Friday, February 21

PG కోర్సులకు కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్

రాష్ట్రంలోని ఏడు యూనివర్సిటీలకు సంబంధించిన 80 PG కోర్సులకు ఒక్కటే ఉమ్మడి పరీక్షను ఈ ఏడాది నుంచే నిర్వహిస్తున్నారు. దేశంలోనే మొదటిసారిగా సంప్రదాయ పీజీ కోర్సులకు నిర్వహిస్తున్న ఈ పరీక్షకు CPGET (కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ ) గా పేరు పెట్టారు. ఈసారి ఈ ఉమ్మడి పరీక్ష నిర్వహణ బాధ్యతను ఉస్మానియా యూనివర్సిటీకి అప్పగించింది ఉన్నత విద్యామండలి. రాష్ట్రంలోని 6 యూనివర్సిటీలతో పాటు JNTUH లోని MSc కోర్సులకు కూడా ఇదే ఎగ్జామ్ ఉంటుంది.
ఏప్రిల్ 30 ( మంగళవారం) నుంచి మే 30 వ తేదీ వరకూ దరఖాస్తులను స్వీకరిస్తారు. 2019-20 కి ఉస్మానియా యూనివర్సిటీ ఈ ఉమ్మడి ఎగ్జామ్ నిర్వహిస్తోంది. 2020-20 సంవత్సరానికి కాకతీయ వర్సిటీ ఈ బాధ్యతలు చేపడుతుంది. ఈ రెండు యూనివర్సిటీల మధ్యే ఏటేటా మారుతుంది.

హైలెట్స్

- మొత్తం 80 కోర్సులకు గాను 60 ఆన్ లైన్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో 44 పీజీ, 10 పీజీ డిప్లొమా, ఐదేళ్ళ ఇంటిగ్రేటెడ్ కోర్సులు ఆరింటికి ఎంట్రన్స్ టెస్టు ఉంటుంది.

- ఒక్కోపరీక్ష గంటన్నర టైమ్ ఉంటుంది. 100 మార్కులు

- ప్రవేశ పరీక్ష రుసుము రూ.800 (ఓసీ, బీసీలకు), రూ.600 (SC/ST/ దివ్యాంగులు). ప్రతి అదనపు సబ్జెక్టుకు రూ.400

- CPGET లోకి వచ్చే యూనివర్సిటీలు : ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధి, పాలమూరు, JNTUH

- దరఖాస్తుల స్వీకరణ: ఏప్రిల్ 30 నుంచి మే 30 వరకూ

- రూ.500 ఆలస్య రుసుముతో : జూన్ 1 నుంచి 6 వరకూ

- రూ.2000 ఆలస్య రుసుముతో జూన్ 7 నుంచి 11వరకూ

- ప్రవేశ పరీక్షలు : జూన్ 14 నుంచి 26 వరకూ ( ఒక్కో రోజు 3 ఎగ్జామ్స్)

- ఆన్ లైన్ పరీక్షలు నిర్వహించే ప్రాంతాలు: 25