
“Without learning “GRAMMAR” we can’t speak English”.
“ If we learn “ONLY GRAMMAR” also we can’t speak English”
గ్రామరు నేర్చుకోకుండా ఇంగ్లీష్ మాట్లాడలేం. అలాగని గ్రామరు మాత్రమే నేర్చుకుంటే కూడా ఇంగ్లీష్ మాట్లాడలేం.
అవును ఇది నిజం.
Parts of Speech, Kinds of Nouns, Kinds of Sentences, Articles, Simple, Compound
Complex sentences, Degrees of Comparison ఇలా నేర్చుకుంటే మనకేంటి ఉపయోగం.
అలాగని Grammar నేర్చుకోకుండా English మాట్లాడటం సాధ్యమా… కానే కాదు… మనం నేర్చుకోవాల్సింది మాట్లాడటానికి ఉపయోగపడే Grammar మాత్రమే. అదీ కూడా తప్పులు లేకుండా సుమా !
చూద్దాం ! మరి మాట్లాడటానికి ఉపయోగపడే Grammar ఏంటో ??
నిన్న, మొన్న, గత సంవత్సరం ఇలా జరిగిపోయిన విషయాలను మనం ఏ Tense లో చెబుతాం ?
“PAST TENSE”
రేపు, ఎల్లుండి, వచ్చే సంవత్సరం, పదేళ్ళ తర్వాత జరగబోయే విషయాలను ఏ Tense లో చెబుతాం ?
“FUTURE TENSE ”
మరి ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న విషయాలను ఏ Tense లో చెబుతాం ?
“PRESENT TENSE ”
సాధారణంగా మనం ఏం మాట్లాడుతూ ఉంటాం ?
నిన్న నేను సినిమాకి వెళ్ళాను.
Last year మేము Picnic వెళ్ళాము
1947 లో మనకి స్వాతంత్ర్యం వచ్చింది.
Last Month మా brother U.S.A. వెళ్లాడు.
నేను 1997 లో Inter complete చేశాను.
ఇలా “జరిగిపోయిన విషయాలను’ మాట్లాడుతూ ఉంటాం !
అంటే “PAST TENSE” ని వాడతాము.
C.M. రేపు ఢిల్లీకి వెళతారు
Next year నేను Car కొటాను.
10 years లో మేము life లో settle అవుతాము.
Next month మేము Europe tour వెళతాము.
Next World Cup లో India గెలుస్తుంది.
ఇలా ‘‘జరగబోయే విషయాలను’’ మాట్లాడుతూ ఉంటాం…
అంటే “FUTURE TENSE” ని వాడతాం
లేదా
నేను ఇప్పుడు రాస్తూ ఉన్నాను.
వారు ఇప్పుడు ఈత కొడుతూ ఉన్నారు.
Manager ఇంతకు ముందే files check చేశాడు.
Students ఉదయం నుంచి చదువుతూనే ఉన్నారు.
సుశ్రిత ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంది.
ఇలా ‘‘ ఇప్పుడు జరుగుతూ ఉన్న విషయాలను’’ మాట్లాడుతూ ఉంటాం…
అంటే ” PRESENT TENSE” ని వాడతాము.
మాట్లాడితే మనం జరిగి పోయిన విషయాలు
అవి నిన్న జరిగిన విషయాలు కావచ్చు
మొన్న జరిగినవి కావచ్చు
10 సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు కావొచ్చు.
(లేదా)
‘‘జరగబోయే విషయాలు’’
అవి రేపు జరగబోయే విషయాలు కావొచ్చు.
ఎల్లుండి జరగబోయే విషయాలు కావొచ్చు.
10 యేళ్ళ తర్వాత జరగబోయే విషయాలు కావొచ్చు.
(లేదా)
‘‘జరుగుతూ ఉన్న విషయాలు’’
ఇవి ఇప్పుడు జరుగుతూ ఉన్న విషయాలు కావొచ్చు
ఇంతకు ముందే జరిగిన విషయాలు కావొచ్చు
10యేళ్ళ నుంచి జరుగుతున్న ఉన్న విషయాలు కావొచ్చు
వీటిని మాట్లాడుతూ ఉంటాం.
అలా మనం ‘‘ జరిగి పోయిన, జరగబోయే, మరియు ప్రస్తుతం ఇప్పుడు జరుగుతూ ఉన్న’’ విషయాలను కాక ఇంకా ఏమైనా మాట్లాడతామా ?
దాదాపుగా అవకాశమే లేదు
అసలు భాషతో మనం ఏం చేస్తాం ?
వింటాం Listening
మాట్లాడతాం Speaking
చదువుతాం Reading
రాస్తాం Writing
అవి కాకుండా ఇంకేమీ చేయం.
అదే విధంగా ఏ భాషలోనైనా మనం సాధారణంగా
జరిగిపోయిన PAST TENSE
జరగబోయే FUTURE TENSE
జరుగుతూ ఉన్న PRESENT TENSE
లను మాత్రమే ఉపయోగిస్తాం. కాబట్టి మనం చక్కగా మాట్లాడాలంటే మనకు ఖచ్చితంగా Present Tense, Past Tense and Future tense లు బాగా వచ్చి ఉండాలి.
దాదాపుగా ప్రతి ఒక్కరూ మాకు Tenses తెలుసు అనుకుంటూ ఉంటారు. కానీ మామూలుగా తెలియడం వేరు. Tense మీద గట్టి పట్టు ఉండటం వేరు.
ఇక్కడ మనం ఇంకో విషయం గమనించాలి. Tenses అనగానే Present Tense, Past Tense and Future Tense అనుకుంటూ ఉంటారు. అది నిజమే అయినప్పటికీ…
రూపంలో Sentences ఉంటాయి. అంటే Active Voice, Passive voice and Be Forms నేర్చుకోవం తప్పనిసరి. అవి నేర్చుకోవడం కూడా తేలికే సుమా…
ఇక్కడ మనం ఒక పచ్చి నిజం తెలుసుకోవాలి. దాదాపుగా English లో ప్రతీ sentences ఉంటే Active Voice లోనో Passive Voice లోనో లేదా Be form లోనో ఉండాలి.
రాసేటప్పుడు కానీ, వినేటప్పుడు కానీ, చదివేటప్పుడు కానీ, మాట్లాడేటప్పుడు కానీ మనం Active Voice లోనే Passive Voice లోనో లేదా Be form లోనే రాస్తాం. వింటాం, చదువుతాం, మాట్లాడతాం. అవి కాకుండా మనం రాయడానికి, వినడానికి, చదవడానికి, మాట్లాడటానికి దాదాపుగా ఏమీ లేవనే చెప్పాలి.
ఒక్కసారి మనకు వీటి మీద స్పష్టమైన అవగాహన వచ్చినట్లయితే English కి సంబంధించిన అన్ని విషయాలను చాలా తేలికగా అర్థం చేసుకోగలుగుతారు.
మరి మనం ఇప్పుడు Tense ను అంటే Active Voice, Passive voice మరియు Be forms ను ఎలా నేర్చుకోవాలో చూద్దాం.
ఇక్కడ మనం ఇంకో విషయం తెలుసుకోవాలి. Active Voice నేర్చుకున్నాక మాత్రమే Passive voice నేర్చుకోవాలి. అవి రెండూ చక్కగా నేర్చుకున్నాక మాత్రమే Be form నేర్చుకోవాలి. అంతే కానీ Active voice లో సరైన పట్టు సాధించకుండా Passive voice నేర్చుకోడానికి ప్రయత్నం చేయకూడదు. అదే విధంగా Active voice, Passive voice లలో అవగాహన పెంచుకోకుండా Be Forms నేర్చుకోడానికి ప్రయత్నం చేయకూడదు.
A V perfection > P . V perfection > Be forms
ఇప్పుడు మనం Active Voice ఎలా నేర్చుకోవాలో చూద్దాం ! ఈ క్రింద ఇచ్చిన Active voice Structure ను జాగ్రత్తగా గమనించండి. ఆ Structure ను ఉపయోగించుకొని Home work చేయాల్సి ఉంటుంది. ప్రతి రోజూ 4 Examples ను Home Work చేయాల్సి ఉంటుంది.
TENSES CONCEPTS / FUNCTIONS
THERE ARE THREE TENSES
1. Present Tense – I
2. Past Tense – II
3. Future Tense – III
I. Present Tense
1. Simple present tense
2. Present continuous tense
3. Present perfect tense
4. Present perfect continuous tense
II. Past Tense
1. Simple past tense
2. Past continuous tense
3. Past perfect tense
4. Past perfect continuous tense
III Future Tense
1. Simple future tense
2. Future continuous tense
3. Future perfect tense
4. Future perfect continuous tense
I(1) SIMPLE PRESENT TENSE
This tense is used for habitual actions
అలవాటుగా జరుగుతున్న పనులకు
2) PRESENT CONTINUOUS TENSE :
This tense is used for Present progressive actions
ఇప్పుడు జరుగుతూ ఉన్న పనులకు
3) PRESENT PERFECT TENSE :
This tense is used for just completed actions
ఇంతకుముందే జరిగిన పనులకు
4) PRESENT PERFECT CONTINUOUS TENSE:
This tense is used for the present actions which started long back and which are still in progress
ఎప్పుడో మొదలై ఇప్పటికీ జరుగుతూనే ఉన్న పనులకు
II (1) SIMPLE PAST TENSE
This tense is used for the past actions, when there is any past time dimension/factor such as yesterday, last week, last month, day before yesterday, last night, last year, in 1979, four days ago/back etc., is clearly mentioned or when it is understood.
జరిగిపోయిన వాటికి నిన్న, మొన్న, పోయిన సంవత్సరం లాంటి past time factor ఏదైనా clear గా తెలియజేయబడినప్పుడు గానీ, లేదా అది అర్థొం అయినప్పుడు గానీ…
2) PAST CONTINOUS TENSE:
This tense is used for the past progressive actions.
పూర్వం అప్పుడు జరుగుతూ ఉన్న వాటికి
3) PAST PERFECT TENSE :
This tense is sued for the past actions which took place/ happened before some other past actions.
గతంలోని ఒక సంఘటనతో పోలిస్తే అంతకుముదు జరిగిన పనులకు
4) PAST PERFECT CONTITUOUS TENSE:
This tense is used for the past actions which were started well before compare to some other past action and which were in progress with respect to that past action also.
గతంలోని ఒక సంఘటనతో పోలిస్తే ఎంత ముందుగా మొదలై ఆ సంఘటనతో పోలిస్తే… అప్పటికీ జరుగుతూనే ఉన్న పనులకు…
III (1) SIMPLE FUTURE TENSE:
This tense is used for future actions
భవిష్యత్తులో జరుగుతాయనుకునే వాటికి
2) FUTURE CONTINUOUS TENSE:
This tense is used for the future progressive actions:
భవిష్యత్తులో అప్పుడు జరుగుతూ ఉంటాయనుకునే వాటికి.
3) FUTURE PERFECT TENSE:
This tense is sued for the future actions which will take place before some other future action
భవిష్యత్తులో ఒక సంఘటనతో పోలిస్తే అంతకుముందు జరిగి ఉంటాయనుకునే పనులకు
4) FUTURE PERFECT CONTINUOUS TENSE:
This tense is used for the future actions, which will start well before compare to some other future action and which will be in progress with respect to that future action also.
భవిష్యత్తులోని ఒక సంఘటనతో పోలిస్తే ఎంతో ముందుగా మొదలై ఆ సంఘటనతో పోలిస్తే… అప్పటికే జరుగుతూనే ఉంటాయనుకునే పనులకు…
ACTIVE VOICE STRUCTURE
PRESENT TENSE
1) POSITIVE NEGATIVE
I I (V1)
We (V1) We do not cooperate
You Cooperate You
They They
He He (V1+S)
She (V1+S) She does not cooperate
It Cooperates It వారు C చేయరు
వారు C చేస్తారు
2) (V1+ing) (V1 + ing)
I am cooperating now I am not cooperating now
We are cooperating now we are not cooperating now
You you
They They
He is cooperating now He
She She is not cooperating now
It వారు ఇప్పుడు C చేస్తూ ఉన్నారు వారు ఇప్పుడు C చేస్తూ లేరు.
3)
I I (V3)
We (V3) We have not cooperated
You have cooperated just before You just before
They They
He He has not cooperated
She has cooperated just before She just before
It It
వారు ఇంతకుముందే C చేశారు వారు ఇంతకు ముందే C చేయలేదు
4)
I (V1+ing) I (V1+ing)
We have been cooperating We have not been
You Since 2002 You cooperating since 2002
They They
He He has not been cooperating
She has been cooperating She since 2002
It since 2002 It
వారు 2002 నుంచి C చేస్తూనే ఉన్నారు వారు 2002 నుంచి C చేస్తూనే లేరు
(PAST TENSE)
1) POSITIVE NEGATIVE
I I
We We
You (V2) You (V2)
They Cooperated last year They did not cooperate last year
He He
She She
It It
వారు L.Y.C. చేశారు వారు L.Y.C. చేయలేదు
2)
I (V1+ing) I (V1+ing)
He was cooperating He was not cooperating
She at that time She at that time
It It
We were cooperating We Were not cooperating
You at that time You at that time
They They
వారు అప్పుడు C చేస్తూ ఉన్నారు వారు అప్పుడు C చేస్తూ లేరు
3)
I I
We We (V3)
You (V3) You had not cooperated
They had cooperated before that They before that
He He
She She
It It
వారు అంతకుముందే C చేశారు వారు అంతకుముందే C చేయలేదు
4)
I I
We We
You (V1+ing) You (v1+ing)
They had been cooperating They had not been cooperating
He at that time He at that time
She She
It It
వారు అప్పడు C చేస్తూనే ఉన్నారు వారు అప్పుడు C చేస్తూనే లేరు.
(FUTURE TENSE)
1) POSITIVE NEGATIVE
I I
We We V(1)
You (V1) You will not cooperate
They will cooperate next year They next year
He He
She She
It It
వారు అప్పడు N.Y.C చేస్తారు వారు అప్పుడు N.Y.C. చేయరు.
2)
I I
We We
You (V1+ing) You (V1+Ing)
They will be cooperating They will not be cooperating
He at that time He at that time
She She
It It
వారు అప్పుడు C చేస్తూ ఉంటారు వారు అప్పుడు C చేస్తూ ఉండరు
3)
I I (V3)
We We
You (V3) You will not have cooperated
They will have cooperated They before that
He before that He
She She
It It
వారు అంతకుముందు C చేసి ఉంటారు వారు అంతకుముందు C చేసి ఉండరు
4)
I I
We (V1+Ing) We (V1+Ing)
You will have been cooperating You will not have been
They at that time They cooperating at
He He that time
She She
It It
వారు అప్పుడు C చేస్తూనే ఉంటారు వారు అప్పుడు C చేస్తూనే ఉండరు
పైన Active voice structure ను గమనిస్తే మనకో విషయం అర్థమవుతుంది. అక్కడ V1, V2, V3 మరియు V1+ ing లను మనం గమనించవచ్చు. V1 అంటే verb యొక్క మొదటి రూపం, v2 అంటే రెండో రూపం, v3 అంటే మూడో రూపం మరియు v1+ing అంటే verb యొక్క మొదటి రూపానికి ing ను కలపడం
ఉదా:
V1 – Cooperate
V2 – Cooperated
V3 – Cooperated
V1+ ing – Cooperating
పైన ఇవ్వబడిన Active voice structure ను జాగ్రతగా చూస్తూ మాత్రమే Home work చేయాలి సుమా! చూడకుండా సొంతంగా Home work చేయడం అనేది సరైన పద్దతి కాదు. ఒక example ను Home work గా ఎలా రాయాలో చూద్దాం. మనకు Home work గా ఇవ్వబడిన example sentence I 1) Simple Present Tense లో ఉంది. అంతేకాదు ప్రతీ example కూడా I 1) Simple Present Tense లో ఇవ్వడం జరిగింది. మీరు ఈ I 1) Simple Present example ను మిగిలిన అన్ని Tenses లోకి ఈ క్రింద ఇవ్వడిన Model Examples లాగా రాయాల్సి ఉంటుంది. Telugu meaning తో సహా….
Note: –
C అంటే cooperate
L,Y అంటే Last Year
N. Y అంటే Next year
మీరు రాయాల్సిన HOME WORK
1. They conduct exams They don’t conduct exams
వారు E, C చేస్తారు వారు E, C చేయరు
2. You save money You don’t save money
మీరు M, S చేస్తారు మీరు M, S చేయరు
3. He support them He doesn’t support them
అతను వారిని ‘S’ చేస్తాడు అతను వారిని S చేయడు
4. We asks doubts We don’t ask doubts
మేము D అడుగుతాము మేము D అడగము
కేవలం చదవడం మాత్రమే కాదు. పై Example sentences ను Home work రాశాక మాత్రమే మొదటి రోజు పూర్తయినట్టుగా భావించాల్సి ఉంటుంది.
Day – 2 perfect గా practice చేయగలరు.