చేనేత కార్మికుల సంక్షేమం

1) చేనేత కార్మికులకు నెలకు ఎంత మొత్తానికి తగ్గకుండా వేతనం ఇచ్చేలా పవర్ లూమ్ యాజమాన్యాలను ప్రభుత్వం ఒప్పించింది ?
జ: రూ.15 వేలు
2) తెలంగాణా ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం ఈ సంవత్సరం బడ్జెట్ లో ఎంత కేటాయించారు ?
జ: రూ. 1200 కోట్లు
3) తెలంగాణా ప్రభుత్వం టెక్స్ టైల్స్ పార్క్ ను ఎక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణియించారు ?
జ: వరంగల్, సిరిసిల్లల్లో అపరెల్ పార్కులు
4) ప్రభుత్వం తరపున జరిపే వస్త్రాల కొనుగోళ్ల ఆర్డర్లను ఏ సొసైటీలకే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: చేనేత, మరమగ్గాల సొసైటీలు

5) చేనేత కార్మికులను ఆదుకునేందుకు నేతన్నకు చేయూత పథకాన్ని ఎవరు ప్రారంభించారు ?
జ: రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి కేటీఆర్
6) నేతన్నకు చేయూత పథకం ఎక్కడ ప్రారంభమైంది ?
జ: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో
7) నేతన్నకు చేయూత పథకం కింద ఎన్నేళ్ళు నిండిన వారికి అర్హత ఉంది ?
జ: 18యేళ్ళు
8) నేతన్నకు చేయూత పొదుపు పథకంలో లబ్దిదారుడు, ప్రభుత్వ వాటాలు ఎంతెంత ఉన్నాయి ?
జ: లబ్దిదారుడు 8శాతం, ప్రభుత్వ వాటా 16శాతం (గరిష్టంగా రూ.2400లు)

9) నేతన్నకు చేయూత పొదుపు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంత మొత్తం కేటాయించింది ?
జ: రూ.75 కోట్లు
10) నేతన్నకు చేయూత పొదుపు పథకానికి మరో పేరు ఏంటి ?
జ: Telangana Handloom weavers thrift savings & Security Scheme (TFSSS)