Monday, October 21

Latest Trends

నాలుగైదు నెలల్లో నిరుద్యోగ భృతి

నాలుగైదు నెలల్లో నిరుద్యోగ భృతి

Latest News, Latest Trends
రాష్ట్రంలో రాబోయే నాలుగైదు నెలల్లో నిరుద్యోగ భృతిని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. నిరుద్యోగ భృతి పథకం అమలు కోసం విధి విధానాలను స్టడీ చేస్తున్నట్టు సీఎం కేసీఆర్ శాసనసభలో ప్రకటించారు. గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా ఈ నిరుద్యోగుల వివరాలు సేకరిస్తున్నారు. అభ్యర్థుల కటాఫ్ వయస్సు ప్రభుత్వం తెలుసుకోడానికి వీలుగా ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. నిరుద్యోగ భృతిపై వెనక్కి తగ్గేది లేదనీ... అబద్దాలు చెప్పదలచుకోలేదన్నారు ముఖ్యమంత్రి. నాలుగైదు నెలల్లో ఈ పథకం ఖచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. నెలకు రూ.3016 ల చొప్పున నిరుద్యగ భృతి ఇస్తామని ఎన్నికల సమయంలో కేసీఆర్ హామీ ఇచ్చారు. అందుకోసనం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో రూ.1810 కోట్లు కూడా కేటాయించారు. ఏ వయస్సు నుంచి ఏ వయస్సు మధ్యలోపు ఇవ్వాలి... విద్యార్హతలు, ఇతర విధి విధానాలను అధికారులు ఇప్పటికే అధ్యయనం చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లో నిరుద్యోగ
ఆ యాప్స్ తో మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ !

ఆ యాప్స్ తో మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ !

Latest News, Latest Trends
థర్డ్ పార్టీ యాప్స్ తో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇటీవల కాలంలో చాలా యాప్స్ అందుబాటులోకి రావడంతో బ్యాంకు ఖాతాల్లోని నగదును ఒక ఖాతా నుంచి మరో చోటికి బదిలీ చేయడం జనానికి ఈజీ అయింది. ప్రస్తుతం అన్ని బ్యాంకులు కూడా సొంతంగా యాప్స్ ను అందుబాటులోకి తెచ్చాయి. అయితే కొన్ని యాప్స్ క్యాష్ బ్యాక్స్, రివార్డు పాయింట్లు ఇస్తామని ప్రకటిస్తుండటంతో చాలామంది ఏది పడితే అది డౌన్లోడ్ చేసుకుంటున్నారు. పైగా వాటిని డౌన్లోడ్ చేసుకోవాలని తమ మిత్రులు, బంధువులకు ఇన్విటేషన్స్ కూడా పంపుతున్నారు. కస్టమర్లను ఆకట్టుకోడానికి కొన్ని యాప్స్ అయితే మీ అకౌంట్ లో ఫలానా వ్యక్తి వెయ్యి రూపాయలు డిపాజిట్ చేశారు... ఈ లింక్ తో యాప్ డౌన్లోడ్ చేసుకొని... వెయ్యి రూపాయల గిఫ్ట్ పొందండి అంటూ ఊరిస్తున్నాయి. జాగ్రత్త... ఇలాంటి యాప్స్ తోనే మోసగాళ్ళు మీ బ్యాంక్ ఖాతాల్లో డబ్బులను దోచేస్తారు. థర్డ్ పార్టీ యాప్
టెలిగ్రామ్ లో కొత్త ఆప్షన్స్ ! ఇక గ్రూప్ లో 2 లక్షల మంది !!

టెలిగ్రామ్ లో కొత్త ఆప్షన్స్ ! ఇక గ్రూప్ లో 2 లక్షల మంది !!

Latest Trends
సోషల్ మీడియా యాప్ టెలిగ్రామ్ కొత్త ఫీచర్లు ప్రవేశపెడుతోంది. గ్రూప్ మెంబర్స్ లిమిట్ ను 2 లక్షల మందికి పెంచింది. దాంతో ఇకపై గ్రూపులో 2 లక్షల మంది దాకా చేరే అవకాశం ఉంటుంది. అలాగే గ్రూప్ అడ్మిన్స్ కి కూడా కొత్త ఆప్షన్స్ అందిస్తున్నట్టు మెస్సేజ్ లు పంపుతోంది టెలిగ్రామ్ యాప్. కొత్త ఆప్షన్స్ ఇకపై గ్రూప్ లో ఉండే సబ్యులను కొన్ని రకాల కంటెంట్ పెట్టకుండా అడ్డుకోడానికి అవకాశం ఉంటుంది. అలాగే మెసేజ్ లు ఫార్వార్డ్ చేయకుండా కూడా అడ్డుకోవచ్చు. యూజర్ చాట్ లేదా క్లియర్ చాట్ హిస్టరీని డిలీట్ చేస్తే కన్ఫర్మేషన్ అడుగుతుంది. డిలీట్ చేసిన చాట్ ను 5 సెకన్లలోపు తిరిగి పొందే అవకాశం కూడా కల్పిస్తున్నారు. గ్రూప్ సెట్టింగ్స్ కూడా మార్చుకునే అవకాశాన్ని టెలిగ్రామ్ యాప్ కల్పిస్తోంది. గతంలో సూపర్ గ్రూప్స్, బేసిక్ గ్రూప్స్ అనేవి ఉండేవి. వీటిన్నింటినీ ఇకపై గ్రూప్స్ గానే వ్యవహరిస్తారు. థంబ్ నెయిల్స్, సెర్చ్ బార్స్ ని కూడా స్ట
అగ్రవర్ణ పేదలకూ రిజర్వేషన్లు

అగ్రవర్ణ పేదలకూ రిజర్వేషన్లు

Latest News, Latest Trends
అగ్రవర్ణాలు (ఓసీలు) ల్లో పేదలకు కూడా రిజర్వేషన్లు వర్తించేలా చట్టం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థికంగా వెనుకబడిన ఓసీలకు విద్య, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని భావిస్తోంది. దీనికి సంబంధించి మంగళవారం పార్లమెంటులో బిల్లు పెట్టాలని ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం  నిర్ణయించింది. అందుకోసం రాజ్యాంగ సవరణ చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఏడాదికి 8 లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్న అగ్రవర్ణాల్లోని పేదలకు ఈ 10శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి. దీంతో రిజర్వేషన్ల కోటా 50 నుంచి 60శాతానికి చేరే అవకాశం ఉంది. రాజ్యాంగంలోని 15, 16 ఆర్టికల్స్ కి కేంద్ర ప్రభుత్వం సవరణలు చేయాల్సి ఉంటుంది. సార్వత్రిక ఎన్నికల ముందు మోడీ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగ సవరణ బిల్లును మంగళవారం సభలో ప్రవేశపెట్టనున్నారు. బిల్లు ఆమోదం కోసమే శీతాకాల సమావేశాలను మరో 2 రోజుల పాటు పొడిగ
ఇక ఆన్‌లైన్‌ భారీ డిస్కౌంట్లు లేనట్టే !

ఇక ఆన్‌లైన్‌ భారీ డిస్కౌంట్లు లేనట్టే !

Latest News, Latest Trends
30శాతం తగ్గింపు ! బిగ్ డే సేల్ !! దినపత్రికల్లో, టీవీల్లో ఇలాంటి ప్రకటనలు ఇకముందు ఉండకపోవచ్చు. ఆఫ్ లైన్ కన్నా ఆన్‌లైన్‌లోనే ఎక్కువ డిస్కౌంట్స్ ఇచ్చే రోజులు పోతున్నాయి. కొత్త ఇ-కామర్స్ పాలసీ 2019 ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తోంది. దాంతో ఆన్‌లైన్‌ అమ్మకాలకు భారీగా గండిపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొన్న మొన్నటిదాకా ఫ్లిప్ కార్ట్, అమెజాన్ సంస్థలు పోటా పోటీగా డిస్కౌంట్స్ ప్రకటించాయి. దాంతో చాలామంది వినియోగదారులు ఆన్‌లైన్‌ లోనే తమకు కావాల్సిన వస్తువులు కొనుక్కున్నారు. అంతేకాదు కొన్ని సంస్థలైతే బయటి మార్కెట్ కి తమ వస్తువులను రిలీజ్ చేయకుండా కేవలం ఆన్‌లైన్‌ లో ఈ-కామర్స్ సంస్థల ద్వారా అమ్ముకొని భారీగా లాభపడ్డాయి. ఇటు వినియోగదారులకు కూడా డిస్కౌంట్స్ బాగానే అందాయి. అయితే కొత్త ఈ-కామర్స్ పాలసీతో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ బిజినెస్ భారీగా తగ్గే అవకాశముంది. అదే టైమ్ లో స్థానిక వ్యాపారులకు వ్యాపారం పెరి
పంచాయతీ కార్యదర్శుల ఫలితాలపై అధికారుల వివరణ

పంచాయతీ కార్యదర్శుల ఫలితాలపై అధికారుల వివరణ

Latest News, Latest Trends
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పరీక్షలు, ఫలితాలపై వస్తున్న ఆరోపణలకు పంచాయతీ రాజ్ శాఖ అధికారులు వివరణ ఇచ్చారు. ఈ పోస్టుల భర్తీలో రిజర్వేషన్లు 50 శాతం దాటలేదని వివరించారు. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చామని చెప్పారు. ప్రాథమిక కీ విడుదల చేసి... అభ్యంతరాలు తీసుకున్నామనీ... ఆ తర్వాత సబ్జెక్ట్ నిపుణులతో ఫైనల్ కీ తయారు చేయించామని చెప్పారు.  ఆ ఫైనల్ కీ ప్రకారమే పేపర్ కరెక్షన్ చేశామన్నారు. ప్రస్తుతం తాత్కాలిక సెలెక్ట్ లిస్ట్ ప్రకటించామనీ... మార్క్ లిస్టులు, మెరిట్ లిస్టులు కూడా జిల్లాల వారీగా విడుదల చేశామన్నారు పంచాయతీ అధికారులు. అభ్యర్థులకు రాష్ట్ర స్థాయి ర్యాంక్ ఇచ్చామన్నారు. అభ్యర్థులు ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చారో, ఎన్ని ప్రశ్నలకు తప్పు సమాధానం ఇచ్చారో వారి ర్యాంక్ కార్డుల్లో పొందుపరిచామని తెలిపారు. గురువారం నుంచి అభ్యర్థులకు Omr sheets కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు. జూనియర్ పంచ
ONLINE & OFFLINE టెస్టులకు తేడా ఏంటి ? మాక్ టెస్టులతో సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకోవడం ఎలా?

ONLINE & OFFLINE టెస్టులకు తేడా ఏంటి ? మాక్ టెస్టులతో సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకోవడం ఎలా?

Latest News, Latest Trends, Viewers
మేం FBO ఎంట్రన్స్ ఎగ్జామ్ దగ్గర నుంచి దాదాపు ఏడాదిన్నరగా తెలంగాణలో విజయవంతంగా మాక్ టెస్టులు నిర్వహిస్తున్నాం. ఇప్పటికే వేల మంది మా ఎగ్జామ్స్ రాశారు. FRO/FSO దగ్గర నుంచి మొన్నటి జూనియర్ పంచాయతీ కార్యదర్శి దాకా చాలామంది ఉద్యోగాలు పొందారు. నిన్న కూడా చాలామంది మెస్సేజెస్ పెట్టారు. అయితే ఇంకా కొందరికి మా ONLINE టెస్టుల మీద అవగాహన రావడం లేదు. ప్రస్తుతం TSPSC, పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు తదితర సంస్థలు ఆఫ్ లైన్ లో ( ఎగ్జామినేషన్ కేంద్రాల్లో ) పరీక్షలు నిర్వహిస్తున్నాయి. అందువల్ల ఆన్ లైన్ లో టెస్టులు రాస్తే ఉపయోగం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. మా టెస్టులు రాసిన వారికి దీనిపై అవగాహన ఉంది. అయినప్పటికీ ఇంకా ఐడియా రానివాళ్ళకి దీనిపై క్లారిటీ ఇస్తున్నాను. అంతేకాకుండా ఈ టెస్టులతో మీరు మీ నైపుణ్యానికి ఇంకా ఎలా పదును పెట్టొచ్చో కూడా వివరిస్తాను. దాంతో ఖచ్చితంగా మీరు జాబ్ కొట్టే అవకాశం ఉంటుంది. ONLIN
RRB ఎగ్జామ్ ఫీజ్ రిఫండ్ వచ్చిందా ? రిఫండ్ రావాలంటే ఏం చేయాలి ?

RRB ఎగ్జామ్ ఫీజ్ రిఫండ్ వచ్చిందా ? రిఫండ్ రావాలంటే ఏం చేయాలి ?

Latest News, Latest Trends
అసిస్టెంట్ లోకో పైలట్/టెక్నీషియన్ పోస్టుల కోసం RRB నిర్వహించిన కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కి హాజరైన వారికి ఫీజు తిరిగి చెల్లిస్తున్నారు. మీకు ఫీజు రిఫండ్ కావాలంటే ఏం చేయాలి ఓసారి ఈ ఆర్టికల్ చదవండి. RRB ALP/ టెక్నీషియన్ ఎగ్జామినేషన్ 2018 కు సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కు హాజరైన అభ్యర్థుల ఫీజులను RRB రిఫండ్ చేస్తోంది. ఇందులో రిజర్వుడ్ అభ్యర్థులకు మొత్తం ఫీజును రిటర్న్ చేస్తోంది. అలాగే జనరల్ కేటగిరీ అభ్యర్థులకు సంబంధించిన ఫీజును 50శాతం మినహాయించుకొని మిగతావి చెల్లిస్తోంది. అయితే మొదటి దశకు సంబంధించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కి హాజరైన వారికి మాత్రమే ఈ ఫీజును తిరిగి చెల్లిస్తారు. CBT ఎగ్జామ్ కి హాజరు కానివారికి ఎలాంటి ఫీజ్ రిఫండ్ ఉండదు. ఇప్పటిదాకా ఫీజు రిఫండ్ కాని వారికి SMS ద్వారా ఈనెల 17న అభ్యర్థులకు సమాచారం ఇవ్వనుంది. అభ్యర్థులు RRB నోటిఫికేషన్ ప్రకారం అప్లయ్ చేసినప్పుడు చాలామంది త
ప్రధాని మోడీ ఫారెన్ టూర్స్ ఖర్చెంతో తెలుసా ?

ప్రధాని మోడీ ఫారెన్ టూర్స్ ఖర్చెంతో తెలుసా ?

Latest News, Latest Trends
ప్రధాని నరేంద్రమోడీ నాలుగున్నరేళ్ళ కాలంలో విదేశీ టూర్లకి, ప్రభుత్వ పథకాల ప్రచారానికి పెట్టిన ఖర్చులు చూస్తే కళ్ళు తిరగడం ఖాయం. ఈ రెండు కార్యక్రమాలకు మోడీ ప్రభుత్వం పెట్టిన ఖర్చు 920 మిలియన్ డాలర్లు... అంటే దాదాపు 7వేల కోట్ల రూపాయలు... ఇంకా వివరంగా చెప్పాలంటే రూ. 6,620,32,00,000.00 ప్రధాని నరేంద్రమోడీ 2014 నుంచి 2018వరకూ మొత్తం 84 విదేశీ ట్రిప్పులకు వెళ్ళారు. అందుకోసం భారత ప్రభుత్వం రూ.2వేల15 కోట్లు ఖర్చుపెట్టింది. ఆ తర్వాత ప్రధాని నరేంద్రమోడీ ప్రవేశపెట్టిన ప్రాజెక్టులు, ప్రభుత్వ విజయాలను దేశమంతా ప్రచారం చేయడానికి రూ.4వేల604 కోట్లు ఖర్చయ్యాయి. ఇక ప్రతి విదేశీ ప్రయాణానికి ఎయిర్ ఇండియా వన్ విమానం, అందులో సెక్యూర్ హాట్ లైన్ సెటప్ చేసేవారు. ఇవి ప్రతిపక్షాలు ఆరోపించినవి కావు. పార్లమెంటులో సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రులు వీకే సింగ్, రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ చెప్పిన సమాధానాలు ఇవి.
ఇలా చేయకపోతే  మీ డెబిట్/క్రెడిట్ కార్డు బ్లాక్ !!

ఇలా చేయకపోతే మీ డెబిట్/క్రెడిట్ కార్డు బ్లాక్ !!

Latest News, Latest Trends
మీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులు డిసెంబర్ 31 లోపు మార్చుకోవాలి. లేకపోతే వాటిని బ్లాక్ చేస్తాం. SBI తో పాటు అనేక బ్యాంకులు తమ కస్టమర్లకి ఇదే మెస్సేజ్ పంపాయి... ఎందుకు ... ఏ కార్డులు మార్చుకోవాలి... ఓసారి చూద్దాం. మీరు ఇంకా డెబిట్ లేదా క్రెడిట్ కార్డు పాతది లేదా మాగ్నటిక్ స్ట్రిప్ కార్డులు కలిగి ఉంటే... వెంటనే వాటిని మార్చేసుకోండి. EMV చిప్ కలిగిన డెబిట్ లేదా క్రెడిట్ కార్డు లేకపోతే ఇక దాన్ని ఉపయోగించే ఛాన్సే ఉండదు. మీకు డిసెంబర్ 31 దాకా డెడ్ లైన్ ఉంది. అప్పట్లోపు కార్డులు మార్చుకోకపోతే దాన్ని బ్యాంకులు బ్లాక్ చేస్తాయి. SBI తో పాటు మెజార్టీ బ్యాంక్సులు ఇప్పటికే తమ కస్టమర్లకి మెస్సేజ్ లు పంపుతున్నాయి. RBI నిబంధనల ప్రకారం ప్రస్తుతం మీ దగ్గర ఉన్న మెజిస్ట్రిప్ డెబిట్ కార్డులను EMV చిప్ కలిగిన కార్డులుగా మార్చుకోవాలని SBI మెస్సేజ్ లు పంపుతోంది. మెజిస్ట్రిప్ డెబిట్ కార్డులును డిసెంబర్ 31 తర్