Sunday, January 20

CURRENT AFFAIRS – FEB 22

రాష్ట్రీయం
1) అమర వీరుల స్మృతి వనాన్ని ప్రమీద ఆకృతిలో ఎక్కడ నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు ?
జ: హుస్సేన్ సాగర్ తీరంలో 12 ఎకరాల్లో
3) రాష్ట్రంలో 40 ఎకరాల్లో రూ.220 కోట్లతో సౌందర్య సాధనాలు, సబ్బుల తయారీ పరిశ్రమను స్థాపించేందుకు ముందుకు వచ్చిన కంపెనీ ఏది ?
జ: విప్రో
3) ఐటీ ఆధారిత సేవలు, కొత్త ఆవిష్కరణ రంగాల్లో పరస్పర సహకారానికి ఏ నగరంతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది ?
జ: తవోయుయాన్ ( తైవాన్ దేశం)
4) రాష్ట్రంలోని హైదరాబాద్ లో ఇవాళ్టి నుంచి మొదలవుతున్న మరో ప్రతిష్టాత్మక సదస్సు ఏది ?
జ: బయో ఏసియా సదస్సు - 2018
(నోట్: 60 దేశాల నుంచి 2 వేల మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు )
5) రాష్ట్రంలో 8 క్యాన్సర్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ ఏది ?
జ: టాటా ట్రస్ట్
6) ఉష్ణ రేటు ట్రోఫీ అవార్డు 2016-17 పాటు టెక్నో గెలాక్సీ అవార్డు 2018 ను అందుకున్న రాష్ట్రానికి చెందిన పవర్ ప్లాంట్ ఏది ?
జ: ఎన్టీపీసీ రామగుండం

జాతీయం
7) ఉత్తరప్రదేశ్ లోని ఏ ప్రాంతంలో 20 వేల కోట్ల పెట్టుబడితో రక్షణ రంగ పరిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు ?
జ: బుందేల్ ఖండ్
8) ఎన్ఆర్ చందూర్ అవార్డును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఎవరికి ప్రదానం చేశారు ?
జ: నరిశెట్టి రాజు ( అమెరికాకి చెందిన గిజ్ మోడో మీడియా గ్రూప్ CEO)
9) ఉద్యోగుల భవిష్యనిధిపై వడ్డీ రేటును 2017-18 కు ఎంతగా నిర్ణయించారు ?
జ: 8.55 శాతం
10) నటుడు కమల్ హాసన్ ప్రారంభించిన కొత్త పార్టీ పేరేంటి ?
జ: మక్కల్ నీది మయ్యమ్
(నోట్: మధురైలో ఆయన పార్టీ పేరు, జెండాను ఆవిష్కరించారు )
11) జాతీయ వైమానికి ప్రయోగశాల స్వదేశీ సాంకేతిక పరిజ్నానంతో తయరు చేసిన చిరు విమానం సారస్ PT1N ను బెంగళూరు నగరంలో రెండోసారి విజయవంతంగా ప్రయోగించారు. ఇందులో ప్రయాణించిన కేంద్ర మంత్రి ఎవరు ?
జ: కేంద్ర విజ్ఞాన శాస్త్ర, సాంకేతిక మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్
12) రామాలయంల నమూనాలో ఏ రైల్వే స్టేషన్ ను తీర్చి దిద్దనున్నట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయెల్ ప్రకటించారు ?
జ: అయోధ్య రైల్వే స్టేషన్
13) వినియోగదారులకు బ్యాంకింగ్ కు సంబంధించిన ప్రాథమిక ప్రశ్నలపై సమాధానాలు ఇచ్చేందుకు RBS బ్యాంకు ఏర్పాటు చేసిన డిజిటల్ మానవ రూపం నమూనాని విడుదల చేశారు. ఆ రూపానికి ఏమని పేరు పెట్టారు ?
జ: కోరా


14) మిగ్ 21 యుద్ధ విమానాన్ని నడిపిన తొలి భారతీయ మహిళ ఎవరు ?
జ: అవనీ చతుర్వేది
15) రాత్రివేళల్లోనూ లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకునేలా రూపొందించిన క్షిపణిని విజయవంతంగా ప్రయోగించారు. దాని పేరేంటి ?
జ: పృధ్వీ - 2

అంతర్జాతీయం
16) భూమ్మీద పడ్డ నెల రోజుల్లోనే శిశువులు చనిపోతున్న దేశాల్లో ఏది మొదటి స్థానంలో ఉంది ?
జ: పాకిస్తాన్
17) నవజాతి శిశువులకు అత్యంత సురక్షితమైన దేశం ఏది ?
జ: జపాన్

 

CONSTABLE/SI/VRO/GROUP - IV మాక్ టెస్టులు
http://tsexams.com/pcvro-mock-test/

 

AEE ఎగ్జామ్స్ డేట్ ను TSPSC ప్రకటించింది.  మార్చి 18న జరుగుతాయి.  అందువల్ల మీరు ఆన్ లైన్ లో జనరల్ స్టడీస్ + CURRENT AFFAIRS మాక్ టెస్టులు రాసుకోడానికి మంచి అవకాశం

ఇంగ్లీష్, తెలుగు మీడియంల్లో మాక్ టెస్టులు... పూర్తి వివరాలకు : https://telanganaexams.com/aee-mock-tests/