అంతర్జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థలు

1) పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్:
-దీనిని అంతర్జాతీయ సునామీ హెచ్చరికల కేంద్రం అంటారు.
-దీని హెడ్డాఫీస్ అమెరికాలోని హవాయి రాష్ట్రంలోని ఇవా బీచ్ ఉంది
-2004లో హిందూ మహా సముద్రంలో వచ్చిన సునామీ తర్వాత ఈ కేంద్రం సేవలను హిందూ మహాసముద్రం, కరేబియన్ దీవుల వరకూ విస్తరించారు

2) ఇంటర్నేషనల్ సునామీ ఇన్ఫర్మేషన్ సెంటర్
- యునెస్కోకి చెందిన ఇంటర్ గవర్నమెంటల్ ఓషనోగ్రాఫిక్ కమీషన్ ఆధ్వర్యంలో ఏరాటైంది.
- ప్రధాన కార్యాలయంలో అమెరికాలోని హవాయి రాష్ట్రంలోని హొనలూలు
3) ఆసియన్ డిజాస్టర్ రిడక్షన్ సెంటర్
- ఇది 1998లో జపాన్ లోని కోబ్ నగరంలో ఏర్పాటు చేశారు

4) ప్రపంచ వాతావరణ సంస్థ
- ఇది ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ
- భూగోళ వాతావరణాన్ని పర్యవేక్షిస్తుంది.
- దీని ప్రధాన కేంద్రం స్విట్జర్లాండ్ లోని జెనీవాలో ఉంది
- మార్చి 23న ప్రపంచ వాతావరణ దినోత్సవంగా జరుపుతారు

5) సార్క్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ సెంటర్:
- 2006 అక్టోబర్ లో ఢిల్లీలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఆవరణలో ఏర్పాటు చేశారు.

6) ఇంటర్నేషనల్ స్ట్రాటజీ ఫర్ డిజాస్టర్ రిడక్షన్:
- ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో 1999 డిసెంబర్ లో ఏర్పాటు చేశారు
- ప్రధాన కార్యాలయం స్టిట్జర్లాండులోని జెనీవాలో ఉంది.

7) ఇంటర్ గవర్నమెంట్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్
- 1988లో ప్రపంచ వాతావరణ సంస్థ, ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం కలిపి ఏర్పాటు చేశాయి
- ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్ లోని జెనీవాలో ఉంది.