Sunday, January 20

CURRENT AFFAIRS FEB 26

రాష్ట్రీయం
1) రైతు సమన్వయ సమితి ప్రాంతీయ సదస్సును ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ ప్రారంభించారు ?
జ: ఆచార్య జయశంకర్ విశ్వవిద్యాలయం (హైదరాబాద్)
2) తండాల్లో శిశువిక్రయాలను అడ్డుకునేందుకు నిరుపేద శిశువు పేరిట ఎంత మొత్తం ఫిక్స్ డ్ డిపాజిట్ చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కొత్తపథకం తేవాలని భావిస్తోంది ?
జ: రూ.1లక్ష
3) TSPSC ఛైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణికి 2015 ఏడాదికి సాహిత్య పురస్కారం అందించాలని తెలుగు విశ్వవిద్యాలయం నిర్ణయించింది. ఆయన రాసిన ఏ పుస్తకానికి ఈ అవార్డు దక్కింది ?
జ: తెలంగాణ జైత్రయాత్ర
4) 2016 సంవత్సరం ఉత్తమ రచయిత్రిగా కీర్తి పురస్కారాన్ని ఎవరికి ప్రకటించారు ?
జ: తిరునగరి దేవకిదేవి

జాతీయం
5) గాంధీ మెమోరియల్ ఫౌండేషన్ ప్రకటించిన 2017 అంతర్జాతీయ గాంధీ అవార్డులను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఎవరికి ప్రదానం చేశారు ?
జ: డాక్టర్ ఎం.డి. గుప్తే, డాక్టర్ అతుల్ షా
(నోట్: కుష్టువ్యాధి నిర్మూలనకు పనిచేశారు. )
6) మానవరహిత యుద్ధ విమానాన్ని DRDO కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా చెళ్లకెరలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ లో విజయవంతంగా ప్రయోగించారు. దీని పేరేంటి ?
జ: రుస్తుం - 2
7) ఈనెల 23న గాంధీ మందిర్ ఇండోర్ స్టేడియంలో ఆది మహోత్సవ్ నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది ?
జ: అసోం
8) ప్రపంచానికి వ్యాక్సిన్ హబ్ ఆఫ్ ఇండియాగా తీర్చి దిద్దాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది ?
జ: తెలంగాణ
9) ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్ ను ఎక్కడ నిర్వహించారు ?
జ: మధ్యప్రదేశ్ లోని ఛాతర్ పూర్
10) మార్చి1 , 2018 నుంచి ఏ బ్యాంకు ఎలక్టోరల్ బాండ్స్ అమ్మకాన్ని మొదలుపెట్టనుంది ?
జ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
11) Your perfect Banking partner - ఇది ఏ బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ ?
జ: Federal Bank
12) ఒన్ 97 కమ్యూనికేషన్స్ ఏ పేరుతో రెండు ఇన్సూరెన్స్ కార్పోరేషన్స్ ను ప్రారంభించింది ?
జ: Paytm Life Insurance Corporation Ltd., Paytm General Insurance Corporation Ltd.,
13) ఇటీవల మరణించిన కున్వర్ బాయి ఏ రాష్ట్రానికి చెందిన స్వచ్ఛ భారత్ అభియాన్ కు మస్కట్ గా వ్యహరిస్తున్నారు ?
జ: ఛత్తీస్ గఢ్
14) దిబ్రూ సైఖూవా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది ?
జ: అసోమ్
15) పూలసాగులో రైతు ఉత్పత్తి సంఘాలు, పాలీ హౌస్ లు, షేడ్ నెట్ ల ఏర్పాటు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఏ రాష్ట్రానికి నమూనా అవార్డును ప్రకటించారు ?
జ: ఆంధ్రప్రదేశ్ కు
16) స్విస్ ఓపెన్ సూపర్ 300 టోర్నీ విజేత ఎవరు ?
జ: సమీర్ వర్మ (ఇండియా)


అంతర్జాతీయం
17) దక్షిణకొరియాలోని ప్యోంగ్ చాంగ్ లో జరుగుతున్న వింటర్ ఒలింపింక్స్ ముగింపు ఉత్సవాల్లో పాల్గొనడానికి వచ్చిన ఉత్తరకొరియా జనరల్ ఎవరు ?
జ: కిమ్ యోంగ్ చోల్
18) టెక్నాలజీ దిగ్గజం యాపిల్ కో ఫౌండర్ స్టీవ్ జాబ్స్ 1973లో ఉద్యోగం కోసం నింపిన రెజ్యుమెని ఎవరు వేలం వేస్తున్నారు.
జ: ఆర్ ఆర్ ఆక్షన్స్
19) గురుగ్రహానికి చెందిన ఉపగ్రహంలో ఒకటైన యూరోపాపై జీవం ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనిపై ఎవరు పరిశోధనలు చేస్తున్నారు ?
జ: బ్రెజిల్ లోని సావో పాలో యూనివర్సిటీ పరిశోధకులు
20) ఆసియన్ డెవలప్ మెంట్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది ?
జ: మనీలా, ఫిలిప్పీన్స్

CONSTABLE/SI/VRO/GROUP - IV మాక్ టెస్టులు
http://tsexams.com/pcvro-mock-test/

AEE ఎగ్జామ్స్ ఇంగ్లీష్, తెలుగు మీడియంల్లో మాక్ టెస్టులు...

పూర్తి వివరాలకు : https://telanganaexams.com/aee-mock-tests/