Wednesday, February 26

కేంద్ర బడ్జెట్ 2018-19

1) 2018-19 కేంద్ర బడ్జెట్ ను ఎన్ని కోట్ల అంచనాలతో ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టారు
జ: రూ.24.4 లక్షల కోట్లు
2) 2018-19 కేంద్ర బడ్జెట్ లో ఆహార రాయితీ ఎన్ని లక్షల కోట్లకు చేరనుంది
జ: రూ.1.69 లక్షల కోట్లు
3) కొత్త ఉద్యోగుల తరపున ఉద్యోగ భవిష్య నిధికి వేతనంలో ఎంత శాతాన్ని కేంద్ర ప్రభుత్వం
చెల్లించనుంది
జ: 12శాతం
4) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితియార్థంలో ఎంతశాతం ఆర్థిక వృద్ధి ఉంటుందని అంచనా
వేశారు
జ: 7.2 - 7.5 శాతం
5) 2018-19 కేంద్ర బడ్జెట్ లో రక్షణ రంగానికి ఎంత మొత్తాన్ని కేటాయించారు
జ: రూ.2.82 లక్షల కోట్లు
6) 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు దిశగా 2018-19 కేంద్ర బడ్జెట్ లో ఎంత మొత్తాన్ని
సాగు రుణాలకు కేటాయించారు
జ: రూ.11 లక్షల కోట్లు


7) దేశంలో ఎన్ని సంతలను గ్రామీణ వ్యవసాయ మార్కెట్లు (గ్రామ్స్) గా తీర్చి దిద్దనున్నారు
జ: 22 వేలు
8) త్వరగా పాడయ్యే బంగాళా దుపం, టమాటా, ఉల్లి లాంటి పంటల ధరల్లో అనూహ్య హెచ్చు
తగ్గుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమం ఏది. దానికి ఎంత మొత్తం
కేటాయించారు
జ: ఆపరేషన్ గ్రీన్స్ ( రూ.500 కోట్లు)
9) ఆపరేషన్ గ్రీన్స్ పథకం ప్రస్తుతం ఏ రాష్ట్రంలో అమల్లో ఉంది
జ: హరియాణా
10) హరియాణాలో ఆపరేషన్ గ్రీన్స్ తరహాలో భవంతర్ బర్పయి యోజన పథకం
అమలవుతోంది. ఇక్కడ ఏయే పంటలకు అనుమతి ఉంది
జ: ఆలు గడ్డ, ఉల్లి గడ్డ, క్యాలీ ఫ్లవర్
11) 40 లక్షల ఎకరాల్లో బిందు సేద్యానికి 2018-19 కేంద్ర బడ్జెట్ లో రూ.4 వేల కోట్లను
కేటాయించారు. ఏ పథకం కింద దీన్ని అమలు చేస్తారు ?
జ: ప్రధానమంత్రి కృషి సంచయి యోజన
12) ప్రపంచంలోనే అతి పెద్ద ఆరోగ్య బీమా పథకాన్ని 2018-19 కేంద్ర బడ్జెట్ లో ప్రకటించారు.
50కోట్ల మంది పేదలకు ప్రయోజనం కలిగించే ఈ ఆరోగ్య బీమా కింద పేద కుటుంబానికి ఏటా
ఎంత మొత్తం కవరేజి ఉంటుంది
జ: రూ.5 లక్షలు
13) కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకాన్ని ఏ పేరుతో వ్యవహరించనున్నారు
జ: మోదీ కేర్
14) ఆకుపచ్చ బంగారంగా పిలిచే వెదురు రంగాన్ని ప్రోత్సహించేందుకు ఎన్ని కోట్లతో జాతీయ
వెదురు కార్యక్రమాన్ని కేంద్రం ప్రారంభించనుంది
జ: రూ.1290 కోట్లు
15) రాజధాని ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు కేంద్ర ప్రత్యేక పథకం చేపట్టనుంది. అందుకోసం
పర్యావరణ మంత్రిత్వ శాఖకు ఎంత మొత్తాన్ని కేటాయించారు
జ: రూ.2,675.42 కోట్లు


16) మైనార్టీ వ్యవహారాల శాఖకు 2018-19 కేంద్ర బడ్జెట్ లో ఎంత మొత్తం కేటాయించారు
జ: రూ.4,700 కోట్లు (గత ఏడాది రూ.3,800కోట్లు)
17) దేశంలో గ్రామీణ కుటుంబాల్లో 31.4శాతం మంది అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.
అయితే ఒక్కో కుటుంబంపై సగటు రుణ భారం ఎంత ఉంటోంది
జ: రూ.1,03,457
18) ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం కింద దేశంలో ఎన్ని ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు
చేయనున్నారు
జ: 1.5 లక్షలు
19) గ్రామీణ భారతానికి 2018-19 కేంద్ర బడ్జెట్ లో ఎంత మొత్తం నిధులు కేటాయించారు
జ: రూ.14.34 లక్షల కోట్లు (321 కోట్ల పని దినాలను కల్పిస్తారు )
20) ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద గ్రామీణ ప్రాంతాల్లో 2018-19 లో ఎన్ని లక్షల ఇళ్ళ
నిర్మాణం చేపట్టనున్నారు
జ: 51 లక్షల ఇళ్ళు
21) దేశంలో అందరికీ ఇళ్ళు అందాలన్నలక్ష్యాన్ని ఎప్పటి లోగా నెరవేర్చనున్నారు
జ: 2022 నాటికి
22) దేశంలో 2022 నాటికి అందరికీ ఇళ్ళు నిర్మించాలని కేంద్రం భావిస్తోంది. అయితే గ్రామీణ,
పట్టణ ప్రాంతాల్లో అప్పటిలోగా ఎన్ని ఇళ్ళను నిర్మించనున్నారు ?
జ: పట్టణాల్లో 2 కోట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 కోట్లు
23) ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంను మొదట ఎప్పుడు ప్రారంభించారు
జ: 2015లో
24) మోడీ సర్కార్ గడచిన రెండేళ్ళల్లో అందుబాటులో అందరికీ ఇళ్ళు పథకానికి ఎంత మొత్తం
కేటాయించింది
జ: రూ.1,10,753 కోట్లు
25) భారతమాల పరియోజన పథకం మొదటి దశలో భాగంగా రూ.5.35 లక్షల కోట్లతో ఎన్ని
వేల కిలోమీటర్ల పొడవైన రహదారులు నిర్మించనున్నారు
జ: 35 వేల కోట్లు
26) ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన (PMGSY) పథకం 3 వ దశ కింద గ్రామీణ ప్రాంతాల్లో
రోడ్ల అభివృద్ధికి ఎన్ని వేల కోట్లు కేటాయించారు
జ: రూ.19 వేల కోట్లు
27) దేశంలో మొత్తం జాతీయ రహదారుల పొడవు ఎంత
జ: 1,15,435 కిలోమీటర్లు
28) దేశంలో అన్ని రకాల రహదారుల పొడవు ఎంత
జ: 33 లక్షల కిలోమీటర్లు
29) డిజిటల్ ఇండియా కార్యక్రమానికి 2018-19 కేంద్ర బడ్జెట్ లో ఎంత మొత్తం
కేటాయించారు
జ: రూ.3073 కోట్లు
30) టెలికాం రంగాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా 5జీ ప్రయోగ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు
చేయాలని నిర్ణయించారు
జ: మద్రాస్ ఐఐటీలో

================================

నోట్: ఇవాళ్టి కరెంట్ ఎఫైర్స్ కు బదులు బడ్జెట్ 2018-19 పై ప్రశ్నలు ఇచ్చాం.  గమనించగలరు.  ఇంకా మిగిలినవి రేపు ఇవ్వగలము
===============================

TRT ఎగ్జామ్స్ పనికొచ్చే టాపిక్స్ : CURRENT AFFAIRS & GK

దాదాపు 100 మాక్ టెస్టులు (ఒక్కో టెస్టులో 25 ప్రశ్నలు -5 సార్లు రాసుకోవచ్చు)

అతి ముఖ్యమైన ప్రశ్నలను Multiple Choice విధానంలో ఇస్తున్నాం...
http://tsexams.com/current-affairs-gk/

SI/CONSTABLE/VRO/GROUP.IV
పూర్తి వివరాలకు విజిట్ చేయండి:
https://telanganaexams.com/siconstable-4steps/

TRANCO ఎగ్జామ్స్ కి గ్రాండ్ టెస్టులు
(General Awarenes + Electrical Subject)
15 గ్రాండ్ టెస్టులు (1200 ప్రశ్నల కవరేజ్)

AE/SUB ENGR...GS లో కొన్ని టాపిక్స్ పై ప్రిపరేషన్ మెటీరియల్ కూడా ఇవ్వబడును)
పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి:
https://tsexams.com/tranco-announce/

AEE ఎగ్జామ్స్ డేట్ ను TSPSC ప్రకటించింది.  మార్చి 18న జరుగుతాయి.  అందువల్ల మీరు ఆన్ లైన్ లో జనరల్ స్టడీస్ + CURRENT AFFAIRS మాక్ టెస్టులు రాసుకోడానికి మంచి అవకాశం

ఇంగ్లీష్, తెలుగు మీడియంల్లో మాక్ టెస్టులు... పూర్తి వివరాలకు : https://telanganaexams.com/aee-mock-tests/

 

PC/VRO/GROUP-IV అభ్యర్థులకు టెలిగ్రామ్ యాప్ లో గ్రూప్ తెరిచాం. ఈ కింది లింక్ తో జాయిన్ అవ్వగలరు
https://t.me/joinchat/AAAAAE_6VD9JfcNYH1PH6Q]