Sunday, January 20

CURRENT AFFAIRS FEB 23

రాష్ట్రీయం
1) రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే రైతు కార్పోరేషన్ లో బలహీన వర్గాలు, మహిళలకు ఎంత శాతం ప్రాతినిధ్యం కల్పించనున్నారు ?
జ: 51 శాతం
2) 15వ బయో ఆసియా సదస్సు హైదరాబాద్ లో జరుగుతోంది. జినోమ్ వ్యాలీ 2.0 పేరుతో ఏర్పాటయ్యే ఫార్మాసిటీలో ఎన్ని కంపెనీలతో విస్తరించనున్నారు ?
జ: 200కు పైగా కంపెనీలు
3) బాంబే స్టాక్ ఎక్చేంజ్ లో GHMC అధికారికంగా లిస్టింగ్ అయింది. బాండ్ల ద్వారా ఎన్ని కోట్లు సమీకరించాలని నిర్ణయించారు ?
జ: 200 కోట్లు
(నోట్: మొత్తం వెయ్యి కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు )
4) వరగంల్ జౌళి పార్కులో రూ.2వేల కోట్లతో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న విదేశీ సంస్థ ఏది ?
జ: దక్షిణ కొరియాకి చెందిన యంగ్ వన్ కార్పొరేషన్0
5) రాష్ట్రంలోని ఏ ఉమెన్స్ కాలేజ్ ని వచ్చే ఏడాది నుంచి మహిళా యూనివర్సిటీగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: కోఠి ఉమెన్స్ కాలేజ్
6) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నేషనల్ కాడెట్ కోర్ ( NCC) డిప్యూటీ డైరక్టర్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: నూకల నరేంద్ర రెడ్డి

జాతీయం
7) ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్ నివేదిక ప్రకారం ప్రపంచ అవినీతి సూచీ - 2017 లో ఇండియా స్థానం ఎంత ?
జ: 81
(నోట్: మొత్తం 180 దేశాలకు ర్యాంకులు కేటాయించారు )
8) రాజకీయ పార్టీ నిధుల్లో పారదర్శకత కోసం కేంద్రం తెచ్చిన ఎలక్టోరల్ బాండ్ పథకం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందని ఆర్థిక శాఖ వెల్లడించింది ?
జ: మార్చి 1 నుంచి
9) కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకి ఢిల్లీలో ఇచ్చిన విందులో ఖలిస్తాన్ ఉగ్రవాది పాల్గొనడం వివాదస్పదమైంది. ఆ ఉగ్రవాది ఎవరు ?
జ: జస్పాల్ అత్వాల్
10) కేంద్ర ప్రభుత్వం ప్రారంభించబోయే జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకం - మోదీ కేర్ కు అవసరమయ్యే సాంకేతిక సాయం అందించేందుకు అంగీకరించిన ప్రముఖ వ్యక్తి ఎవరు ?
జ: ఇన్ఫోసిస్ ఛైర్మన్ నందన్ నిలేకనీ
11) భారత్ లో స్థూల జాతీయోత్పత్తి ( GDP) లో కుబేరుల వాటా ఎంతకు పెరుగుతోందని ఆక్స్ ఫామ్ ఇండియా నివేదిక వెల్లడించింది ?
జ: 15శాతం
12) కేంద్ర టెలికాం శాఖ మంత్రి ఎవరు ?1
జ: మనోజ్ సిన్హా
13) పంజాబ్ పోలీస్ శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ( DSP) గా బాధ్యతలు చేపట్టనున్న భారత మహిళా టీ20 జట్టు కెప్టెన్ ఎవరు ?
జ: హర్మన్ ప్రీత్ కౌర్
అంతర్జాతీయం
14) దక్షిణాఫ్రికాలో జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్ ముగింపు కార్యక్రమానికి అమెరికా నుంచి ఎవరు ముఖ్య అతిధిగా హాజరవుతున్నారు ?
జ: ఇవాంకా ట్రంప్

CONSTABLE/SI/VRO/GROUP - IV మాక్ టెస్టులు
http://tsexams.com/pcvro-mock-test/

AEE ఎగ్జామ్స్ డేట్ ను TSPSC ప్రకటించింది.  మార్చి 18న జరుగుతాయి.  అందువల్ల మీరు ఆన్ లైన్ లో జనరల్ స్టడీస్ + CURRENT AFFAIRS మాక్ టెస్టులు రాసుకోడానికి మంచి అవకాశం

ఇంగ్లీష్, తెలుగు మీడియంల్లో మాక్ టెస్టులు... పూర్తి వివరాలకు : https://telanganaexams.com/aee-mock-tests/