రాష్ట్రంలో నిర్వహిస్తున్న SI/PC రిక్రూట్ మెంట్ లో లేటెస్ట్ టెక్నాలజీని వాడుతోంది TSLPRB. శారీరక సామర్థ్య పరీక్షల నిర్వహణలో గతంలో వచ్చిన విమర్శలు మళ్ళీ రాకుండా, ఎలాంటి లోపాలు తలెత్తకుండా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈసారి అభ్యర్థుల ఎత్తును కొలిచేందుకు ‘డిజిటల్ స్టడియో మీటర్లను వాడుతోంది. గత నియామకాలప్పుడు కూడా కరీంనగర్ లో ఈ మీటర్లను వినియోగించారు. అక్కడ కరెక్ట్ రిజల్ట్స్ రావడంతో ఇప్పుడు రాష్ట్రమంతటా అన్ని సెంటర్లలోనూ ఈ సిస్టమ్ అమలు చేస్తున్నారు. అభ్యర్థుల ఎత్తును టేపుతో కొలిచే విధానంతో కొన్నిసార్లు తప్పుగా లెక్కిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. డిజిటల్ స్టడియో మీటర్లతో ఈ సమస్య ఉండదని భావిస్తున్నారు. ఈ మీటర్ తో అభ్యర్థి ఎత్తు కొలవగానే సెంట్రల్ సర్వర్ లో రికార్డ్ అవుతుంది. దీంతో టైమ్ కూడా సేవల్ అవుతుందని అంటున్నారు.

RFSID బ్యాండ్ మస్ట్

అభ్యర్థులు గ్రౌండ్ లోకి అడుగుపెట్టగానే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFSID) టెక్నాలజీ కలిగిన బ్యాండ్ ను చేతికి అమరుస్తారు. శారీర సామర్థ్య పరీక్షలు పూర్తయి బయటకు వచ్చే దాకా ఈ బ్యాండ్ తప్పనిసరిగా తమ చేతికి ఉంచుకోవాలి. ఆ బ్యాండ్ తో అభ్యర్థి ఎక్కడ ఉన్నా తెలిసిపోతుంది. ఎవరైనా కావాలని దాన్ని తొలగించినా.. చించేసినా వెంటనే తెలిసిపోతుంది. అలాంటి అభ్యర్థులను పోటీల నుంచి డిస్ క్వాలిఫై చేస్తారు. ఈ టెక్నాలజీ పరుగు పందెంలో కీలకంగా మారనుంది. రిస్ట్ బ్యాండ్ కలిగి ఉన్న అభ్యర్థి ఎప్పుడు రన్ స్టార్ట్ చేశాడు… ఎంత దూరం ప్రయాణించాడు… ఎప్పుడు పూర్తి చేశాడన్నది ఖచ్చితంగా తెలుసుకునే అవకాశం ఉంటుందని TSLPRB వర్గాలు చెబుతున్నాయి.

Telangana Exams plus యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి లింక్ ఇదే

http://on-app.in/app/home/app/home?orgCode=atvqp

Leave a Reply