ల ఏర్పడే నిరుద్యోగాన్ని ఏమంటారు ?డి
ఎ) రుతు సంబంధ నిరుద్యోగం
బి) ప్రచ్చన్న నిరుద్యోగం
సి) చక్రీయ నిరుద్యోగం
డి) సంఘృష్ట నిరుద్యోగం

16) తెలంగాణ రాష్ట్ర మానవాభివృద్ధి నివేదిక - 2017కు సంబంధించి ఈ కింది వాటిలో ఏది తప్పు ? డి
ఎ) ఈ నివేదికను ఆర్థిక, సామాజిక శాస్త్రాల అధ్యయనం కేంద్రం (సెస్) రూపొందించింది
బి) మానవాభివృద్ధి సూచీలో 2004-05లో తెలంగాణ 13 వ స్థానంలో ఉంది
సి) మానవాభివృద్ధి సూచికలో 2011-12 ప్రకారం హైదరాబాద్ మొదటి స్థానంలో ఉంది
డి) మానవాభివృద్ధి సూచికలో 2004-05 ప్రకారం రంగారెడ్డి మొదటి స్థానంలో ఉంది

17) తెలంగాణ సామాజికాభివృద్ధి నివేదిక - 2017 ప్రకారం ఈ కింది వాటిలో ఏది కరెక్ట్ ? సి
1) రాష్ట్ర జనాభాలో గత పదేళ్ళలో వృద్ధుల సంఖ్య 7.4 నుంచి 9.3శాతానికి పెరిగింది
2) తెలంగాణ జనాభాలో 61శాతం మంది ఇప్పటికీ పల్లెల్లోనే నివసిస్తున్నారు
3) రాష్ట్రంలో 26 వ వంతు కుటుంబాలకు కంప్యూటర్లు ఉన్నాయి
4) తెలంగాణలో దాదాపు 96శాతం మంది యువతకు సాంకేతిక విద్య లభించడం లేదు

18) 2017-18లో భారత్ వృద్ధి రేటు ఎంతగా ఉంటుందని IMF అంచనా వేసింది ? ఎ
ఎ) 7.2శాతం
బి) 7.5 శాతం
సి) 7.4 శాతం
డి) 7.1 శాతం

19) పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐపీపీ), టోకు ధరల సూచీ (WPI)కి సంబంధించిన బేస్ ఇయర్ ఇంతకుముందు 2004-05గా ఉండేది. ఇప్పుడు ఏ సంవత్సరాన్ని ఆధారంగా తీసుకుంటున్నారు ?B
ఎ) 2010-11
బి) 2011-12
సి) 2015-16
డి) 2017-18

20) 100 రోజుల్లో దేశవ్యాప్తంగా 100 గ్రామాలను డిజిటల్ గా తీర్చిదిద్దే ప్రాజెక్టును చేపట్టిన ప్రైవేటు రంగ బ్యాంకు ఏది ? ఎ
ఎ) ఐసీఐసీఐ
బి) HDFC
సి) SBI
డి) కొటక్ బ్యాంక్

21) వ్యాపారుల కోసం ప్రత్యేకంగా చెల్లింపుల యాప్ ను ICICI తీసుకొచ్చింది. దాని పేరేంటి ?బి
ఎ) బడ్డీ
బి) ఈజీపే
సి) పేటీఎం
డి) ఏదీ కాదు

22) నగదు రూప లావాదేవీలు తగ్గించి, డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ఎవరి అధ్యక్షతన డిజిటల్ చెల్లింపుల కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది ?బి
ఎ) ఏపీ సీఎం చంద్రబాబునాయుడు
బి) రతన్ పి.వాటల్
సి) సి.రంగరాజన్ కమిటీ
డి) బి.పి.ఆర్ విఠల్ కమిటీ

23) తెలంగాణ రాష్ట్రం చేపట్టిన మిషన్ భగీరథ పనులను ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో చేపట్టేందుకు రూ.80కోట్లు రుణం ఇచ్చేందుకు ఏ బ్యాంక్ ముందుకు వచ్చింది ? ఎ
ఎ) ప్రపంచబ్యాంకు
బి) ఐఎంఎఫ్
సి) ఆసియా అభివృద్ధి బ్యాంకు
డి) ఏదీ కాదు

24) న్యూ వరల్డ్ వెల్త్ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచంలోని పది సంపన్న దేశాల్లో భారత్ కి ఎన్నో స్థానం ? ఎ
ఎ) 6వస్థానం
బి) 5వ స్థానం
సి) 4 వ స్థానం
డి) 8వ స్థానం

25) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనమైన బ్యాంకుల్లో లేనిది ఏది ? ఎ
ఎ) భారతీయ మహిళా బ్యాంక్
బి) స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్
సి) స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా
డి) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్ కోర్

26) పన్నుల చెల్లింపులు, పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోడానికి ఐటీ శాఖ ఇటీవల తెచ్చిన మొబైల్ యాప్ ఏది ?బి
ఎ) ఆయ్ కార్ ఐటీ
బి) ఆయ్ కార్ సేతు
సి) భీమ్ యాప్
డి) ఏదీ కాదు

27) జీఎస్టీకి సంబంధించి ఈ కిందివాటిలో తప్పుగా పేర్కొన్నది ఏది ? డి
ఎ) జీఎస్టీకి ప్రధాన రూపకర్తగా అసిమ్ దాస్ గుప్తా అని వ్యవహరిస్తారు
బి) జీఎస్టీ అమల్లోకి వచ్చాక కేంద్రంలో రద్దయిన పన్నులు కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ, సేవా పన్ను
సి) జీఎస్టీ అమల్లోకి వచ్చాక రాష్ట్రంలో రద్దయిన పన్నులు రాష్ట్ర వ్యాట్, ప్రవేశపన్ను, ప్రకటనలపై పన్ను
డి) అన్నీ ఖచ్చితమే

28) చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థలకు క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా సేవలు అందించేందుకు బెంగళూరులో డిజిటల్ హబ్ ప్రారంభించిన ప్రముఖ సంస్థ ఏది ? ఎ
ఎ) ఒరాకిల్
బి) ఐబీఎం
సి) మైక్రో సాఫ్ట్
డి) గూగుల్

29) కనీస అవసరాలను లెక్కించేందుకు ఆరు అంశాలు ఉండాలని చెప్పింది ఎవరు ? సి
ఎ) అంతర్జాతీయ ద్రవ్యనిధి
బి) ప్రపంచ బ్యాంకు
సి) అంతర్జాతీయ శ్రామిక సంస్థ
డి) ప్రణాళికా సంఘం

30) రాష్ట్ర విభజన నేపథ్యంలో రిజిష్టర్ అయిన మొదటి కంపెనీ ఏది ?బి
ఎ) ఏపీ జెన్ కో
బి) తెలంగాణ జెన్ కో
సి) తెలంగాణ ఆర్టీసీ
డి) తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ

31) తెలంగాణ పల్లె ప్రగతి పథకాన్ని ఏ బ్యాంక్ సాయంతో రాష్ట్రంలో అమలు చేస్తున్నారు ?బి
ఎ) నాబార్డ్
బి) ప్రపంచ బ్యాంక్
సి) ఐఎంఎఫ్
డి) ఆర్బీఐ

32) అధికంగా రుణాలు ఇచ్చిన బ్యాంకులు కలిగిన జిల్లా ఏది ?డి
ఎ) వరంగల్
బి) రంగారెడ్డి
సి) నల్లగొండ
డి) హైదరాబాద్

33) సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన పథకం ఎప్పుడు ప్రారంభమైంది ?బి
ఎ) 2 అక్టోబర్ 2014
బి) 11 అక్టోబర్ 2014
సి) 11 అక్టోబర్ 2015
డి) 2 అక్టోబర్ 2015

34) మానవాభివృద్ది సూచికలో లేని అంశం ఏది ?బి
ఎ) తలసరి ఆదాయం
బి) జాతీయాదాయం
సి) అక్షరాస్యత రేటు
డి) వ్యక్తి సరాసరి వయసు

35) ఏపద్దతిలో జాతీయాదాయాన్ని లెక్కించే పద్దతి ప్రస్తుతం వాడుకలో లేదు ? సి
ఎ) ఆదాయాల మదింపు పద్దతి
బి) ఉత్పత్తి మదింపు పద్దతి
సి) వ్యయాల మదింపు పద్దతి
డి) ఏదీ కాదు

36) గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ అమలు పథకం మొదటిసారి ఎక్కడ ప్రారంభించారు ? ఎ
ఎ) మహారాష్ట్ర
బి) ఆంధ్రప్రదేశ్
సి) గుజరాత్
డి) మధ్యప్రదేశ్

37) లారెంట్ వక్రరేఖ దేనిని కొలుస్తుంది ? డి
ఎ) పేదరికం
బి) నిరుద్యోగిత
సి) ఆహార పంపిణీ
డి) ఆదాయ పంపిణీ

39) సిద్ధాంతాలు - వాటిని ప్రతిపాదించిన వారిలో తప్పుగా పేర్కొన్న దాన్ని గుర్తించండి ? సి
ఎ) బిగ్ పుష్ సిద్దాంతం - రోడాన్
బి) బాటక సిద్ధాం - రికార్డో
సి) జనాభా సిద్ధాంతం - కార్ల్ మార్క్స్
డి) మానవాభివృద్ధి సూచి - మహబూబ్ ఉల్ హక్

40) ప్రణాళికా సంఘం, నీతి ఆయోగ్ కి సంభందించి కింది వాటిలో ఏది తప్పు ?డి
ఎ) భారత పంచవర్ష ప్రణాళికలకు మార్గదర్శి : రష్యా
బి) ప్లాన్డ్ ఎకానమీ ఆఫ్ ఇండియా గ్రంథంలో మెక్షగుండం విశ్వేశ్వరయ్య భారత్ కు 10 యేళ్ళ ప్రణాళికలను రూపొందించారు
సి) నీతి ఆయోగ్ ను 2015 జనవరి 1న ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసింది
డి) ప్రణాళిక సంఘం మొదటి ఉపాధ్యక్షుడు జవహర్ లాల్ నెహ్రూ

41) నీరాంచల్ పథకం ఏ రంగ అభివృద్ధికి ఉద్దేశించినది ? సి
ఎ) ఎరువులు
బి) తోటలు
సి) వాటర్ షెడ్
డి) వ్యవసాయం

42) ఆర్థికాభివృద్ధి దేన్ని తెలుపుతుంది ? డి
ఎ) ఉత్పత్తి పెరుగుదల
బి) సాంకేతిక మార్పులు
సి) దేశ వ్యవస్థాపూర్వక మార్పుల గురించి
డి) పైవన్నీ

43) భారత దేశంలో స్థూల దేశీయ పొదుపులో ఏ రంగంలో వాటా ఎక్కువగా ఉంది ?డి
ఎ) ప్రభుత్వ రంగం
బి) ప్రవేటు రంగం
సి) ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం
డి) కుటుంబ రంగం

44) రష్యా సహకారంతో ఛత్తీస్ గఢ్ లో నిర్మించిన ఇనుము - ఉక్కు కర్మాగారం ఏది ? ఎ
ఎ) భిలాయ్
బి) దుర్గాపూర్
సి) జంషెడ్ పూర్
డి) రూర్కెలా

45) ఆర్థిక ప్రణాళిక అనే పదాన్ని ఏ దేశం నుంచి భారత్ గ్రహించింది ? ఎ
ఎ) రష్యా
బి) జపాన్
సి) అమెరికా
డి) బ్రిటన్

46) నీలి విప్లవం ఎన్నో పంచవర్ష ప్రణాళికా కాలంలో ప్రారంభమైంది ?బి
ఎ) 7వ
బి) 6వ
సి) 5వ
డి) 4వ

47) ఏ ప్లాన్ ఫర్ ఎకనామిక్ డెవలప్ మెంట్ ఫర్ ఇండియా పేరుతో రూపొందించిన ప్రణాళిక ఏది ?
ఎ) గాంధీ ప్లాన్
బి) బాంబే ప్లాన్
సి) సర్వోదయ ప్రణాళిక
డి) ఏదీ కాదు

48) ఎన్నో ప్రణాళికా కాలంలో భారత్ టే కాఫ్ లోకి ప్రవేశించిందని అనుకున్నారు ? ఎ
ఎ) 2వ
బి) మొదటి
సి) 3 వ
డి) 4 వ

49) ఎన్నో పంచవర్ష ప్రణాళికా కాలంలో పుర నమూనాను అనుసరించారు ? ఎ
ఎ) 9వ
బి) 8 వ
సి) 4వ
డి) 10వ

50) ప్రస్తుత కేంద్ర ఆర్థిక మంత్రి ఎవరు ? సి
ఎ) చిదంబరం
బి) ఈటల రాజేందర్
సి) అరుణ్ జైట్లీ
డి) సుష్మా