Sunday, January 20

TSPSCవల్ల కాలేదు.. అందుకు ప్రభుత్వ శాఖలకి ఇచ్చాం : కేసీఆర్

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను నూటికి నూరు శాతం భర్తీ చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. కొలువుల భర్తీ ప్రక్రియను వేగంగా చేపడతామన్నారు. ఉద్యోగాల పేరుతో గత ప్రభుత్వాలు మోసం చేశాయన్నారు. నిరుద్యోగాలను పావులుగా వాడుకున్నాయన్నారు సీఎం కేసీఆర్. ఖాళీగా ఉన్న ఉద్యోగాల రిక్రూట్ మెంట్ బాధ్యతలను TSPSC కి అప్పగించినా… కమిషన్ ఆ పని పూర్తి స్థాయిలో చేయలేకపోయిందన్నారు. అది తమకు మైనస్ అయిందనీ… దాంతో కొలువుల భర్తీ బాధ్యతలను కొన్ని ప్రభుత్వ శాఖలకే అప్పగించామన్నారు కేసీఆర్. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని స్పీడప్ చేస్తామని మరోసారి హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్. వచ్చే ఏడాది నుంచి నిరుద్యోగ భృతి అమలు చేస్తామన్నారు.  వచ్చే ఏడాది బడ్జెట్ లో నిధులు కేటాయిస్తామన్నారు సీఎం.