నిరుద్యోగులూ రెడీగా ఉండండి !

నిరుద్యోగులు రెడీగా ఉండాలని సీఎం కేసీఆర్ పిలుపు ఇచ్చారు. రేపు బుధవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీలో నిరుద్యోగులకు సంబంధించి కీలక ప్రకటన చేస్తున్నట్టు చెప్పారు. 10గంగలకు అందరూ టీవీలు చూడాలని కోరారు. వనపర్తిలో జరిగిన భారీ బహిరంగ సభలో సీఎం KCR ఈ ప్రకటన చేశారు. దాంతో సీఎం మళ్ళీ ఏ ప్రకటన చేస్తారన్న ది ఆసక్తికరంగా మారింది. నిరుద్యోగ భృతికి నిధులు, విధి విధానాలు ప్రకటించే అవకాశం ఉందని కొందరు పరిశీలకులు అంటున్నారు. అయితే 70 వేల ఉద్యోగాలంటూ ఏడాదికి పైగా సీఎం తెలంగాణలో నిరుద్యోగులను ఊరిస్తున్నారు. దీనిపై మళ్ళోసారి ప్రకటన చేసే అవకాశముందని భావిస్తున్నారు. అయితే ఈసారైనా ప్రకటనలకే పరిమితం కాకుండా... నోటిఫికేషన్లు జారీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
కోర్సుల్లో జాయిన్ అవడానికి, ఎగ్జామ్స్ రాయడానికి ఈ కింది లింక్ ద్వారా Telangana Exams Plus యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి
https://play.google.com/store/apps/details?id=co.lynde.atvqp