Sunday, January 20

CURRENT AFFAIRS – FEB 19

రాష్ట్రీయం
1) కృత్రిమ మేధస్సు, కొత్త టెక్నాలజీలపై చర్చించేందుకు ప్రపంచ ఐటీ సదస్సు ఎక్క జరుగుతోంది
జ: హైదరాబాద్ HICC లో ( 3 రోజుల పాటు )
2) హైదరాబాద్ లో జరుగుతున్న ఐటీ సదస్సు నినాదం ఏంటి ?
జ: డిజిటల్ యుగ వాగ్దానం నెరవేరుద్దాం... డిజిటల్ విస్తరణ
3) రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన రైతు సమన్వయ సమితుల ప్రాంతీయ సదస్సులు ఎప్పుడు జరుగుతున్నాయి ?
జ: ఫిబ్రవరి 25, 26 ల్లో
4) రాష్ట్రంలో కొత్త పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఎప్పటి నుంచి మొదలవుతుంది ?
జ: మార్చి 11 నుంచి
5) 216అడుగుల ఎత్తుల భారీ స్వామి రామానుజాచార్యుల విగ్రహం ఎక్కడ నిర్మాణం అవుతోంది ?
జ: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ లో
6) ఆసియా దేశాలతో జర్మనీ నిర్వహించే 98 వ ఆసియా పసిఫిక్ బిజినెస్ అసోషియేషన్ సమావేశం పాల్గొనేందుకు రాష్ట్రానికి చెందిన ఏ మంత్రికి ఆహ్వానం అందింది ;?
జ: మంత్రి కేటీఆర్
7) డ్రీమ్స్ ఇన్ ఎ టైమ్ ఆఫ్ వార్.. చైల్డ్ హుడ్ మొమోరీస్ అనే పుస్తకాన్ని కెన్యా రచయిత ప్రొఫెసర్ గూగీ వా థియోంగో రాశారు. దీన్ని తెలుగులో ఏ పేరుతో ఎవరు అనవదించారు ?
జ: యుద్ధకాలంలో స్వప్నాలు - బాల్య జ్ఞాపకాలు ( ప్రొ.జి.ఎన్. సాయిబాబా)
జాతీయం
8) జన గణన సంచాలకుడి కార్యాలయం ప్రకారం దేశంలో ఎన్ని భాషలు ఉన్నాయి ?
జ: 22 షెడ్యుల్డ్, 100 నాన్ షెడ్యుల్డ్ భాషలు
9) దేశంలో ఎన్ని భాషలు లేదా మాండలికాలు అంతరించి పోయే ప్రమాదం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి ?
జ: 40కి పైగా భాషలు
10) భారతీయుల్లో క్యాన్సర్ ను తొలిదశలోనే గుర్తించి, మెరుగైన వైద్యం అందించేందుకు ప్రత్యేక జన్యురాశి నిధిని ఏ ఐఐటీలో ఏర్పాటు చేయనున్నారు ?
జ: ఐఐటీ - మద్రాస్
11) క్యాన్సర్ తో పోరాడటే వరి వంగడాలు ఏ రాష్ట్రంలో ఉన్నట్టు ఇందిరాగాంధీ కృషి విశ్వవిద్యాలయం, బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ నిపుణులు పరిశోధనల్లో తేల్చారు ?
జ: ఛత్తీస్ గఢ్
12) భారత్ లో పర్యటిస్తున్న కెనడా ప్రధాని ఎవరు ?
జ: జస్టిస్ ట్రూడో