DPT-15- INDIAN CONSTITUTION ( PREAMBLE)

1) భారత రాజ్యాంగానికి ఇది మూలమని చెబుతారు ?
ఎ) భారత ప్రభుత్వ చట్టం 1935
బి) ప్రవేశిక
సి) ప్రాథమిక హక్కులు
డి) లిఖిత రాజ్యాంగం

2) భారత్ లో రాజ్యాధికారానికి మూలం ఏది ?
ఎ) ప్రజలు
బి) రాజ్యాంగం
సి) పార్లమెంట్
డి) ప్రవేశిక

3) రాజ్యాంగ ప్రవేశికను ఏ విప్లవం ఆధారంగా తీసుకున్నారు ?
ఎ) ఫ్రెంచి
బి) రష్యా
సి) అమెరికా
డి) పైవేవీ కాదు

4) స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేవి ఏ విప్లవం నుంచి గ్రహించారు ?
ఎ) అమెరికా
బి) రష్యా
సి) బ్రిటన్
డి) ఫ్రెంచి

5) భారత రాజ్యాంగ పీఠికలో ఉన్న పదాలేంటి ?
ఎ) సార్వభౌమాధికార, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామిక, గణతంత్ర రాజ్యం
బి) సార్వ భౌమాధికార, ప్రజాస్వామిక, సామ్యవాదం
సి) సార్వ భౌమాధికార, సామ్యవాద, లౌకిక రాజ్యం
డి) సార్వభౌమాధికార, సామ్యవాద, లౌకిక ప్రజాస్వామిక రాజ్యం

6) రాజ్యాంగంలోని రిపబ్లిక్ అనే పదాన్ని ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు ?
ఎ) అమెరికా
బి) ఫ్రెంచి
సి) రష్యా
డి) జర్మనీ

7) 1973లో రాజ్యాంగంలో ప్రవేశిక అంతర్భాగమని ఏ కేసులో సుప్రీంకోర్టు పేర్కొంది ?
ఎ) బెరుబారి
బి) గోలక్ నాథ్ కేసు
సి) కేశవానంద భారతి
డి) పైవేవీ కాదు

8) ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ అధికారాలపై నియంత్రణ చేయడం, పరిమితి విధించడాన్ని చేసేది ఏది ?
ఎ) ప్రజలు
బి) పత్రికలు
సి) పార్లమెంట్
డి) రాజ్యాంగం

9) రాజ్యాంగ ప్రవేశిక అనేది ?
ఎ) తప్పనిసరిగా పాటించేది
బి) సూచనాత్మకం
సి) విషయ సూచిక మాత్రమే
డి) పైవేవీ కాదు

10) ప్రవేశికలో పేర్కొన్న Solemn Resolution (పవిత్ర తీర్మానం) ఎవరి పేరున రాశారు ?
ఎ) భారత ప్రజలు
బి) భారత రాజ్యాంగం
సి) భారత రాజ్యాంగ పరిషత్
డి) పైవేవీ కాదు

11) ప్రవేశిక అనేది రాజ్యాంగానికి ఒక గుర్తింపు పత్రం వంటిది అన్నదెవరు ?
ఎ) పాలీ నారీమన్
బి) డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్
సి) నానీ ఫాల్కీవాలా
డి) ఎర్నెస్ట్ బార్కర్

12) 42 వ రాజ్యాంగ సవరణ చట్టంతో ప్రవేశికలో చేర్చిన పదం/పదాలు ఏవి ?
1) సార్వభౌమ 2) సామ్యవాద
3) లౌకిక 4) సమగ్రత
ఎ) 1,2,3
బి) 2,3,4
సి) 1,2
డి) పైవన్నీ

13) సమగ్రత అనే పదాన్ని ప్రవేశికలో ఎందుకు చేర్చారు ?
ఎ) ప్రవేశికలో ముందే ఉంది
బి) వేర్పాటువాద ఉద్యమాలే
సి) సుప్రీంకోర్టు తీర్పులతో
డి) బి మరియు సి

14) రాజ్యాంగ ప్రవేశికను ఇప్పటి వరకూ ఎన్నిసార్లు సవరించారు ?
ఎ) ఒకసారి
బి) రెండు సార్లు
సి) మూడు సార్లు
డి) అసలు మార్చలేదు

15) రిపబ్లిక్ అనే పదానికి అర్థమేంటి
ఎ) ఎన్నుకోబడిన రాష్ట్రపతి
బి) రాష్ట్రపతి అభీష్టం ఉన్నంత వరకూ పదవిలో ఉంటారు
సి) ప్రధాని, మంత్రులు పార్లమెంట్ కు జవాబుదారీతనం
డి) భారత ప్రజలకు సార్వభౌమాధికారం

16) ప్రభుత్వం అనేక పరిశ్రమలను స్థాపించడం దేని కిందకి వస్తుంది ?
ఎ) లౌకిక రాజ్యం
బి) సామ్యవాదం
సి) ప్రజాస్వామ్యం
డి) సార్వభౌమాధికారి

17) ప్రపంచంలో మొదటిసారిగా పరోక్ష ప్రజాస్వామ్యం ఏ దేశంలో ఆవిర్భవించింది ?
ఎ) అమెరికా
బి) ఫ్రాన్స్
సి) రష్యా
డి) బ్రిటన్

18) పరిపాలనలో పౌరులంతా ప్రత్యక్షంగా పాల్గొనడాన్ని ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటారు. ఇది ఏ దేశాల్లో అమల్లో ఉంది ?
ఎ) నార్వే
బి) గ్రీస్ లాండ్
సి) స్విట్జర్లాండ్
డి) ఎక్కడా లేదు

19) అతి తక్కువ అధికరణలు, అతి ఎక్కువ అధికరణలు ఉన్న దేశాలేవి ?
ఎ) బ్రిటన్, భారత్
బి) అమెరికా, భారత్
సి) దక్షిణ ఆఫ్రికా, కెనడా
డి) ఆస్ట్రేలియా, భారత్

20) భారత రాజ్యాంగం సాధారణ సమయాల్లో సమాఖ్య లక్షణాలు, అసాధరణ, అత్యవసర సమయాల్లో ఏక కేంద్ర లక్షణాలను కలిగి ఉంటుందని అన్నది ఎవరు ?
ఎ) బి.ఆర్ అంబేద్కర్
బి) బాబూ రాజేంద్ర ప్రసాద్
సి) కె.సి.వేర్
డి) జవహర్ లాల్ నెహ్రూ