దసరా తర్వాత కొలువుల లెక్కలు తీస్తాం- 70,80వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు:సీఎం

దసరా తర్వాత కొలువుల లెక్కలు తీస్తాం- 70,80వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు:సీఎం

రాష్ట్రంలో 70,80 వేల దాకా కొలువులు ఖాళీగా ఉన్నాయనీ, వాటిన్నింటినీ భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో హామీ ఇచ్చారు. జోనల్ విధానాన్ని ఖచ్చితంగా అమలు చేస్తే... ఏ జిల్లా వారికి అదే జిల్లాలో పోస్టులు వస్తాయన్నారు. ములుగు, గద్వాల లాంటి మూరుమూల జిల్లాల్లో పనిచేయడానికి చాలామంది వెళ్ళడం లేదన్నారు. అందుకే ఏ జిల్లాలో వారికి అదే జిల్లాలో ఉద్యోగాలు కల్పించాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఇప్పటికే ఉన్న ఉద్యోగులను జోనల్ విధానం ప్రకారం సర్దుబాటు చేసిన తర్వాత కొత్త కొలువుల రిక్రూట్ మెంట్ మొదలు పెడతామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. దసరా తర్వాత సీఎస్ సోమేష్ కుమార్ తో మీటింగ్ పెట్టి... లెక్క తేలుస్తామని చెప్పారు. ఒకటి, రెండు నెలల్లో తప్పనిసరిగా కొలువులకు రిక్రూట్ మెంట్ మొదలవుతుందని సీఎం చెప్పారు. ఇప్పటికే ఇచ్చిన 1.50 లక్షల తో పాటు... మరో 70,80 వేల ఉద్యోగాలు ఇచ్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అసెంబ్లీలో తెలిపారు ముఖ్యమంత్రి కేసీఆర్.

 

ఈ కోర్సు ఫాలో అయితే మీకు ఉద్యోగం ఎందుకు రాదు ?  http://telanganaexams.com/3months-course/

Telangana Exams Plus యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి లింక్ https://play.google.com/store/apps/details?id=co.lynde.atvqp