Monday, September 23

CURRENT AFFAIRS – JULY 4

తెలంగాణ
01) 2019 జులై 4 నాడు రాష్ట్రంలో ఎన్ని మండల పరిషత్ లో కొత్త పాలకమండలి బాధ్యతలు చేపట్టాయి ?
జ: 498 మండల పరిషత్ లు
(నోట్: ఇందులో కొత్తగా ఏర్పడిన 112 ఎంపీపీలు ఉన్నాయి. ఆగస్టు 7 నుంచి 39 మండలాల్లో మండల పాలక వర్గాలు బాధ్యతలు చేపడతాయి)
02) హరితహారంలో భాగంగా రాష్ట్రంలో ఎన్ని ఈత, ఖర్జూర, తాటి మొక్కల పెంపకం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: కోటి మొక్కలు

జాతీయం
03) ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచింది. వరి, జొన్నకి ఎంత ధర పెరిగింది ?
జ: వరికి రూ.60, జొన్నకి రూ.120లు
04) ఇకపై సుప్రీంకోర్టు తీర్పులు తెలుగులో కూడా అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సూచనతో సుప్రీంకోర్టు ఏయే ప్రాంతీయ భాషల్లో తీర్పులను అనువదించనున్నారు ?
జ: తెలుగు, అస్సామీ, హిందీ, కన్నడ, మరాఠీ, ఒడియా భాషల్లో
05) దేశంలో దివ్యాంగ పిల్లల విద్యా పరిస్థితులు ఆశాజనకంగా లేవని యునెస్కో ప్రకటించింది. దీనికి సంబంధించి విడుదల చేసిన నివేదిక ఏది ?
జ: స్టేట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ రిపోర్ట్ ఫర్ ఇండియా 2019
06) ముంబైలో కన్నుమూసిన 98యేళ్ళ వయస్సున్న పారిశ్రామికవేత్త ఎవరు ?
జ: బి.కె. బిర్లా
07) ప్రపంచ కప్ కు ఎంపిక చేయనందుకు మనస్థాపంతో క్రికెట్ లో అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పిన క్రికెటర్ ఎవరు ?
జ: అంబటి రాయుడు

అంతర్జాతీయం
08) యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ECB) అధ్యక్షురాలిగా ఎవరు ఎంపికయ్యారు ?
జ: క్రిస్టిన్ లగార్డే
(నోట్: ఈమె ప్రస్తుతం అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు )
09) IMF కు తాత్కాలిక ఎండీగా ఎవరిని నియమిస్తున్నట్టు IMF ఎగ్జిక్యూటివ్ బోర్డు ప్రకటించింది ?
జ: డేవిడ్ లిఫ్టన్