Sunday, January 20

CURRENT AFFAIRS – FEB 21

రాష్ట్రీయం
1) హైదరాబాద్ లో జరుగుతున్న ప్రపంచ ఐటీ సదస్సులో మాట్లాడిన తొలి మానవ రూప రోబో (హ్యూమనాయిడ్) ఏది ?
జ: సోఫియా
( ఈ రోబో సృష్టికర్త : డేవిడ్ హాన్సన్ )
2) ఎవరి అధ్యక్షతన దక్షిణాది రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రుల, అధికారుల సమావేశం హైదరాబాద్ లో జరిగింది ?
జ: కేంద్ర జలవనరుల మంత్రి అర్జున్ రా మేఘవాల్
3) నదీజలాల విషయంలో తీవ్రమైన జాప్యం జరుగుతున్నందున ఒకే ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ డిక్లరేషన్ కు ఏమని పేరు పెట్టారు ?
జ: హైదరాబాద్ డిక్లరేషన్
5) ఏ నదికి సంబంధించి గడచిన రెండు దశాబ్దాల్లో నీటి లభ్యతను అంచనా వేశాకే, నదుల అనుసంధానం మొదలు పెట్టాలని దక్షిణాది రాష్ట్రాల నీటిపారుదల శాఖాధికారుల సమావేశం నిర్ణయించింది ?
జ: గోదావరి
6) ప్రస్తుతం సీడబ్ల్యూసీ ఛైర్మన్ ఎవరు ?
జ: హుస్సేన్
7) డేటా సైన్స్, కృత్రిమ మేథ సాంకేతిక పరిజ్ఞానం కోసం హైదరాబాద్ లో డేటా సైన్స్ ఎక్స్ లెన్స్ కేంద్రం ఏర్పాటుకు తెలంగాణ సర్కార్ ఏ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది ?
జ: నాస్ కామ్
8) వరల్డ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ అలయెన్స్ నుంచి ప్రపంచ ఐసీటీ ఎక్స్ లెన్స్ అవార్డు - 2018 రాష్ట్రంలోని ఏ ప్రభుత్వ సంస్థకు లభించింది ?
జ: మీ సేవ
9) 100 ఎకరాల్లో మాంసం ఎగుమతి కేంద్రాన్ని హైదరాబాద్ లో నెలకొల్పేందుకు ముందుకు వచ్చిన సంస్థ ఏది
జ: లూలూ సంస్థ

 

జాతీయం
10) వాణిజ్య అవసరాలకు ప్రైవేటు సంస్థలు బొగ్గు తవ్వుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. 1973లో బొగ్గు రంగాన్ని జాతీయీకరణ చేశాక ఏ సంస్థకు మాత్రమే బొగ్గు తవ్వేందుకు అనుమతి ఇచ్చారు ?
జ: కోల్ ఇండియా లిమిటెడ్
11) ప్రస్తుత ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరు ?
జ: అన్షు ప్రకాశ్
12) అణ్వస్త్ర సామర్థ్యమున్న మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని-2 ను ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం దీవి నుంచి విజయవంతంగా పరీక్షించారు. ఇది ఎన్ని కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగలదు ?
జ: 2 వేల కిమీ
13) అగ్ని - 2 తొలి పరీక్షను ఎప్పుడు నిర్వహించారు ?
జ: 1999 ఏప్రిల్ 11
14) కామన్ వెల్త్ యువ అవార్డుల జాబితాలో చోటు దక్కించుకున్న ఇద్దరు భారతీయులు ఎవరు ?
జ: మృణాళిని దయాళ్, యోగేష్ కుమార్
15) కామన్ వెల్త్ యువ అవార్డుకి ఎంపికైన మృణాళిని దయాళ్ అవివాహితులైన మహిళలకు లైంగిక ఆరోగ్య సేవలు అందించేందుకు ఏ సంస్థను నడుపుతున్నారు ?
జ: హైయ్యా
16) కామన్ వెల్త్ యువ అవార్డుకి ఎంపికైన యోగేశ్ కుమార్ వాహనాలు నడపడానికి డ్రైవర్లుగా మహిళలకు శిక్షణ ఇస్తున్నారు. ఆయన స్థాపించిన సామాజిక కంపెనీ ఏది ?
జ: ఈవెన్ కార్గో
17) ఏ దేశంతో కుదిరిన చలన చిత్రాల సహ నిర్మాణం ఒప్పందానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది ?
జ: ఇజ్రాయెల్
18) ముంబైలో చనిపోయిన పద్మశ్రీ గ్రహీత బి.కె.గోయల్ ఏ రంగంలో ప్రావీణ్యులు
జ: ప్రఖ్యాత హృద్రోగ నిపుణులు
19) మహిళా ఎంపీలు, పార్లమెంటు అధికారులు, సిబ్బంది చిన్నారుల ఆలనా పాలనా చూసేందుకు శిశు సంరక్షక కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ నిర్ణయించింది ?
జ: పార్లమెంటు ఆవరణలో
20) అలనాటి సినిమాల నిర్మాత, చందమామ పత్రిక, విజయా ప్రొడక్షన్స్ వ్యవస్థపాకుడి పేరుతో ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేయనున్నారు. ఆ ప్రముఖుడు ఎవరు ?
జ: బి. నాగిరెడ్డి