Sunday, January 20

CURRENT AFFAIRS – FEB 28

రాష్ట్రీయం
1) ఇంధన పొదుపు, వాహన ఉత్పాదకతలో 2016-17 ఆర్థిక సంవత్సరానికి టీఎస్ఆర్టీసి ఎవరు అవార్డు ప్రదానం చేశారు ?
జ: అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ అండర్ టేకింగ్స్
2) దేవాదుల తరహాలో ఏ సాగునీటి ప్రాజెక్టుకు కార్పొరోషన్ ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది ?
జ: సీతారామ కార్పోరేషన్
3) హైదరాబాద్ లో జరిగిన ఈ-గవర్నెన్స్ సదస్సులో పాల్గొన్న కేంద్ర మంత్రి ఎవరు ?
జ: జితేంద్ర సింగ్
4) హైదరాబాద్ నగరంలో మురుగునీటి పైప్ లైన్స్ ఉన్న మ్యాన్ హోల్స్ లోకి దిగి శుభ్రం చేసేందుకు ఏ దేశానికి చెందిన రోబోలను ఉపయోగించనున్నారు ?
జ: స్వీడన్ రోబోలు


జాతీయం
5) దేశంలోనే తొలి డిఫెన్స్ కారిడార్ ను ఏ రాష్ట్రంలో అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది ?
జ: తమిళనాడులో
6) స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి యుద్ధవిమానం ( LCA) ను మరోసారి విజయవంతంగా పరీక్షించారు. దాని పేరేంటి ?
జ: తేజస్
(నోట్: బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరిన తేజస్ LSP8 విమానం తిరిగి సురక్షితంగా చేరుకుంది. ఇంజన్ ఆపకుండానే ఇంధనాన్ని నింపారు )
7) దేశంలోని వరద బాధిత ప్రాంతాలకు ఆర్థిక సాయం చేసేందుకు ఎవరి అధ్యక్షతన కమిటీ సిఫార్సులు చేసింది ?
జ: రాజ్ నాథ్ సింగ్ కమిటీ
8) కృత్రిమ మేథపై దేశంలో మొదటిసారిగా ఇనిస్టిట్యూట్ ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు ?
జ: మహారాష్ట్ర
9) న్యూ వరల్డ్ వెల్త్ రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలోనే 15 దేశాల్లో స్థానం దక్కించుకున్న భారతీయ నగరం ఏది ?
జ: ముంబై
10) ఇండియన్ గ్రాండ్ ప్రి-1 అథ్లెటిక్స్ మీట్ లో స్వర్ణ పతకాన్ని సాధించిన ఒడిశా ప్లేయర్ ఎవరు ?
జ: ద్యుతీ చంద్
11) ఇటీవల కన్నుమూసిన కనకలతా మొహంతీ ఏ భాషకు చెందిన ప్రముఖ రచయిత ?
జ: ఒడియా
12) హైదరాబాద్ లో ఇటీవల జరిగిన 15వ బయో ఏసియా సదస్సు 2018 యొక్క థీమ్ ఏంటి ?
జ: Right Time, Right Now

అంతర్జాతీయం
13) ఏ దేశంలో అధ్యక్షుడు రెండు సార్లే పోటీ చేయాలన్న నిబంధన రద్దు చేసే రాజ్యాంగ సవరణపై నిరసన వ్యక్తమవుతోంది ?
జ: చైనాలో
(నోట్: జిన్ పింగ్ మూడోసారి పదవి చేపట్టేందుకు రాజ్యాంగాన్ని సవరించాలని చూస్తున్నారు )
14) వర్షాభావంతో నీళ్ళకు కట కటలాడుతున్న ఏ నగరానికి భారత్ - దక్షిణాఫ్రికా జట్టు రూ.5.52 లక్షల విరాళం ప్రకటించాయి ?
జ: కేప్ టౌన్
15) చందమామపై 4జీ మొబైల్ నెట్ వర్క్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన సంస్థలు ఏవి ?
జ: వోడాఫోన్(జర్మనీ), నోకియా, ఆడి సంస్థలు
16) రోగులు తమ వ్యాధి లక్షణాలను ఈజీ అర్థం చేసుకోడానికి ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ గూగుల్ కొత్తగా చేర్చి అంశం ఏది ?
జ: సింప్టమ్ సెర్చ్
17) పాకిస్తాన్ అధికార PML -N పార్టీ తాత్కాలిక అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు ?
జ: షాబాజ్ షరీఫ్ (నవాజ్ షరీఫ్ సోదరుడు )

CONSTABLE/SI/VRO/GROUP - IV మాక్ టెస్టులు నడుస్తున్నాయి.  మీరు ఎప్పుడైనా ఐడీ తీసుకోవచ్చు.  ఎప్పుడు తీసుకున్నా మొదటి టెస్ట్ నుంచి మీకు అందుబాటులో ఉంటాయి. 
http://tsexams.com/pcvro-mock-test/

AEE ఎగ్జామ్స్ ఇంగ్లీష్, తెలుగు మీడియంల్లో మాక్ టెస్టులు...

పూర్తి వివరాలకు : https://telanganaexams.com/aee-mock-tests/

TRANCO ఎగ్జామ్స్ కి గ్రాండ్ టెస్టులు
(General Awarenes + Electrical Subject)
15 గ్రాండ్ టెస్టులు-1200 ప్రశ్నల కవరేజ్

AE/SUB ENGR...GS లో కొన్ని టాపిక్స్ పై ప్రిపరేషన్ మెటీరియల్ కూడా ఇవ్వబడును)
పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి:
https://tsexams.com/tranco-announce/