Thursday, July 19
Log In

Latest Updates

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో అడ్మిషన్లు

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో అడ్మిషన్లు

Latest News, Latest Updates, Uncategorized
2018-19 సం.నికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో అండర్ గ్రాడ్యుయేట్, పీజీ కోర్సుల ప్రవేశానికి ఆన్ లైన్ ద్వారా ధరఖాస్తులు కోరుతున్నారు. UG కోర్సులు: B.A., B.Com., B.Sc.,B.Lic., PG కోర్సులు: M.A, M.Com., M.Sc., M.Lisc., Pg Diploma, Certificatee Programs 1) MA - తెలుగు మీడియం (2సంవత్సరాలు) అర్థశాస్త్రం చరిత్ర రాజనీతి శాస్త్రం ప్రభుత్వ పాలనాశాస్త్రం సమాజ శాస్త్రం ఇంగ్లీష్ హిందీ, ఉర్దూ 2) ఎంకామ్: రెండేళ్ళు 3) ఎంఎస్సీ : రెండేళ్ళు (ఇంగ్లీష్ మీడియం) మ్యాథమెటిక్స్ /అప్లయిడ్ మ్యాథమెటిక్స్ సైకాలజీ బాటనీ కెమిస్ట్రీ ఎన్విరాన్ మెంటల్ సైన్స్ ఫిజిక్స్ జువాలజీ 4) M.Lic. - మాస్టర్ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ - ఏడాది 5) B.Lic - బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ - ఏడాది 6) PG Diplome in Marketing Management 7) PG Diplome in Business Fina
మేనేజ్ మెంట్ వైద్య సీట్ల భర్తీ నోటిఫికేషన్

మేనేజ్ మెంట్ వైద్య సీట్ల భర్తీ నోటిఫికేషన్

Latest News, Latest Updates
రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు వైద్య కాలేజీల్లో MBBS, BDS కోర్సుల మేనేజ్ మెంట్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఈ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ కాలేజీల్లో B,C (NRI) కేటగిరీ సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. నీట్ ర్యాంక్ ఆధారంగానే యూనివర్సిటీ సీట్లను ఫిలప్ చేస్తారు. ఈనెల 30 నుంచి జులై 5 సాయంత్రం 5 వరకూ విద్యార్థులు అప్లయ్ చేసుకోవచ్చు. 6న మెరిట్ జాబితా తయారు చేస్తారు. మొత్తం 15 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 2100 సీట్లను భర్తీ చేయనున్నారు. వివరాలకు.. www.knruhs.in చూడవచ్చు.
డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ రిలీజ్

డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ రిలీజ్

Latest Updates
రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈనెల 10 నుంచి 26 వరకూ ఆన్ లైన్ లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. రూ.400 ఫైన్ తో మే 25 నుంచి 29 వరకూ అప్లయ్ చేసుకోవచ్చు. మొదటి విడత సీట్లను జూన్4న రెండో విడత సీట్లను జూన్ 19న మూడో విడత సీట్లను జూన్ 30న కేటాయిస్తారు. రెండో విడత వెబ్ ఆప్షన్స్ జూన్ 5 నుంచి 14 వరకూ ఆ తర్వాత 3 విడత వెబ్ ఆప్షన్స్ జూన్ 20 నుంచి 27 వరకూ ఇవ్వడానికి విద్యార్థులకు అవకాశం ఉంది. కాలేజీలు ప్రారంభమైన తర్వాత అంతర్ కాలేజీల మార్పునకు అవకాశం ఇస్తారు. దాంతో కోర్సు కూడా (గ్రూప్ ఛేంజ్ ) చేసుకోవచ్చు. ఎంసెట్ తో దోస్త్ తో లింకేజ్ చేస్తారు. దాంతో ఇంజనీరింగ్ సీట్లు పొందిన విద్యార్థుల యొక్క డిగ్రీ సీట్లు రద్దవుతాయి. దోస్త్ కోసం రాష్ట్రమంతటా 74 హెల్ప్ లైన్ సెంటర్స్ ఏర్పాటుచేశారు. ఇతర వివరాలకు ఈ కింది  వెబ్ సైట్ లో లాగిన్ అవ్వొచ్చు.
పాలీసెట్ ఫలితాలు విడుదల

పాలీసెట్ ఫలితాలు విడుదల

Latest News, Latest Updates
పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ - 2018 ఫలితాలు వెలువడ్డాయి. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ రిజల్ట్స్ రిలీజ్ చేశారు. ఫలితాల కోసం ఈ కింది లింక్ ను క్లిక్ చేయంది. ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ విభాగాల్లోని డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ఈ టెస్ట్ జరిగింది. ఏప్రిల్ 21న జరిగిన పాలీ సెట్ రిజల్ట్స్ ను ఇవాళ విడుదల చేశారు. POLY CET RESULTS కోసం క్లిక్ చేయండి    
JEE (MAINS) రిజల్ట్స్ వెల్లడి

JEE (MAINS) రిజల్ట్స్ వెల్లడి

Latest News, Latest Updates
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో జరిగిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ( JEE - MAINS-2018) ఫలితాలు వెలువడ్డాయి. ర్యాంకులను కూడా CBSE ప్రకటించింది. ఇందులో క్వాలిఫై అయిన వారికి అడ్వాన్స్ రాసే అవకాశం ఉంటుంది. ఈ నెల 8న రాత పరీక్ష, 15,16 తేదీల్లో ఆన్ లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించారు. బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి దేశవ్యాప్తంగా 11 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే... ఇందులో తెలుగు రాష్ట్రాలకుచెందిన 1.50లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. మెయిన్స్ కి కటాఫ్ ను నిర్ణయించి 2.24 లక్షల మందిని అడ్వాన్సుడ్ కి ఎంపిక చేస్తారు. మే 20 న JEE అడ్వాన్సుడ్ ఎగ్జామ్ జరగనుంది. ఈసారి OC కటాఫ్ - 74 మార్కులు OBCలకు - 45 SC లకు - 29 STలకు - 24 CLICK FOR RESULTS
AP EAM CET రిజల్ట్స్ చూసుకున్నారా ?

AP EAM CET రిజల్ట్స్ చూసుకున్నారా ?

Latest Updates
ఏపీ ఎంసెట్ 2018 ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ రాసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్. మీరు రాసిన పేపర్ చెక్ చేసుకునే అవకాశం అధికారులు కల్పించారు. ఇప్పటికే మీ మెయిల్స్ కి మీరు రాసిన జవాబు పత్రాలను పంపారు. మెయిల్స్ చెక్ చేసుకోండి. లేదంటే ఈ లింక్ ద్వారా http://sche.ap.gov.in/eamcet/Eamcet/EAMCET_ResponseSheet.aspx AP EAMCET వెబ్ సైట్ లో మీ రిజిష్ట్రేషన్ నెంబర్, ఎమ్ సెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే... మీ రెస్పాన్స్ షీట్ తెలుస్తుంది. అందులో మీకెన్ని మార్కులు వచ్చాయో చెక్ చేసుకోవచ్చు.
అందుబాటులోకి TS EAMCET హాల్ టికెట్స్

అందుబాటులోకి TS EAMCET హాల్ టికెట్స్

Latest Updates
TS ఎంసెట్ - 2018 హాల్ టిక్కెట్లను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. మెడికల్, అగ్రికల్చర్ విద్యార్థులకు మే 2,3 తేదీల్లో, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఆన్ లైన్ లో పరీక్షలు నిర్వహిస్తారు. హాల్ టికెట్ డౌన్లోడ్ కోసం రిజిష్ట్రేషన్ నెంబర్, ఇంటర్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు నమోదు చేయాలి. హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోడానికి లింక్ http://eamcet.tsche.ac.in/TSEAMCET/EAMCET_GetHallTicket.aspx
OU CET నోటిఫికేషన్ రిలీజ్

OU CET నోటిఫికేషన్ రిలీజ్

Latest Updates
ఉస్మానియా యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్టులకు(2018) నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 2018-19 సంవత్సరానికి  ఉస్మానియాతో పాటు తెలంగాణ, మహాత్మ గాంధీ, పాలమూరు, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీల క్యాంపస్ లు, వర్సిటీల పరిధిలోని కళాశాలల్లో ప్రవేశాలకు ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించనున్నారు.   PG కోర్సులు, PG డిప్లొమా కోర్సులు, 5 యేళ్ళ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ కోసం దరఖాస్తులు కోరుతున్నారు. ఎంట్రన్స్ టెస్టును కంప్యూటర్ ద్వారా ఆన్ లైన్ ద్వారా నిర్వహిస్తారు.  ముఖ్యమైన తేదీలు: ఆన్ లైన్ రిజిస్ట్రేషన్, అప్లికేషన్ల స్వీకరణ ప్రారంభం : 2018 ఏప్రిల్ 21 నుంచి అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేది:   2018 మే 19 రూ.200లతో అప్లికేషన్ల సమర్పణకు : 2018 మే 26 రూ.1000తో అప్లికేషన్ల సమర్పణకు : 2018 జూన్ 1 ఎంట్రన్స్ పరీక్షలు : 2018 జూన్ 4 నుంచి 13 వరకూ నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు : www.ouadmi
త్వరలో టెట్ నోటిఫికేషన్

త్వరలో టెట్ నోటిఫికేషన్

Latest News, Latest Updates
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్ ) నోటిఫికేషన్ జారీ చేయడంపై విద్యాశాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. రాష్ట్రంలో బీఈడీ, డీఈడీ పూర్తి చేసుకున్న 2.5లక్షల మంది ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. 2017 జూలై 23న టెట్ నిర్వహించింది విద్యాశాఖ. ఏడాది తిరక్కముందే మరోసారి టెట్ నిర్వహించాలన్నది ఆలోచిస్తున్నారు. ఈ ప్రతిపాదనలు ప్రభుత్వం ముందు ఉంచుతున్నారు. సర్కార్ ఓకే చెబితే టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. ఇప్పటికే 2.5 లక్షల మంది టెట్ కోసం ఎదురు చూస్తుండగా, బీఈడీ, డీఈడీ ఫైనలియర్ చదువుతున్న మరో 25 వేల మంది అభ్యర్థులు కూడా ఈ ఎగ్జామ్ కు హాజరవుతారని విద్యాశాఖ అంచనా వేస్తోంది.
నీట్ హాల్ టికెట్స్ రెడీ  !

నీట్ హాల్ టికెట్స్ రెడీ !

Latest Updates
MBBS, BDS కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష(నీట్) హాల్ టికెట్స్ CBSE వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి.  మే 6న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగుతుంది.  హాల్‌టికెట్  డౌన్‌లోడ్ చేసుకోడానికి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు ఉండాలి. నీట్ పరీక్షను హిందీ, ఇంగ్లీష్‌తోపాటు తెలుగు, తమిళం, గుజరాతీ, కన్నడ, మరాఠీ, ఒరియా, బెంగాలీ, అస్సామీ భాషల్లో నిర్వహిస్తారు. ఈ కింది లింక్ ద్వారా నీట్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు... https://cbseneet.nic.in/cbseneet/Welcome.aspx