Sunday, January 20

CURRENT AFFAIRS FEB 18

రాష్ట్రీయం
1) ఏ బ్రాండు పేరుతో 9 రకాల ఆహార ఉత్పత్తులను తయారు చేస్తున్నట్టు ఉద్యానవన శాఖ ప్రకటించింది ?
జ: కాకతీయ బ్రాండ్
2) మై ఎక్స్ పీరియన్స్ ఇన్ బిల్డింగ్ భరోసా - అనే పుస్తకాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మదన్. బి. లోకూర్ ఆవిష్కరించారు. ఈ పుస్తకం రచయిత ఎవరు ?
జ: డాక్టర్ మమతా రఘువీర్

జాతీయం
3) ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీతో ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీలో సమావేశం అయ్యారు. భారత్ - ఇరాన్ మధ్య ఎన్ని ఒప్పందాలు కుదిరాయి ?
జ: 9 ఒప్పందాలు
4) ఇరాన్ లోని చాబహార్ నౌకాశ్రయంలో షాహిద్ బెహెశ్తి టెర్మినల్ నిర్వహణను భారత్ కు చెందిన ఏ సంస్థకు అప్పగించేలా ఒప్పందం కుదిరింది ?
జ: ఇండియాస్ పోర్ట్స్ గ్లోబల్ అండ్ మారిటైమ్ ఆర్గనైజేషన్
5) దేశంలో ఎన్ని పెద్ద రాష్ట్రాల్లో ఆడ శిశువుల జననం తగ్గిపోయినట్టు నీతి ఆయోగ్ తాజా నివేదిక వెల్లడించింది
జ: 17 రాష్ట్రాల్లో
(నోట్: అత్యధికంగా 53 పాయింట్లు గుజరాత్ లో పతనం)
6) కృత్రిమ మేథ అభివృద్ధి కోసం మొదటిసారిగా ఇనిస్టిట్యూట్ ను ఏర్పాటుచేసిన రాష్ట్రం ఏది ?
జ: మహారాష్ట్ర (ముంబైలో )
7) 2018 లో అత్యంత నిజాయతీ కలిగిన కంపెనీల్లో చోటు దక్కించుకున్న రెండు భారతీయ కంపెనీలు ఏవి ?
జ: టాటా స్టీల్ , విప్రో
8) న్యూఢిల్లీలో జరిగిన 7వ స్మాల్ బిజినెస్ అవార్డుల్లో స్టార్టప్ ఆఫ్ ది ఇయర్ 2017 అవార్డు అందుకున్న కంపెనీ ఏదీ
జ: మిల్క్ బాస్కెట్
9) ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ (ICHR) కి తదుపరి ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: అరవింద్ పి.జేమ్కేద్కర్
10) నాబార్డ్ ప్రస్తుత ఛైర్మన్ ఎవరు
జ: డాక్టర్ హర్ష కుమార్ భన్వాలా
11) ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ట్యాగ్ లైన్ ఏది
జ: Good People to Grow With
12) కర్ణాటకలోని శ్రావణ బెళగొళలో ఏకశిలామూర్తి గోమటేశ్వరుని విగ్రహం ఎత్తు ఎంత ఉంటుంది ?
జ: 58.8 అడుగులు
13) టి.సుబ్బరామిరెడ్డి ఫౌండేషన్ ఇచ్చే యశ్ చోప్రా మెమోరియల్ అవార్డు ఎవరికి దక్కింది ?
జ: లెజండరీ సింగర్ ఆశా భోంస్లే


అంతర్జాతీయం
14) అడుగంటుతున్న విదేశీ మారక నిల్వలను నింపేందుకు 3200 కోట్ల రుణాన్ని పాకిస్తాన్ కు అందించిన దేశం ఏది ?
జ: చైనా
15) ప్రపంచ టెన్నిస్ లో నెంబర్ 1 స్థానానికి ఎదిగిన క్రీడాకారుడు ఎవరు
జ: రోజర్ ఫెదరర్
16) ఏ దేశానికి చెందిన డ్రగ్ టెస్టింగ్ లాబోరేటరీ సరైన ప్రమాణాలు పాటించడం లేదని 6 నెలల పాటు వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ నిషేధం విధించింది ?
జ: రొమేనియా
17) మిలియన్ల డాలర్ల బకాయిలు పడటంతో ఏ రెండు దేశాలకు ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ఓటెయ్యడాన్ని నిషేధించారు ?
జ: వెనెజులా, లిబియా

CONSTABLE/SI/VRO/GROUP - IV మాక్ టెస్టులు
http://tsexams.com/pcvro-mock-test/

AEE ఎగ్జామ్స్ డేట్ ను TSPSC ప్రకటించింది.  మార్చి 18న జరుగుతాయి.  అందువల్ల మీరు ఆన్ లైన్ లో జనరల్ స్టడీస్ + CURRENT AFFAIRS మాక్ టెస్టులు రాసుకోడానికి మంచి అవకాశం

ఇంగ్లీష్, తెలుగు మీడియంల్లో మాక్ టెస్టులు... పూర్తి వివరాలకు : https://telanganaexams.com/aee-mock-tests/